పాల్వంచలో యువతిపై దారుణం, బీరు సీసాలు, కర్రలతో దాడి చేసిన వ్యక్తి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బంగారు జాల కు చెందిన మహిళపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనతో మాట్లాడుకుందామని చెప్పి కోపంతో ఆమెపై బీరు సీసా, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బంగారు జలకకు చెందిన తాటి నికిత (24) ఒక కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మండల పరిధిలోని కరకవాగు ప్రాంతానికి చెందిన వజ్జా పవన్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం నటరాజ్ సెంటర్ వద్ద ఆమెను అడ్డగించి వేధించడమే కాకుండా, అందరి ముందూ భయభ్రాంతులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. ఫిర్యాదు రాసిమ్మని సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుండి బయటకు వస్తున్న క్రమం లో, పవన్ మరో వ్యక్తి (ఆటో డ్రైవర్) కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడని యువతి తెలిపింది.. పవన్, అక్కడ యువతిపై అత్యాచారం చేసి,బీరు సీసా, కర్రతో కొట్టడంతో ఆమె తల, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలిని ఆటోలోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి నిందితుడు పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది... ప్రస్తుతం బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.
పాల్వంచలో యువతిపై దారుణం, బీరు సీసాలు, కర్రలతో దాడి చేసిన వ్యక్తి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బంగారు జాల కు చెందిన మహిళపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనతో మాట్లాడుకుందామని చెప్పి కోపంతో ఆమెపై బీరు సీసా, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బంగారు
జలకకు చెందిన తాటి నికిత (24) ఒక కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మండల పరిధిలోని కరకవాగు ప్రాంతానికి చెందిన వజ్జా పవన్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం నటరాజ్ సెంటర్ వద్ద ఆమెను అడ్డగించి వేధించడమే కాకుండా, అందరి ముందూ భయభ్రాంతులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు
చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. ఫిర్యాదు రాసిమ్మని సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుండి బయటకు వస్తున్న క్రమం లో, పవన్ మరో వ్యక్తి (ఆటో డ్రైవర్) కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడని యువతి తెలిపింది.. పవన్, అక్కడ యువతిపై అత్యాచారం చేసి,బీరు సీసా, కర్రతో కొట్టడంతో
ఆమె తల, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలిని ఆటోలోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి నిందితుడు పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది... ప్రస్తుతం బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.
- హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన రామ్ చరణ్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటోజర్నలిస్టుల అవార్డు ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్, నాంపల్లి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఏం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నల్గొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ అవార్డు అందుకున్నరు1
- కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఓ తల్లి కన్నీటి వేదన కలకలం సృష్టించింది. గత ఏడాది మే 12న తన కొడుకు శ్రీనివాస్ మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా CID లేదా సిబిఐ విచారణ వెయ్యాలని CM రేవంత్ రెడ్డిని కొంగు చాచి ధర్మారం మండలానికి చెందిన మహిళ రాజమ్మ వేడుకుంది. ఉరి వేసి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తల్లి కన్నీటితో వేడుకోవడం చూపరులను ఆవేదనకు గురి చేసింది. వెంటనే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజమ్మ ను సముదాయించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని, కేసు విషయం పై వివరాలు తెలుపాలని కరీంనగర్ సిపి ని కోరారు. వెంటనే సిపి గౌస్ ఆలం, శ్రీనివాస్ మృతికి సంబంధించిన కేసు తన దృష్టికి వచ్చిందని మరోసారి విచారణ చేయిస్తామని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాజమ్మ కొంగుచాచి వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది.1
- హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.1
- Post by Syyed taher1
- అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల పినకోటకు వెళ్లే ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుంచి బల్ల గురువు మీదుగా వాజంగి గ్రామానికి వెళ్లే రోడ్డును మరమ్మత్తులు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.15ఏళ్ళ క్రితం గ్రామాలకు రోడ్డు పనులు చేపట్టరన్నారు.అటుగా భారీ వాహనాలు వెళ్లడంతో 10కిలోమీటర్ల తారు రోడ్డు పూర్తిగాపాడైపోయి గోతులు ఏర్పడ్డాయి.తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- సంఘ సంస్కర్తగా, దళితుల పక్షపాతిగా బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు నేటితరానికి ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. భారత తొలి దళిత ఉప ప్రధానమంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జివన్ రామ్ 119వ జయంతిని ఆదివారం స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు బాబూ జగ్జివన్ రామ్ విగ్రహ నిర్మాణం కమిటీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాబీర్ పాషా తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యదయానికి అహర్నిశలు కృషి చేశారని, మహాణీయుల్లో జగ్జీవన్ రామ్ ప్రముఖుడన్నారు. భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రిగా నిస్వార్ధంగా సేవలందించారని, మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్ గా ప్రజల పక్షాన వారి గళాన్ని వినిపించి ప్రజలు, నిమ్నజాతి సంక్షేమకోసం అహర్నిషలు కృషి చేశారన్నారు. అసమానతలు లేని సమాజ స్థాపనకోసం జగ్జీవన్ రామ్ పరితపించాడని అన్నారు. అయన అందించిన సేవలకు గుర్తింపుగా దేశ ప్రజలు బాబూజీగా నామకరణం చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని కులరక్కసిని పారద్రోలేందుకు కృషి చేయాలని, రాజ్యంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.3
- ములుగు జిల్లా కలెక్టరేట్ లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివాకర టిఎస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను పాటించాలని, కార్మిక సంక్షేమానికి చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ చంద్రకళ పాల్గొన్నారు.1
- కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.1