Shuru
Apke Nagar Ki App…
జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం – భావితరాలకు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దివాకర ములుగు జిల్లా కలెక్టరేట్ లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివాకర టిఎస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను పాటించాలని, కార్మిక సంక్షేమానికి చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ చంద్రకళ పాల్గొన్నారు.
M D Azizuddin
జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం – భావితరాలకు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దివాకర ములుగు జిల్లా కలెక్టరేట్ లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివాకర టిఎస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను పాటించాలని, కార్మిక సంక్షేమానికి చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ చంద్రకళ పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఆరు గ్యారంటీలలో ఒక్క ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 5 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు. ఒక్క ఆసరా పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదని ఆరోపించారు.1
- కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.1
- Post by Shabbir Arts1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి జి. శ్రావణ్ కుమార్ గారు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్, కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించారు. అంక్షారెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. భారీ వేతనాలు, అలవెన్సులు తీసుకుంటూనే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తక్షణమే స్పందించి గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ నేతలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపిస్తూ, ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.4
- హైదరాబాద్‌లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం సమీపంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని, ఆయన ఆశయాలు సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్య ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.3
- బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీనవర్గాల హక్కుల రక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రజాస్వామ్య వాది, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీ మంత్రి మండలిలో అత్యవరస పరిస్థితిని ఎదిరించి రాజీనమా చేశారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ పథకం ప్రవేశ పెట్టారని, ఫీజు రీయింబర్స్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో తల్లిదండ్రుల పై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ కింద ఎస్సీ,ఎస్టీ లకు కేంద్రం 276 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. రాజీవ్ యువ శక్తి పథకం కార్యరూపం దాల్చితే నిరుద్యోగులకు ఉపాధి లభించేదని జీవన్ రెడ్డి తెలిపారు.2
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా మీది వాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీది వాడకట్టు ముదిరాజ్ సంఘం సభ్యులందరూ వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.4