వరంగల్ జిల్లా,నర్సంపేట మున్సిపాలిటీలో భారతీయ భాషా దినోత్సవం..... భారతీయ భాషా దినోత్సవం వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారు,అదనపు కలెక్టర్ వై వి గణేష్ గారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా. నేడు నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుల,సభాధ్యక్షులు సారయ్య గారి పిలుపుమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ గారు,డిప్యూటీ కలెక్టర్ వై వి గణేష్ గారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..* మన సంస్కృతి,సంప్రదాయాలకు మరియు అస్థిత్వానికి మాతృభాష పునాది అని,దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు మరియు యువత మాతృభాషలో పట్టు సాధించడం ద్వారానే సృజనాత్మకత మెరుగుపడుతుందని.. ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం నేర్చుకోవచ్చు,కానీ తెలుగు భాష మన జీవితం,సంస్కృతి కోసం నేర్చుకోవాలని,తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుపుతూ..తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చైర్పర్సన్,అదనపు కలెక్టర్ గార్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు,డిగ్రీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా,నర్సంపేట మున్సిపాలిటీలో భారతీయ భాషా దినోత్సవం..... భారతీయ భాషా దినోత్సవం వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారు,అదనపు కలెక్టర్ వై వి గణేష్ గారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా. నేడు నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుల,సభాధ్యక్షులు సారయ్య గారి పిలుపుమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ గారు,డిప్యూటీ కలెక్టర్ వై వి గణేష్ గారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..* మన సంస్కృతి,సంప్రదాయాలకు మరియు అస్థిత్వానికి మాతృభాష పునాది అని,దానిని
కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు మరియు యువత మాతృభాషలో పట్టు సాధించడం ద్వారానే సృజనాత్మకత మెరుగుపడుతుందని.. ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం నేర్చుకోవచ్చు,కానీ తెలుగు భాష మన జీవితం,సంస్కృతి కోసం నేర్చుకోవాలని,తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుపుతూ..తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చైర్పర్సన్,అదనపు కలెక్టర్ గార్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు,డిగ్రీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- భారతీయ భాషా దినోత్సవం వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారు,అదనపు కలెక్టర్ వై వి గణేష్ గారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా. నేడు నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుల,సభాధ్యక్షులు సారయ్య గారి పిలుపుమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ గారు,డిప్యూటీ కలెక్టర్ వై వి గణేష్ గారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..* మన సంస్కృతి,సంప్రదాయాలకు మరియు అస్థిత్వానికి మాతృభాష పునాది అని,దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు మరియు యువత మాతృభాషలో పట్టు సాధించడం ద్వారానే సృజనాత్మకత మెరుగుపడుతుందని.. ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం నేర్చుకోవచ్చు,కానీ తెలుగు భాష మన జీవితం,సంస్కృతి కోసం నేర్చుకోవాలని,తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుపుతూ..తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చైర్పర్సన్,అదనపు కలెక్టర్ గార్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు,డిగ్రీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.2
- వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ రాజకీయ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ జాగృతి నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. యువత, మహిళలు, బలహీన వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.4
- హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన రామ్ చరణ్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- పెళ్లికి వచ్చి అనంతలోకానికి.. విషాదంలో మహాదేవుని గూడెం గ్రామం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమాట్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన బోల్లేపల్లి సారయ్య (50) అనే వ్యక్తి కోమాట్లగూడెం గ్రామంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుక అనంతరం బహిర్భూమికి వెళ్లిన సారయ్య, ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న పెద్ద చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించే లోపే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపాల్సిన పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా మరణ వార్త వినడంతో విషాదం నెలకొంది.1
- Post by Shabbir Arts1
- హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బంగారు జాల కు చెందిన మహిళపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనతో మాట్లాడుకుందామని చెప్పి కోపంతో ఆమెపై బీరు సీసా, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బంగారు జలకకు చెందిన తాటి నికిత (24) ఒక కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మండల పరిధిలోని కరకవాగు ప్రాంతానికి చెందిన వజ్జా పవన్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం నటరాజ్ సెంటర్ వద్ద ఆమెను అడ్డగించి వేధించడమే కాకుండా, అందరి ముందూ భయభ్రాంతులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. ఫిర్యాదు రాసిమ్మని సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుండి బయటకు వస్తున్న క్రమం లో, పవన్ మరో వ్యక్తి (ఆటో డ్రైవర్) కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడని యువతి తెలిపింది.. పవన్, అక్కడ యువతిపై అత్యాచారం చేసి,బీరు సీసా, కర్రతో కొట్టడంతో ఆమె తల, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలిని ఆటోలోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి నిందితుడు పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది... ప్రస్తుతం బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.4
- ములుగు జిల్లా కలెక్టరేట్ లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివాకర టిఎస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను పాటించాలని, కార్మిక సంక్షేమానికి చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ చంద్రకళ పాల్గొన్నారు.1