డే విత్ లైబ్రరీ విజేతలకు నగదు పురస్కారం ప్రదానం పుస్తక పఠనం చేసిన విద్యార్థులకు2500/-నగదు,మేమెంటోను అందజేశారు మోత్కూరు శాఖ గ్రంధాలయం వేసవి సెలవులు మే 11 నుండి జూన్ 11 వరకు నెల రోజులపాటు నిర్వహించిన 'డే విత్ లైబ్రరీ' కార్యక్రమంలో పాల్గొని, పుస్తక పఠనం చేసిన విద్యార్థులకు ఈరోజు 2500/-నగదు, మేమెంటోను అందజేశారు.స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులు సెల్ఫోన్ కు బానిసలు కాకుండా, వేసవిలో తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా గ్రంథాలయాల బాట పట్టించేందుకు వినూత్నంగా చేపట్టిన 'డే విత్ లైబ్రరీ' కార్యక్రమం అభినందించడం జరిగినది అన్నారు. పాఠశాల స్థాయి నుడే విద్యార్థులను గ్రంథాలయాల బాట పట్టించి పుస్తక పఠనం అలవాటు చేయించడం అభినందించదగ్గ విషయం అన్నారు.గ్రంథాలయంలో ఉన్న విలువైన పుస్తకాలను చదవడం ద్వారా విషయ పరిజ్ఞానంతో పాటు మానసిక వికాసం పెంపొందుతుందన్నారు. గ్రంథాలయాల ద్వారా క్రమశిక్షణతో కూడిన పుస్తక పఠనంతో విద్యార్థులు ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చన్నారు. డే విత్ లైబ్రరీ కార్యక్రమంలో పిల్లలకు ఇబ్బందులు కలగకుండా పుస్తక పఠనం సమయంలో స్నాక్స్ అందించడం వారిని ప్రోత్సహించడమే అన్నారు.భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహణలో తన వంతు పాత్ర ఎప్పటికీ ఉంటుందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న వారి తల్లిదండ్రులు పల్లెర్ల సరస్వతి రంగయ్య జ్ఞాపకార్థం నలుగురు విద్యార్థులకు బహుమతులు.అందజేశారు.గ్రంథాలయానికి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్య గిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సూరోజు భాస్కరాచారి, మోత్కూరు విజయలక్ష్మి ట్రస్ట్ మెమోరియల్ చైర్మన్ మోత్కూరి బ్రహ్మచారి అమెరికా నుండి సందేశాన్ని అందించారు. అనంతుడు ఫౌండేషన్ చైర్మన్ మోత్కూరి శ్రీనివాస్, పుట్ట దయాకర్, నాగలి సంధ్య సైదులు విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందించారు.మహమ్మద్ అలీ తన తమ్ముడు జానీ జాపకార్థం మేమేంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కురిమిళ్ల ప్రమీల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు,సీనియర్ పాత్రికేయులు ఎస్. ఎన్. చారి, గ్రంథాలయ వైస్ చైర్మన్ పోచం బిక్షపతి, డైరెక్టర్ చేకూరి బిక్షం, రేణిగుంట ప్రణతి, మహమ్మద్ రఫీ, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మర్రి ఆనందం, బయ్యని రాజు, ఉయ్యాలా అంజయ్య, లైబ్రరీ ఇంచార్జ్ చిలకమర్రి బాబు చారి, కొయ్యలకారి జహంగీర్,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దాతలను ఘనంగా సన్మానించడం జరిగింది.
డే విత్ లైబ్రరీ విజేతలకు నగదు పురస్కారం ప్రదానం పుస్తక పఠనం చేసిన విద్యార్థులకు2500/-నగదు,మేమెంటోను అందజేశారు మోత్కూరు శాఖ గ్రంధాలయం వేసవి సెలవులు మే 11 నుండి జూన్ 11 వరకు నెల రోజులపాటు నిర్వహించిన 'డే విత్ లైబ్రరీ' కార్యక్రమంలో పాల్గొని, పుస్తక పఠనం చేసిన విద్యార్థులకు ఈరోజు 2500/-నగదు, మేమెంటోను అందజేశారు.స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులు సెల్ఫోన్ కు బానిసలు కాకుండా, వేసవిలో తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా గ్రంథాలయాల బాట పట్టించేందుకు వినూత్నంగా చేపట్టిన 'డే విత్ లైబ్రరీ' కార్యక్రమం అభినందించడం జరిగినది అన్నారు. పాఠశాల స్థాయి నుడే విద్యార్థులను గ్రంథాలయాల బాట పట్టించి పుస్తక పఠనం అలవాటు చేయించడం అభినందించదగ్గ విషయం అన్నారు.గ్రంథాలయంలో ఉన్న విలువైన పుస్తకాలను చదవడం ద్వారా విషయ పరిజ్ఞానంతో పాటు మానసిక వికాసం పెంపొందుతుందన్నారు. గ్రంథాలయాల ద్వారా క్రమశిక్షణతో కూడిన పుస్తక పఠనంతో విద్యార్థులు ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చన్నారు. డే విత్ లైబ్రరీ కార్యక్రమంలో పిల్లలకు ఇబ్బందులు కలగకుండా పుస్తక పఠనం సమయంలో స్నాక్స్ అందించడం వారిని
ప్రోత్సహించడమే అన్నారు.భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహణలో తన వంతు పాత్ర ఎప్పటికీ ఉంటుందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న వారి తల్లిదండ్రులు పల్లెర్ల సరస్వతి రంగయ్య జ్ఞాపకార్థం నలుగురు విద్యార్థులకు బహుమతులు.అందజేశారు.గ్రంథాలయానికి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్య గిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సూరోజు భాస్కరాచారి, మోత్కూరు విజయలక్ష్మి ట్రస్ట్ మెమోరియల్ చైర్మన్ మోత్కూరి బ్రహ్మచారి అమెరికా నుండి సందేశాన్ని అందించారు. అనంతుడు ఫౌండేషన్ చైర్మన్ మోత్కూరి శ్రీనివాస్, పుట్ట దయాకర్, నాగలి సంధ్య సైదులు విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందించారు.మహమ్మద్ అలీ తన తమ్ముడు జానీ జాపకార్థం మేమేంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కురిమిళ్ల ప్రమీల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు,సీనియర్ పాత్రికేయులు ఎస్. ఎన్. చారి, గ్రంథాలయ వైస్ చైర్మన్ పోచం బిక్షపతి, డైరెక్టర్ చేకూరి బిక్షం, రేణిగుంట ప్రణతి, మహమ్మద్ రఫీ, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మర్రి ఆనందం, బయ్యని రాజు, ఉయ్యాలా అంజయ్య, లైబ్రరీ ఇంచార్జ్ చిలకమర్రి బాబు చారి, కొయ్యలకారి జహంగీర్,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దాతలను ఘనంగా సన్మానించడం జరిగింది.
- జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.1
- జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.. ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా హనుమకొండ: నగరంలోని బాలసముద్రం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, వివిధ కేసుల్లో జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం, భిన్నాభిప్రాయాలను అణచివేసే చర్యలను నిలిపివేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆగస్టు 29న జరిగే మహా ధర్నాలో ప్రజాసంఘాలు, విద్యార్థి, కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజకీయ ఖైదీల విడుదలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐక్య వేదిక నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి హసన్‌పర్తి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1
- ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్) ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు బ్రేకింగ్ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్).. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.1