శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండలో ఓ వ్యక్తి వినూత్న నిరసనకు దిగారు. కాలనీ రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ గుండు చేయించుకుని అధికారుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాయిస్ ఓవర్: పెనుకొండ పట్టణంలోని దర్గాపేట్ ఉప్పర్ పేట కు చెందిన సయ్యద్ నవాజ్ భాష…తమ కాలనీ రోడ్డు అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత రోడ్డును తవ్వేసి పది రోజులు గడిచినా… ఇప్పటివరకు కొత్త రోడ్డు వేయకుండానే అర్ధాంతరంగా వదిలేశారని ఆరోపించారు. దీంతో చిన్న పిల్లలు, ముసలి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులకు కనువిప్పు కలగాలని భావించిన నవాజ్ భాష… దేవుడికి తలనీలాలు సమర్పించినట్టుగా “రోడ్డు బాగుపడాలి” అనే నినాదంతో రోడ్డుపైనే గుండు చేయించుకుని నిరసన తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు… ఇలాంటి వినూత్న నిరసనలు ఇప్పుడు పెరుగుతున్నాయి. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండలో ఓ వ్యక్తి వినూత్న నిరసనకు దిగారు. కాలనీ రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ గుండు చేయించుకుని అధికారుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాయిస్ ఓవర్: పెనుకొండ పట్టణంలోని దర్గాపేట్ ఉప్పర్ పేట కు చెందిన సయ్యద్ నవాజ్ భాష…తమ కాలనీ రోడ్డు అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత రోడ్డును తవ్వేసి పది రోజులు గడిచినా… ఇప్పటివరకు కొత్త రోడ్డు వేయకుండానే అర్ధాంతరంగా వదిలేశారని ఆరోపించారు. దీంతో చిన్న పిల్లలు, ముసలి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులకు కనువిప్పు కలగాలని భావించిన నవాజ్ భాష… దేవుడికి తలనీలాలు సమర్పించినట్టుగా “రోడ్డు బాగుపడాలి” అనే నినాదంతో రోడ్డుపైనే గుండు చేయించుకుని నిరసన తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు… ఇలాంటి వినూత్న నిరసనలు ఇప్పుడు పెరుగుతున్నాయి. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బంగారు జాల కు చెందిన మహిళపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనతో మాట్లాడుకుందామని చెప్పి కోపంతో ఆమెపై బీరు సీసా, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బంగారు జలకకు చెందిన తాటి నికిత (24) ఒక కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మండల పరిధిలోని కరకవాగు ప్రాంతానికి చెందిన వజ్జా పవన్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం నటరాజ్ సెంటర్ వద్ద ఆమెను అడ్డగించి వేధించడమే కాకుండా, అందరి ముందూ భయభ్రాంతులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. ఫిర్యాదు రాసిమ్మని సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుండి బయటకు వస్తున్న క్రమం లో, పవన్ మరో వ్యక్తి (ఆటో డ్రైవర్) కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడని యువతి తెలిపింది.. పవన్, అక్కడ యువతిపై అత్యాచారం చేసి,బీరు సీసా, కర్రతో కొట్టడంతో ఆమె తల, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలిని ఆటోలోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి నిందితుడు పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది... ప్రస్తుతం బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.4
- పెళ్లికి వచ్చి అనంతలోకానికి.. విషాదంలో మహాదేవుని గూడెం గ్రామం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమాట్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన బోల్లేపల్లి సారయ్య (50) అనే వ్యక్తి కోమాట్లగూడెం గ్రామంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుక అనంతరం బహిర్భూమికి వెళ్లిన సారయ్య, ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న పెద్ద చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించే లోపే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపాల్సిన పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా మరణ వార్త వినడంతో విషాదం నెలకొంది.1
- తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటోజర్నలిస్టుల అవార్డు ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్, నాంపల్లి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఏం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నల్గొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ అవార్డు అందుకున్నరు1
- Post by Bondhu Suresh1
- బద్వేలు అర్బన్ ఏప్రిల్ 05 : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మైదుకూరు రోడ్డు అన్న క్యాంటీన్ మంచినీటి చలివేంద్రం వద్ద బద్వేలు పట్టణానికి చెందిన పిండి రిషికేశగుప్త (పెద్దశెట్టి) వారి సతీమణి నళిని భారతి జన్మదినోత్సవం పురస్కరించుకొని సుమారు 400 మందికి పైగా పాదాచారులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమళ్ల వెంకట నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు, అనంతరం కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటర్ వితరణ చేయడమే కాకుండా ప్రజల దాహర్తి తీర్చుటకు ఉచిత మజ్జిగ సెంటర్ ను గత ఏడు సంవత్సరాలుగా బద్వేల్ ప్రాంతంలో దాతలు సహకారంతో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు, మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి మజ్జిగ వితరణకు సహకరించాలన్నారు, అనంతరం శనివారం మజ్జిగ వితరణ చేసిన రిషికేశ గుప్తాను శాలువాతో సత్కరించి వారిని అభినందించారు,ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్, ఆవోప సెక్రటరీ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ (వస్త్రం) వల్లంకొండు అనిత్, పాల్గొన్నారు1
- హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన రామ్ చరణ్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- Post by Syyed taher1
- సంఘ సంస్కర్తగా, దళితుల పక్షపాతిగా బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు నేటితరానికి ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. భారత తొలి దళిత ఉప ప్రధానమంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జివన్ రామ్ 119వ జయంతిని ఆదివారం స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు బాబూ జగ్జివన్ రామ్ విగ్రహ నిర్మాణం కమిటీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాబీర్ పాషా తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యదయానికి అహర్నిశలు కృషి చేశారని, మహాణీయుల్లో జగ్జీవన్ రామ్ ప్రముఖుడన్నారు. భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రిగా నిస్వార్ధంగా సేవలందించారని, మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్ గా ప్రజల పక్షాన వారి గళాన్ని వినిపించి ప్రజలు, నిమ్నజాతి సంక్షేమకోసం అహర్నిషలు కృషి చేశారన్నారు. అసమానతలు లేని సమాజ స్థాపనకోసం జగ్జీవన్ రామ్ పరితపించాడని అన్నారు. అయన అందించిన సేవలకు గుర్తింపుగా దేశ ప్రజలు బాబూజీగా నామకరణం చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని కులరక్కసిని పారద్రోలేందుకు కృషి చేయాలని, రాజ్యంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.3
- బద్వేలు:స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాయ్ జయంతి పురస్కరించుకొని కడప జిల్లా బద్వేల్ పట్టణం సిద్ధవటం రోడ్డు లోని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, కొంకుల రాంబాబు, జహంగీర్ భాష, పరిటాల వెంకటసుబ్బయ్య,పాలకొండు రాజశేఖర్ రెడ్డి,పి,ప్రసాద్ రెడ్డి, సిమెంట్ షరీఫ్, మౌలాలి, జయరామిరెడ్డి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1