logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం మండలం | ఆగస్టు 26: అశ్వాపురం మండలం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు పనులను వేగవంతం చేస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు సాగునీరు అందించి వారి వ్యవసాయానికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Ramprasad Pothuganti
Ramprasad Pothuganti
Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 hr ago
ba3e4ece-cbb6-433a-bd7d-a9db60ff6308

మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం మండలం | ఆగస్టు 26: అశ్వాపురం మండలం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు పనులను వేగవంతం చేస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ

a4beea43-94fe-4c6c-9cd8-a112fd898bbf

సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు సాగునీరు అందించి వారి వ్యవసాయానికి భరోసా కల్పించడమే తన లక్ష్యమని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సారపాకలో లారీ ఢీ.. ట్రాక్టర్ డ్రైవర్‌కు త్రివ గాయాలు... సారపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్‌ గేట్‌ వద్ద లారీ, ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నూతన బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రిడ్జి ఎంట్రన్స్‌ వద్ద మట్టి, ఇసుక పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో వాహనాలు స్కిడ్‌ అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే మట్టి, ఇసుకను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మార్గాన్ని సిద్ధం చేయాలని కోరుతున్నారు.
    3
    సారపాకలో లారీ ఢీ.. ట్రాక్టర్ డ్రైవర్‌కు త్రివ గాయాలు...
సారపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్‌ గేట్‌ వద్ద లారీ, ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నూతన బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రిడ్జి ఎంట్రన్స్‌ వద్ద మట్టి, ఇసుక పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో వాహనాలు స్కిడ్‌ అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే మట్టి, ఇసుకను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మార్గాన్ని సిద్ధం చేయాలని కోరుతున్నారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    15 hrs ago
  • రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    1
    రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు..
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    1
    ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను  నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు
ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను  నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
    1
    వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు
    1
    సోదరా ABN రాధాకృష్ణ  మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా
కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది
ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది
మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు
మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది
ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ
కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా
ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు
    user_KOMURAIAH ANAGANDULA
    KOMURAIAH ANAGANDULA
    ములుగు, ములుగు, తెలంగాణ•
    1 hr ago
  • కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు..సీఎం రేవంత్ ను కోరిన బాలుడు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు కొత్త బస్సులు ఇస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యలను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు కోరారు.
    1
    కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు..సీఎం రేవంత్ ను కోరిన బాలుడు.
సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు
కొత్త బస్సులు ఇస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యలను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు  కోరారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి: మాజీ ఎమ్మెల్యే పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
    1
    పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి: మాజీ ఎమ్మెల్యే
పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • వైరల్ వీడియో రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు మహిళ ఫైర్ స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా అని ప్రశ్నిస్తూ, రేపు ప్రభుత్వం మారితే ఈ కార్డుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్లపైనా ఫొటోలు వేస్తారా అని ఆమె ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం 'ఎక్స్' లో వైరల్ గా మారింది.
    1
    వైరల్ వీడియో రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు మహిళ ఫైర్
స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా అని ప్రశ్నిస్తూ, రేపు ప్రభుత్వం మారితే ఈ కార్డుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్లపైనా ఫొటోలు వేస్తారా అని ఆమె ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం 'ఎక్స్' లో వైరల్ గా మారింది.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • Writing హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    1
    Writing
హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.