logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ భీమేశ్వర స్వామి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి జి. శ్రావణ్ కుమార్ గారు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
2 hrs ago

శ్రీ భీమేశ్వర స్వామి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి జి. శ్రావణ్ కుమార్ గారు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జుక్కల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తమను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు ప్రకటించిన ఫలాలను అందించాలని డిమాండ్ చేశారు.
    1
    కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జుక్కల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తమను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు ప్రకటించిన ఫలాలను అందించాలని డిమాండ్ చేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.
    1
    కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఆరు గ్యారంటీలలో ఒక్క ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 5 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు. ఒక్క ఆసరా పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదని ఆరోపించారు.
    1
    హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఆరు గ్యారంటీలలో ఒక్క ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 5 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు. ఒక్క ఆసరా పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదని ఆరోపించారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఈస్టర్ పర్వదినం వేడుకలు నిర్వహించారు. మోడరేటర్, మెదక్ ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. క్రీస్తు సిలువపై మరణించి మూడో రోజు తిరిగి లేచిన రోజును ఈస్టర్ గా క్రైస్తవులు నిర్వహిస్తారన్నారు.
    1
    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఈస్టర్ పర్వదినం వేడుకలు నిర్వహించారు. మోడరేటర్, మెదక్ ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. క్రీస్తు సిలువపై మరణించి మూడో రోజు తిరిగి లేచిన రోజును ఈస్టర్ గా క్రైస్తవులు నిర్వహిస్తారన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    14 hrs ago
  • సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా మీది వాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీది వాడకట్టు ముదిరాజ్ సంఘం సభ్యులందరూ వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 
రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా మీది వాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల  బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీది వాడకట్టు ముదిరాజ్ సంఘం సభ్యులందరూ వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • నిజామాబాద్, ఏప్రిల్: సరిపడా సౌకర్యాలు లేనప్పటికీ క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా అద్వితీయ ప్రతిభను కలిగి ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్, గుగులోత్ సౌమ్య, యెండల సౌందర్య, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు. వీరిని స్పూర్తిగా తీసుకుని క్రీడాకారులు ముందుకుసాగాలని, నిజామాబాద్ జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్ – 2025 క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. వివిధ అంశాలలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ అభినందిస్తూ, వారికి మెడల్స్, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. నిజామాబాద్ జిల్లా వాసులైన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్, భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ గుగులోత్ సౌమ్యలు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన అనేక మంది క్రీడాకారులు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. తాను కూడా కళాశాలలో చదివే రోజుల్లో స్విమ్మింగ్ లో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లాలో క్రీడా సదుపాయాల మెరుగుదలకు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని, వీటి ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీ.ఎం కప్ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 31,353 మంది క్రీడాకారులు వివిధ దశలలో పాల్గొనడం ద్వారా జిల్లాను మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. 2700 మంది జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో వివిధ అంశాలలో పాల్గొని 53 పతకాలు సాధించడం జరిగిందన్నారు. వీటిలో 12 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయని, తద్వారా నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో టాప్–5 లో నిలిచిందని అభినందించారు. కోచ్ లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపాలని కలెక్టర్ ఉద్బోధించారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపితే, అధ్బుత అవకాశాలు దక్కుతాయని, ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని సూచించారు. ఉద్యోగ నియామకాలతో పాటు, ఉన్నత విద్యావకాశాలలోనూ స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలు పొందవచ్చని అన్నారు. విద్యార్థులను, యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సీ.ఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను చాటేలా విద్యార్థులను తీర్చిదిద్దిన కోచ్ లను, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బందిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డివైఎస్ఓ పవన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ---------------------------------
    1
    నిజామాబాద్, ఏప్రిల్: సరిపడా సౌకర్యాలు లేనప్పటికీ క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా అద్వితీయ ప్రతిభను కలిగి ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్, గుగులోత్ సౌమ్య, యెండల సౌందర్య, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు. వీరిని స్పూర్తిగా తీసుకుని క్రీడాకారులు ముందుకుసాగాలని, నిజామాబాద్ జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు. 
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్ – 2025 క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. వివిధ అంశాలలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ అభినందిస్తూ, వారికి మెడల్స్, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. 
నిజామాబాద్ జిల్లా వాసులైన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్, భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ గుగులోత్ సౌమ్యలు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీరిని ఘనంగా సత్కరించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన అనేక మంది క్రీడాకారులు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. తాను కూడా కళాశాలలో చదివే రోజుల్లో స్విమ్మింగ్ లో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లాలో క్రీడా సదుపాయాల మెరుగుదలకు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని, వీటి ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. 
