హుస్నాబాద్ లో 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి......... హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.
హుస్నాబాద్ లో 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి......... హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.
- హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.1
- కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఓ తల్లి కన్నీటి వేదన కలకలం సృష్టించింది. గత ఏడాది మే 12న తన కొడుకు శ్రీనివాస్ మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా CID లేదా సిబిఐ విచారణ వెయ్యాలని CM రేవంత్ రెడ్డిని కొంగు చాచి ధర్మారం మండలానికి చెందిన మహిళ రాజమ్మ వేడుకుంది. ఉరి వేసి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తల్లి కన్నీటితో వేడుకోవడం చూపరులను ఆవేదనకు గురి చేసింది. వెంటనే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజమ్మ ను సముదాయించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని, కేసు విషయం పై వివరాలు తెలుపాలని కరీంనగర్ సిపి ని కోరారు. వెంటనే సిపి గౌస్ ఆలం, శ్రీనివాస్ మృతికి సంబంధించిన కేసు తన దృష్టికి వచ్చిందని మరోసారి విచారణ చేయిస్తామని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాజమ్మ కొంగుచాచి వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి జి. శ్రావణ్ కుమార్ గారు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.1
- హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన రామ్ చరణ్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.3
- భారతీయ భాషా దినోత్సవం వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారు,అదనపు కలెక్టర్ వై వి గణేష్ గారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా. నేడు నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుల,సభాధ్యక్షులు సారయ్య గారి పిలుపుమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ గారు,డిప్యూటీ కలెక్టర్ వై వి గణేష్ గారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..* మన సంస్కృతి,సంప్రదాయాలకు మరియు అస్థిత్వానికి మాతృభాష పునాది అని,దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు మరియు యువత మాతృభాషలో పట్టు సాధించడం ద్వారానే సృజనాత్మకత మెరుగుపడుతుందని.. ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం నేర్చుకోవచ్చు,కానీ తెలుగు భాష మన జీవితం,సంస్కృతి కోసం నేర్చుకోవాలని,తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుపుతూ..తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చైర్పర్సన్,అదనపు కలెక్టర్ గార్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు,డిగ్రీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.2
- వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ రాజకీయ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ జాగృతి నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. యువత, మహిళలు, బలహీన వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.4
- హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఆరు గ్యారంటీలలో ఒక్క ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 5 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు. ఒక్క ఆసరా పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదని ఆరోపించారు.1