Shuru
Apke Nagar Ki App…
గణనాథుడిని దర్శించుకున్న బుట్టా రేణుక–బుట్టా శివ నీలకంఠ దంపతులు ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మిలటరీ కాలనీలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ దంపతులు దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సుఖసంతోషాలు, రైతుల సంక్షేమం, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.
K AMPAIAH ACHARI
గణనాథుడిని దర్శించుకున్న బుట్టా రేణుక–బుట్టా శివ నీలకంఠ దంపతులు ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మిలటరీ కాలనీలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ దంపతులు దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సుఖసంతోషాలు, రైతుల సంక్షేమం, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు 14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/- అన్నదానం హుండీ Rs.10,76,772/- మొత్తం ,31,49,565/- సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ * 2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.2
- ప్రత్యేకంగా రెండవ రోజు గణనాథునికి మంగళహారతులు ఇస్తున్న మహిళా మణులు ( కోడుమూరు శురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోటకొండ సురేష్ ఇంటి సమీపంలో రెండవ రోజున గణనాథుని ప్రత్యేకంగా మహిళా మణులు మంగళ హారతులు ఇచ్చి గణనాథుని అనుగ్రహం ప్రసాదించాలని భక్తుల కోరిక.సంపూర్ణంగా వర్షాలు కురవాలని అందుకే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా మణులు శురు న్యూస్ తో తెలిపారువారు.1
- గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.2
- సాసనూల్ గ్రామం 1 వార్డు మంచి నీళ్లు కష్టాలు తీర్చిన గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారిని తల్లి దండ్రి తో పోల్చిన టీ.మ ద్ద మ్మ గారు తెలిపారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల మంచి నీళ్ల కష్టాలు చూసి గ్రామ సర్పంచ్ గారు వెంటనే స్పందించి మంచి నీళ్ల ట్యాంక తెప్పించారు ఇలాగ నే ప్రతిరోజు వస్తే బాగుంటుంది చిన్న వీరన్న చిట్టెమ్మ టీ మ ద్ద మ్మ రవి స రిత మ్మ గారు వార్డు సభ్యుడు గారు తెలిపారు4
- చర్మ డప్పు కళాకారుల పెన్షన్ గడువు పెంచాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగించాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ ఎమ్మిగనూరు: చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న పెన్షన్ దరఖాస్తుల గడువును మరింత పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ అందేలా నిబంధనలను సరళీకరించి, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల, మూడు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, చర్మకారులు, డప్పు కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఆంటోనీ పేర్కొన్నారు. పెన్షన్ కోసం చర్మకారులు, డప్పు కళాకారులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్న కొన్ని నిబంధనలు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద చర్మకారులు, డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారాయని ఆంటోనీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ (Self Declaration) విధానం వల్ల అర్హులైన పలువురు కళాకారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న కళాకారుల వద్ద ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు తదితర పత్రాలు లేకపోవడం వల్ల వారు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా సంప్రదాయ చర్మకార వృత్తిని, డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులకు ఇటువంటి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు. ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు అవకాశం కల్పించాలి ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను నిర్ధారించే విధంగా ఆన్‌లైన్ ప్రక్రియను కొనసాగించాలని ఆంటోనీ కోరారు. కుటుంబ వివరాలు, చిరునామా, వృత్తి తదితర అంశాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అద్దె ఇళ్లలో నివసించే కళాకారులకు కరెంట్ బిల్లు, హౌస్ ట్యాక్స్ వంటి పత్రాల నిబంధనలను సడలించాలని, వారి సంప్రదాయ వృత్తిని ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలని సూచించారు. గడువు పొడిగించి ప్రతి అర్హుడికి అవకాశం ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరింత పొడిగించాలని ఆంటోనీ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చర్మకారులు, డప్పు కళాకారులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొంత సమయం కేటాయించి, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క కళాకారుడు కూడా కేవలం నిబంధనల కారణంగా పెన్షన్‌కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్మకారులు, డప్పు కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకరించి, ఆధార్–రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.1
- వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.1
- జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు 9వ గేటు మరమ్మతు పనులు పూర్తి జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రూ.2.40 లక్షలతో మరమతు పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యకు ఉన్నతాధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం చూసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.1
- గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2