భక్తిశ్రద్ధలతో వినాయకుడి ప్రతిష్ఠాపన... ముస్తాబైన మండపాలు.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.... ఖానాపూర్, సెప్టెంబరు 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలవ్యాప్తంగా వినాయక మండపాలు ముస్తాబయ్యాయి. వివిధ ప్రాంతాల్లో భక్తులు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠాపించి, అయ్యగార్ల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాలను విద్యుత్ దీపాలు, రంగురంగుల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఖానాపూర్ మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గ్రామంలోని ప్రతి కూడలిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అశోక్‌నగర్‌లోని జైశ్రీరామ్, వినాయక బజార్ తదితర కాలనీలలో నూ భారీ వినాయక విగ్రహాన్ లను ప్రతిష్ఠించారు. కాలనీవాసులు కుటుంబ సమేతంగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చిన్నారులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. వినాయక మండపాల వద్ద భక్తి గీతాలు, ప్రత్యేక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందాలని గణనాథుడిని వేడుకున్నారు.
భక్తిశ్రద్ధలతో వినాయకుడి ప్రతిష్ఠాపన... ముస్తాబైన మండపాలు.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.... ఖానాపూర్, సెప్టెంబరు 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలవ్యాప్తంగా వినాయక మండపాలు ముస్తాబయ్యాయి. వివిధ ప్రాంతాల్లో భక్తులు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠాపించి, అయ్యగార్ల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాలను విద్యుత్ దీపాలు, రంగురంగుల అలంకరణలతో
సుందరంగా తీర్చిదిద్దారు. ఖానాపూర్ మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గ్రామంలోని ప్రతి కూడలిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అశోక్‌నగర్‌లోని జైశ్రీరామ్, వినాయక బజార్ తదితర కాలనీలలో నూ భారీ వినాయక విగ్రహాన్ లను ప్రతిష్ఠించారు. కాలనీవాసులు
కుటుంబ సమేతంగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చిన్నారులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. వినాయక మండపాల వద్ద భక్తి గీతాలు, ప్రత్యేక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందాలని గణనాథుడిని వేడుకున్నారు.
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం -------------------------------- యాంకర్: ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు2
- నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి................. MLG: ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జంపాల రవీందర్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెండో మహాసభ సందర్భంగా నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షౌరవృత్తిలోకి ఇతర కులాల రాకను నిరోధించాలని, దేవాలయాలు, జాతరల్లో తలనీలాల ఆదాయంలో వృత్తిదారులకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.1
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1