సీ.ఎం కప్ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 31,353 మంది క్రీడాకారులు వివిధ దశలలో పాల్గొనడం ద్వారా జిల్లాను మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. 2700 మంది జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో వివిధ అంశాలలో పాల్గొని 53 పతకాలు సాధించడం జరిగిందన్నారు. వీటిలో 12 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయని, తద్వారా నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో టాప్–5 లో నిలిచిందని అభినందించారు. కోచ్ లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపాలని కలెక్టర్ ఉద్బోధించారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపితే, అధ్బుత అవకాశాలు దక్కుతాయని, ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని సూచించారు. ఉద్యోగ నియామకాలతో పాటు, ఉన్నత విద్యావకాశాలలోనూ స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలు పొందవచ్చని అన్నారు. విద్యార్థులను, యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సీ.ఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను చాటేలా విద్యార్థులను తీర్చిదిద్దిన కోచ్ లను, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బందిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. 
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డివైఎస్ఓ పవన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 
---------------------------------
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.50 వేల విరాళం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple దేవస్థానం అభివృద్ధి కోసం సిద్దిపేట్‌కు చెందిన భక్తుడు ఆకుల నితేందర్ రూ.50 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి జి. శ్రావణ్ కుమార్ గారికి అందజేశారు. అనంతరం భక్తుడు స్వామివారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు భక్తుడికి ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు వెంకట ప్రసాద్, అకౌంట్స్ అడ్వైజర్ ఆగమ రావు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.50 వేల విరాళం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple దేవస్థానం అభివృద్ధి కోసం సిద్దిపేట్‌కు చెందిన భక్తుడు ఆకుల నితేందర్ రూ.50 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి జి. శ్రావణ్ కుమార్ గారికి అందజేశారు. అనంతరం భక్తుడు స్వామివారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు భక్తుడికి ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు  వెంకట ప్రసాద్, అకౌంట్స్ అడ్వైజర్ ఆగమ రావు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • ఎల్లారెడ్డి మండలం : ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడిన యువత నేరాలబాట పడుతున్నారు. గేమ్లలో డబ్బులు పోగొట్టుకున్న యువకులు అప్పులపాలై వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అప్పులపాలై ఓ యువకుడు ఎల్లారెడ్డిలో గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం చేసిన గొలుసు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ద్వారా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించారు. కృష్ణాజీవాడి గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా జల్సాలకు అలవాటు పడిన తిరుపతి రెడ్డి ఆన్లైన్ గేమింగ్ ద్వారా అప్పుల పాలైనట్టుగా తేలింది. పక్కా పథకం ప్రకారం గొలుసు చోరీకి పాల్పడటానికి నిర్ణయించుకుని చోరీకి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి 3 తులాల పుస్తెల తాడు, కత్తి, ముఖానికి ధరించిన స్కార్ఫ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రెస్మీట్ లో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.
    1
    ఎల్లారెడ్డి మండలం : ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడిన యువత నేరాలబాట పడుతున్నారు. గేమ్లలో డబ్బులు పోగొట్టుకున్న యువకులు అప్పులపాలై వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అప్పులపాలై ఓ యువకుడు ఎల్లారెడ్డిలో గొలుసు చోరీలకు  పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం చేసిన గొలుసు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి  డీఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వివరాలు వెల్లడించారు.  ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ద్వారా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించారు.  కృష్ణాజీవాడి గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా జల్సాలకు అలవాటు పడిన తిరుపతి రెడ్డి ఆన్లైన్ గేమింగ్ ద్వారా అప్పుల పాలైనట్టుగా తేలింది. పక్కా పథకం ప్రకారం గొలుసు చోరీకి పాల్పడటానికి నిర్ణయించుకుని చోరీకి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి 3 తులాల పుస్తెల తాడు, కత్తి, ముఖానికి ధరించిన స్కార్ఫ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రెస్మీట్ లో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీనవర్గాల హక్కుల రక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రజాస్వామ్య వాది, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీ మంత్రి మండలిలో అత్యవరస పరిస్థితిని ఎదిరించి రాజీనమా చేశారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ పథకం ప్రవేశ పెట్టారని, ఫీజు రీయింబర్స్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో తల్లిదండ్రుల పై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ కింద ఎస్సీ,ఎస్టీ లకు కేంద్రం 276 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. రాజీవ్ యువ శక్తి పథకం కార్యరూపం దాల్చితే నిరుద్యోగులకు ఉపాధి లభించేదని జీవన్ రెడ్డి తెలిపారు.
    2
    బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీనవర్గాల హక్కుల రక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి  ప్రజాస్వామ్య వాది, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీ మంత్రి మండలిలో అత్యవరస పరిస్థితిని ఎదిరించి రాజీనమా చేశారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ పథకం ప్రవేశ పెట్టారని, ఫీజు రీయింబర్స్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో తల్లిదండ్రుల పై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం  ఫీజు రీయింబర్స్ కింద ఎస్సీ,ఎస్టీ లకు కేంద్రం 276 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. రాజీవ్ యువ శక్తి పథకం కార్యరూపం దాల్చితే నిరుద్యోగులకు ఉపాధి లభించేదని జీవన్ రెడ్డి తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.