logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎల్లారెడ్డి మండలం : ఆన్ లైన్ గేమింగ్ కు బానిసై చైన్ స్నాచింగ్ పాల్పడ్డ యువకుడు అరెస్టు వివరాలు : వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ ఎల్లారెడ్డి మండలం : ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడిన యువత నేరాలబాట పడుతున్నారు. గేమ్లలో డబ్బులు పోగొట్టుకున్న యువకులు అప్పులపాలై వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అప్పులపాలై ఓ యువకుడు ఎల్లారెడ్డిలో గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం చేసిన గొలుసు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ద్వారా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించారు. కృష్ణాజీవాడి గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా జల్సాలకు అలవాటు పడిన తిరుపతి రెడ్డి ఆన్లైన్ గేమింగ్ ద్వారా అప్పుల పాలైనట్టుగా తేలింది. పక్కా పథకం ప్రకారం గొలుసు చోరీకి పాల్పడటానికి నిర్ణయించుకుని చోరీకి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి 3 తులాల పుస్తెల తాడు, కత్తి, ముఖానికి ధరించిన స్కార్ఫ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రెస్మీట్ లో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.

3 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
3 hrs ago

ఎల్లారెడ్డి మండలం : ఆన్ లైన్ గేమింగ్ కు బానిసై చైన్ స్నాచింగ్ పాల్పడ్డ యువకుడు అరెస్టు వివరాలు : వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ ఎల్లారెడ్డి మండలం : ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడిన యువత నేరాలబాట పడుతున్నారు. గేమ్లలో డబ్బులు పోగొట్టుకున్న యువకులు అప్పులపాలై వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అప్పులపాలై ఓ యువకుడు ఎల్లారెడ్డిలో గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం చేసిన గొలుసు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ద్వారా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించారు. కృష్ణాజీవాడి గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా జల్సాలకు అలవాటు పడిన తిరుపతి రెడ్డి ఆన్లైన్ గేమింగ్ ద్వారా అప్పుల పాలైనట్టుగా తేలింది. పక్కా పథకం ప్రకారం గొలుసు చోరీకి పాల్పడటానికి నిర్ణయించుకుని చోరీకి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి 3 తులాల పుస్తెల తాడు, కత్తి, ముఖానికి ధరించిన స్కార్ఫ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రెస్మీట్ లో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఈస్టర్ పర్వదినం వేడుకలు నిర్వహించారు. మోడరేటర్, మెదక్ ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. క్రీస్తు సిలువపై మరణించి మూడో రోజు తిరిగి లేచిన రోజును ఈస్టర్ గా క్రైస్తవులు నిర్వహిస్తారన్నారు.
    1
    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఈస్టర్ పర్వదినం వేడుకలు నిర్వహించారు. మోడరేటర్, మెదక్ ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. క్రీస్తు సిలువపై మరణించి మూడో రోజు తిరిగి లేచిన రోజును ఈస్టర్ గా క్రైస్తవులు నిర్వహిస్తారన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    16 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి జి. శ్రావణ్ కుమార్ గారు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి జి. శ్రావణ్ కుమార్ గారు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా మీది వాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీది వాడకట్టు ముదిరాజ్ సంఘం సభ్యులందరూ వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 
రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా మీది వాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల  బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీది వాడకట్టు ముదిరాజ్ సంఘం సభ్యులందరూ వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    17 hrs ago
  • కుంటాల మండలంలోని వెంకూరు గ్రామానికి చెందిన రైతు నారాయణకు చెందిన మొక్కజొన్న సంచులు రాత్రి దొంగతనానికి గురవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన గ్రామ పెద్దలు, రైతులు, స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. దొంగలను తక్షణమే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
    1
    కుంటాల మండలంలోని వెంకూరు గ్రామానికి చెందిన రైతు నారాయణకు చెందిన మొక్కజొన్న సంచులు రాత్రి దొంగతనానికి గురవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన గ్రామ పెద్దలు, రైతులు, స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. దొంగలను తక్షణమే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
    user_Ravula Purushotham
    Ravula Purushotham
    Dilawarpur, Nirmal•
    12 hrs ago
  • బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: సంగారెడ్డిలో ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
    1
    బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: సంగారెడ్డిలో ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఓ తల్లి కన్నీటి వేదన కలకలం సృష్టించింది. గత ఏడాది మే 12న తన కొడుకు శ్రీనివాస్ మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా CID లేదా సిబిఐ విచారణ వెయ్యాలని CM రేవంత్ రెడ్డిని కొంగు చాచి ధర్మారం మండలానికి చెందిన మహిళ రాజమ్మ వేడుకుంది. ఉరి వేసి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తల్లి కన్నీటితో వేడుకోవడం చూపరులను ఆవేదనకు గురి చేసింది. వెంటనే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజమ్మ ను సముదాయించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని, కేసు విషయం పై వివరాలు తెలుపాలని కరీంనగర్ సిపి ని కోరారు. వెంటనే సిపి గౌస్ ఆలం, శ్రీనివాస్ మృతికి సంబంధించిన కేసు తన దృష్టికి వచ్చిందని మరోసారి విచారణ చేయిస్తామని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాజమ్మ కొంగుచాచి వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
    1
    కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఓ తల్లి కన్నీటి వేదన  కలకలం సృష్టించింది. గత ఏడాది మే 12న తన కొడుకు శ్రీనివాస్ మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా CID లేదా సిబిఐ విచారణ  వెయ్యాలని CM రేవంత్ రెడ్డిని కొంగు చాచి ధర్మారం మండలానికి చెందిన  మహిళ రాజమ్మ వేడుకుంది. ఉరి వేసి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తల్లి కన్నీటితో వేడుకోవడం చూపరులను ఆవేదనకు గురి చేసింది. వెంటనే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజమ్మ ను సముదాయించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని, కేసు విషయం పై వివరాలు తెలుపాలని కరీంనగర్ సిపి ని కోరారు. వెంటనే సిపి గౌస్ ఆలం, శ్రీనివాస్ మృతికి సంబంధించిన కేసు తన దృష్టికి వచ్చిందని మరోసారి విచారణ చేయిస్తామని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాజమ్మ కొంగుచాచి వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • ఎల్లారెడ్డి మండలం : ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడిన యువత నేరాలబాట పడుతున్నారు. గేమ్లలో డబ్బులు పోగొట్టుకున్న యువకులు అప్పులపాలై వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అప్పులపాలై ఓ యువకుడు ఎల్లారెడ్డిలో గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం చేసిన గొలుసు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ద్వారా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించారు. కృష్ణాజీవాడి గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా జల్సాలకు అలవాటు పడిన తిరుపతి రెడ్డి ఆన్లైన్ గేమింగ్ ద్వారా అప్పుల పాలైనట్టుగా తేలింది. పక్కా పథకం ప్రకారం గొలుసు చోరీకి పాల్పడటానికి నిర్ణయించుకుని చోరీకి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి 3 తులాల పుస్తెల తాడు, కత్తి, ముఖానికి ధరించిన స్కార్ఫ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రెస్మీట్ లో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.
    1
    ఎల్లారెడ్డి మండలం : ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడిన యువత నేరాలబాట పడుతున్నారు. గేమ్లలో డబ్బులు పోగొట్టుకున్న యువకులు అప్పులపాలై వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అప్పులపాలై ఓ యువకుడు ఎల్లారెడ్డిలో గొలుసు చోరీలకు  పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం చేసిన గొలుసు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి  డీఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వివరాలు వెల్లడించారు.  ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ద్వారా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించారు.  కృష్ణాజీవాడి గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా జల్సాలకు అలవాటు పడిన తిరుపతి రెడ్డి ఆన్లైన్ గేమింగ్ ద్వారా అప్పుల పాలైనట్టుగా తేలింది. పక్కా పథకం ప్రకారం గొలుసు చోరీకి పాల్పడటానికి నిర్ణయించుకుని చోరీకి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి 3 తులాల పుస్తెల తాడు, కత్తి, ముఖానికి ధరించిన స్కార్ఫ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రెస్మీట్ లో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.50 వేల విరాళం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple దేవస్థానం అభివృద్ధి కోసం సిద్దిపేట్‌కు చెందిన భక్తుడు ఆకుల నితేందర్ రూ.50 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి జి. శ్రావణ్ కుమార్ గారికి అందజేశారు. అనంతరం భక్తుడు స్వామివారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు భక్తుడికి ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు వెంకట ప్రసాద్, అకౌంట్స్ అడ్వైజర్ ఆగమ రావు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.50 వేల విరాళం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple దేవస్థానం అభివృద్ధి కోసం సిద్దిపేట్‌కు చెందిన భక్తుడు ఆకుల నితేందర్ రూ.50 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి జి. శ్రావణ్ కుమార్ గారికి అందజేశారు. అనంతరం భక్తుడు స్వామివారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు భక్తుడికి ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు  వెంకట ప్రసాద్, అకౌంట్స్ అడ్వైజర్ ఆగమ రావు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.
    1
    కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.