*రబీ ధాన్యం సేకరణ 2025-26కు సమగ్ర సన్నద్ధత* *రైతులకు కనీస మద్దతు ధర అందించడమే లక్ష్యం* రాజమహేంద్రవరం, తేది: 31.03.2026 *జిల్లాలో 256 పీపీసీ కేంద్రాల ఏర్పాటు – సమన్వయంతో సమర్థవంతమైన కొనుగోళ్లు చేపట్టాలి* - కలెక్టర్ కీర్తి చేకూరి - జేసి మేఘా స్వరూప్ మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ సమక్షంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత 2025-26 రబీ సీజన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధతపై అంశాల వారీగా సమీక్ష నిర్వహిస్తూ, రైతులు పండించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP)ను సమయానికి అందేలా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గత సీజన్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. గతంలో అవకతవకలకు పాల్పడిన, రైతులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు మరియు మిల్లర్లను గుర్తించి ప్రస్తుత సేకరణ ప్రక్రియకు దూరంగా ఉంచాలని కీర్తి చేకూరి ఆదేశించారు. గన్ని బ్యాగుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా CSDT లు దీనికి బాధ్యత వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కోతలు జరిపిన ధాన్యాన్ని తక్షణమే సేకరించి రవాణా చేయడానికి తగిన వాహనాలను సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే ఒకే రోజు 30 వేల మెట్రిక్ టన్నుల వరి తరలించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. జిల్లాలో గత ఖరీఫ్ సీజన్‌లో 2557 వాహనాలు రిజిస్టర్ కాగా, అందులో 2190 వాహనాలు వినియోగంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల వద్ద సుమారు 1100 ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాహనాలను ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. GPS పరికరాలు అమర్చిన 2190 వాహనాలు అవసరమని, ప్రతి వాహనానికి ₹1,400 చొప్పున GPS రీన్యువల్ చార్జీలను వసూలు చేసి విక్రేతకు చెల్లించాలని వ్యవసాయ, PACS సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. మిల్లర్ల బ్యాంక్ గ్యారంటీల విషయంలో వారి సామర్థ్యానికి అనుగుణంగా వసూళ్లు చేయాలని, ఆమేరకు త్వరితగతిన సమీకరించాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం సేకరణ, రవాణా ప్రక్రియల పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి *8309487151* నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన వారి వివరాలను ముందుగానే సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు APSCSCL ద్వారా ఫార్మ్‌గేట్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో వరి సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. కామన్ గ్రేడ్ వరికి రూ.2,369/- మరియు ఇతర గ్రేడ్‌కు రూ.2,389/- మద్దతు ధర నిర్ణయించబడింది. జిల్లాలో ఈ-క్రాప్ నమోదైన విస్తీర్ణం 2,14,831 ఎకరాలు కాగా, మొత్తం సాగు విస్తీర్ణం 2,19,831 ఎకరాలు. అంచనా వరి ఉత్పత్తి 9,73,747 మెట్రిక్ టన్నులుగా అధికారులు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్‌లో 256 పీపీసీ (ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయడం జరుగుతోందని, అదనంగా డి.ఆర్.డి.ఏ ద్వారా కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే ధాన్యం తూకం, రసీదు, చెల్లింపులు జరిగేలా సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా, వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుని ఏ ప్రాంతంలో ఎప్పుడు కోతలు జరుగుతాయో ముందుగానే గుర్తించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, రవాణా, నిల్వ, మిల్లింగ్ ప్రక్రియలు సమర్థవంతంగా జరిగేలా ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని జేసి ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా రోజువారీ పర్యవేక్షణ చేపట్టి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మేఘా స్వరూప్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, జిల్లా మేనేజర్ (సి.ఎస్) బి. గణేష్ కుమార్, ఆర్డీవోలు కె. ఆనందరావు, ఆర్. శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ----------------------- జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.

- మండపేట టౌన్ న్యూస్... అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- Post by SS NEWS1
- Post by V Ramarao2
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- Post by Shyam1
- Post by Adimlamrambabu Adimlamrambabu1