అవినీతి ఆరోపణలతో డిమోషన్ గురైన కేవై లక్ష్మిని విధుల నుంచి తొలగించాలి* *డిమోషన్ గురైన కేవై లక్ష్మి పై సమగ్ర న్యాయ విచారణ చేపట్టి, విధుల నుంచి తొలగించాలి* విద్యార్ధి నాయకులు సాకే హరి, రావులచెరువు సురేష్ ధర్మవరం, నమస్తే సీమాంద్ర 16:-ధర్మవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓగా పనిచేసిన కేవై లక్ష్మి అవినీతిపై చర్యలు తీసుకొని ఆమెను విధుల నుండి తొలగించాలంటూ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ని ఏ ఓ కు వినతి పత్రం అందించిన విద్యార్ధి నాయకులు సాకే హరి రావులచెరువు సురేష్. అనంతరం వారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలతో, అంగన్వాడి కార్యకర్త ల దగ్గర నుండి కమిషన్ల రూపంలో పెద్ద ఎత్తున దండుకున్నారని, ఓబులాయపల్లి సెంటర్ 1 సంబంధించి సిడిపిఓ అతి సమీప బంధువు కావడంతో ఆ సెంటర్కు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పౌష్టిక ఆహారాలన్నీ వేరే మార్గంలో అమ్ముకోవడం, అనవసరమైన వాటికి ప్రభుత్వం నుండి బిల్లులకు మంజూరు చేయించడం. అంగన్వాడి నియామకాల్లో అనేకమంది సామాన్య ప్రజల వద్ద నుండి లంచాలు తీసుకొని స్థానికంగా లేకపోయినా అంగన్వాడీ ఆయాలుగా నియమించారు.అదేవిధంగా ప్రతి సెంటర్కు వచ్చే ప్రభుత్వం నుండి మెయింటెనెన్స్ ఇలాంటి నిధులు అన్ని కూడా స్వాహా చేశారు. కొద్దిమంది సూపర్వైజర్లకు మెడికల్ లీవ్ లో ఉన్నప్పటికీ వారికి జీతాలు మంజూరు చేసి, పర్సంటేజ్ రూపంలో కమిషన్ తీసుకున్నారు.ఇలా అనేక అవినీతి ఆరోపణలు ఉన్న క్రమంలోని ఆమెను ఈ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బదిలీ చేయడం జరిగింది . ఇలాంటి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడే ఏ సిడిపిఓ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

- అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- చింతల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- కాలువలో తీసిన డ్రైనేజీ చెత్తను తరలించండి ..! గుత్తి మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలవలో చెత్తాచెదారాన్ని బయటకి తీశారు. అయితే వారం రోజులు గడుస్తున్నా రోడ్డుపై ఉన్న చెత్తను తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పాదచారులు, వాహనాదారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని అధికారులను పాదచారులు విన్నవించారు.1
- మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..1
- బద్వేలు: పట్టణ అభివృద్ది సొసైటి సభ్యుల సమావేశంలో అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేలు మునిసిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు జరిగినా నేటికీ పట్టణం లోగల ప్రజలకు మౌళిక సదుపాయాల పూర్తిగా అందలేదని,శానిటరీ వర్కర్ల సంఖ్య పెంచి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని,యన్.జి.ఒ కాలనీలో ఉన్న పబ్లిక్ పర్పస్ 96 సెంట్లలో పార్కు,లైబ్రరీ చెన్నంపల్లె వద్ద స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు.ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్షులు యస్.ఎ.అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ పట్టణం లోని వీధుల రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, రోడ్లు గుంతలు పడి,డ్రైనేజీలు లేక వాహనదారులు,పాదచారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు టైఫాయిడ్ లాంటి దోమకాటు జ్వరాలతో బాధపడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మైన్ రోడ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా సంబధిత అధికారులు చర్యలు చేపట్టాలని, పట్టణానికి మధ్యలో ఉన్న నాగులచెరువును మధ్యలో బుద్ద విగ్రహావిగ్రహాన్ని ఏర్పాటుచేసి వినోద పర్యాటక చెరువుగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటి గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు, గనుమంతు రాజేష్ కుమార్,షేక్ మాహీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సరిత స్కూల్ కరస్పాండెంట్ రాము మరియు బిసి సంఘం నాయకులు వాకారామయ్య మరియు టెలిఫోన్ బాలయ్య మరియు చిన్న కేశం పల్లెమాజీ సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.1
- Post by MAA PUNGANUR NEWS1
- చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో ఘనంగా స్మశాన కొల్ల.. కుప్పం పట్టణంలో అంకాళపరమేశ్వరి జాతర మహోత్సవమైన శ్మశాన కొల్ల మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలసిన అంకాళ పరమేశ్వరి అమ్మవారికి శ్మశాన కొల్ల పేరుతో మత్స్యకారులు నిర్వహించే జాతరలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్మశానంలో అమ్మవారి భారీ ప్రతిరూపాన్ని బంకమన్నుతో ఏర్పాటు చేశారు. అనంతరం కొత్తపేట నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకొచ్చారు. శ్మశానంలో సమాధులు తవ్వి మనిషి అస్థికలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు వెలిగించారు. అమ్మవారి ఉత్సవమూర్తికీ మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు కొరడాలు చేతపట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలిచారు. పదుల సంఖ్యలో భక్తులు రెండు చేతులూ జోడించి పైకెత్తి, వారి ఎదుట మోకాళ్లమీద వరుసగా బారులు తీరారు. దెబ్బదెబ్బకూ భక్తులు చేస్తున్న అమ్మవారి నామజపంతో పరిసరాలు మార్మోగాయి. అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు. స్మశాన కోళ్లను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.1
- బద్వేలు :న్యాయవాది మల్లారపు దామోదరం వినతి బద్వేలు మండలంలోని అనంతరాజపురం లక్ష్మీ పాలెం గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నది గ్రామంలో ఉన్న వీధులలో చాలామంది బాత్రూం నీళ్లు రోడ్డుపైకి వదులుతున్నారు. చాలామందికి చెప్పిన వారు వినిపించుకోవడం లేదుఅని అంటున్నారు. గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లాలంటే రోడ్డుపై నుంచి ఉన్న నాలుగు వీధుల లో ఏదో ఒక వీధిలో భక్తులు ఆలయానికి వెళ్తుంటారు. ప్రతిరోజు రోడ్డుపై నీళ్లు పాడుతున్నందున రోడ్డు బంక పట్టి కాలు పెడితే జారిపడే పరిస్థితి ఉన్నది. మరో 10 రోజుల్లో గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కువ మంది భక్తులు ఈ నాలుగు వీధుల గుండా రాకపోకలు సాగిస్తారు .గ్రామంలో బుచ్చం గారి వీధి, కుమ్మరి వీధి ,యామయ్య గారి వీధి, ఆనుగొంది వారి వీధి ఈ నాలుగు వీధుల్లో నిత్యము రోడ్డుపై నీళ్లు పాడుతుంటాయి సచివాలయ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదు అందువలన జిల్లా కలెక్టర్కు ,బద్వేలు ఎంపీడీవోకు, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారికి, అనంతరాజపురం గ్రామపంచాయతీ కార్యదర్శి వినతి పత్రాలు నా ద్వారా పంపించాను అన్ని అన్నారు.ఈ విషయము జర్నలిస్టు మీ పత్రికలలో వేసి గ్రామంలో అపరిశుభ్రత లేకుండా అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని అనంతరాజపురం వాసి న్యాయవాది మల్లారపు దామోదర్ కోరుతున్నారు.1