Shuru
Apke Nagar Ki App…
Shabbir Arts
More news from తెలంగాణ and nearby areas
- Post by Shabbir Arts1
- సంఘ సంస్కర్తగా, దళితుల పక్షపాతిగా బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు నేటితరానికి ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. భారత తొలి దళిత ఉప ప్రధానమంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జివన్ రామ్ 119వ జయంతిని ఆదివారం స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు బాబూ జగ్జివన్ రామ్ విగ్రహ నిర్మాణం కమిటీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాబీర్ పాషా తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యదయానికి అహర్నిశలు కృషి చేశారని, మహాణీయుల్లో జగ్జీవన్ రామ్ ప్రముఖుడన్నారు. భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రిగా నిస్వార్ధంగా సేవలందించారని, మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్ గా ప్రజల పక్షాన వారి గళాన్ని వినిపించి ప్రజలు, నిమ్నజాతి సంక్షేమకోసం అహర్నిషలు కృషి చేశారన్నారు. అసమానతలు లేని సమాజ స్థాపనకోసం జగ్జీవన్ రామ్ పరితపించాడని అన్నారు. అయన అందించిన సేవలకు గుర్తింపుగా దేశ ప్రజలు బాబూజీగా నామకరణం చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని కులరక్కసిని పారద్రోలేందుకు కృషి చేయాలని, రాజ్యంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.3
- పెళ్లికి వచ్చి అనంతలోకానికి.. విషాదంలో మహాదేవుని గూడెం గ్రామం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమాట్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన బోల్లేపల్లి సారయ్య (50) అనే వ్యక్తి కోమాట్లగూడెం గ్రామంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుక అనంతరం బహిర్భూమికి వెళ్లిన సారయ్య, ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న పెద్ద చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించే లోపే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపాల్సిన పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా మరణ వార్త వినడంతో విషాదం నెలకొంది.1
- భారతీయ భాషా దినోత్సవం వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారు,అదనపు కలెక్టర్ వై వి గణేష్ గారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా. నేడు నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుల,సభాధ్యక్షులు సారయ్య గారి పిలుపుమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ గారు,డిప్యూటీ కలెక్టర్ వై వి గణేష్ గారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..* మన సంస్కృతి,సంప్రదాయాలకు మరియు అస్థిత్వానికి మాతృభాష పునాది అని,దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు మరియు యువత మాతృభాషలో పట్టు సాధించడం ద్వారానే సృజనాత్మకత మెరుగుపడుతుందని.. ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం నేర్చుకోవచ్చు,కానీ తెలుగు భాష మన జీవితం,సంస్కృతి కోసం నేర్చుకోవాలని,తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుపుతూ..తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చైర్పర్సన్,అదనపు కలెక్టర్ గార్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు,డిగ్రీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.2
- వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ రాజకీయ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ జాగృతి నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. యువత, మహిళలు, బలహీన వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.4
- Post by V Ramarao1
- హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన రామ్ చరణ్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- ములుగు జిల్లా కలెక్టరేట్ లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివాకర టిఎస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను పాటించాలని, కార్మిక సంక్షేమానికి చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ చంద్రకళ పాల్గొన్నారు.1