logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ...ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగల డిమాండ్ కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ...ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగల డిమాండ్ కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఓ తల్లి కన్నీటి వేదన కలకలం సృష్టించింది. గత ఏడాది మే 12న తన కొడుకు శ్రీనివాస్ మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా CID లేదా సిబిఐ విచారణ వెయ్యాలని CM రేవంత్ రెడ్డిని కొంగు చాచి ధర్మారం మండలానికి చెందిన మహిళ రాజమ్మ వేడుకుంది. ఉరి వేసి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తల్లి కన్నీటితో వేడుకోవడం చూపరులను ఆవేదనకు గురి చేసింది. వెంటనే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజమ్మ ను సముదాయించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని, కేసు విషయం పై వివరాలు తెలుపాలని కరీంనగర్ సిపి ని కోరారు. వెంటనే సిపి గౌస్ ఆలం, శ్రీనివాస్ మృతికి సంబంధించిన కేసు తన దృష్టికి వచ్చిందని మరోసారి విచారణ చేయిస్తామని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాజమ్మ కొంగుచాచి వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
    1
    కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఓ తల్లి కన్నీటి వేదన  కలకలం సృష్టించింది. గత ఏడాది మే 12న తన కొడుకు శ్రీనివాస్ మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా CID లేదా సిబిఐ విచారణ  వెయ్యాలని CM రేవంత్ రెడ్డిని కొంగు చాచి ధర్మారం మండలానికి చెందిన  మహిళ రాజమ్మ వేడుకుంది. ఉరి వేసి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తల్లి కన్నీటితో వేడుకోవడం చూపరులను ఆవేదనకు గురి చేసింది. వెంటనే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజమ్మ ను సముదాయించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని, కేసు విషయం పై వివరాలు తెలుపాలని కరీంనగర్ సిపి ని కోరారు. వెంటనే సిపి గౌస్ ఆలం, శ్రీనివాస్ మృతికి సంబంధించిన కేసు తన దృష్టికి వచ్చిందని మరోసారి విచారణ చేయిస్తామని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాజమ్మ కొంగుచాచి వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.
    1
    హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి,  వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీ అంజనా రెడ్డి గారిని ఇన్‌చార్జ్ ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్‌చార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.తరువాత ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ గారు, శేషవస్త్రం మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఈవో గారి చాంబర్‌లో అంజనా రెడ్డి గారు ఇన్‌చార్జ్ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో  ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీ అంజనా రెడ్డి గారిని ఇన్‌చార్జ్ ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్‌చార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.తరువాత ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ గారు, శేషవస్త్రం మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఈవో గారి చాంబర్‌లో అంజనా రెడ్డి గారు ఇన్‌చార్జ్ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన రామ్ చరణ్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో గాయపడిన రామ్ చరణ్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.
    3
    సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 
రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల  బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో   కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    14 hrs ago
  • గజ్వేల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్, కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించారు. అంక్షారెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. భారీ వేతనాలు, అలవెన్సులు తీసుకుంటూనే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తక్షణమే స్పందించి గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ నేతలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపిస్తూ, ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్, కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించారు.
అంక్షారెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. భారీ వేతనాలు, అలవెన్సులు తీసుకుంటూనే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ తక్షణమే స్పందించి గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని సవాలు విసిరారు.
కాంగ్రెస్ నేతలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపిస్తూ, ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • భారతీయ భాషా దినోత్సవం వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారు,అదనపు కలెక్టర్ వై వి గణేష్ గారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా. నేడు నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుల,సభాధ్యక్షులు సారయ్య గారి పిలుపుమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ గారు,డిప్యూటీ కలెక్టర్ వై వి గణేష్ గారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..* మన సంస్కృతి,సంప్రదాయాలకు మరియు అస్థిత్వానికి మాతృభాష పునాది అని,దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు మరియు యువత మాతృభాషలో పట్టు సాధించడం ద్వారానే సృజనాత్మకత మెరుగుపడుతుందని.. ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం నేర్చుకోవచ్చు,కానీ తెలుగు భాష మన జీవితం,సంస్కృతి కోసం నేర్చుకోవాలని,తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుపుతూ..తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చైర్పర్సన్,అదనపు కలెక్టర్ గార్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు,డిగ్రీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
    2
    భారతీయ భాషా దినోత్సవం వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న.
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారు,అదనపు కలెక్టర్ వై వి గణేష్ గారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా.
నేడు నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుల,సభాధ్యక్షులు సారయ్య గారి పిలుపుమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ గారు,డిప్యూటీ కలెక్టర్ వై వి గణేష్ గారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..*
మన సంస్కృతి,సంప్రదాయాలకు మరియు అస్థిత్వానికి మాతృభాష పునాది అని,దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
విద్యార్థులు మరియు యువత మాతృభాషలో పట్టు సాధించడం ద్వారానే సృజనాత్మకత మెరుగుపడుతుందని..
ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం నేర్చుకోవచ్చు,కానీ తెలుగు భాష మన జీవితం,సంస్కృతి కోసం నేర్చుకోవాలని,తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుపుతూ..తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చైర్పర్సన్,అదనపు కలెక్టర్ గార్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు,డిగ్రీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.
    1
    కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.