వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఇన్‌చార్జ్ ఈవో బాధ్యతలు స్వీకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీ అంజనా రెడ్డి గారిని ఇన్‌చార్జ్ ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్‌చార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.తరువాత ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ గారు, శేషవస్త్రం మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఈవో గారి చాంబర్‌లో అంజనా రెడ్డి గారు ఇన్‌చార్జ్ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఇన్‌చార్జ్ ఈవో బాధ్యతలు స్వీకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీ అంజనా రెడ్డి గారిని ఇన్‌చార్జ్ ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్‌చార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.తరువాత ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ గారు, శేషవస్త్రం మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఈవో గారి చాంబర్‌లో అంజనా రెడ్డి గారు ఇన్‌చార్జ్ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీ అంజనా రెడ్డి గారిని ఇన్‌చార్జ్ ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్‌చార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.తరువాత ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ గారు, శేషవస్త్రం మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఈవో గారి చాంబర్‌లో అంజనా రెడ్డి గారు ఇన్‌చార్జ్ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలంలోని రామాలయంలో ఆదివారం నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం ఆధ్యాత్మిక శోభతో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో హిందూ ధర్మ సంకీర్తనలకు చేసిన నృత్యాలు, భరతనాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం అనంతరం భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.1
- కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఓ తల్లి కన్నీటి వేదన కలకలం సృష్టించింది. గత ఏడాది మే 12న తన కొడుకు శ్రీనివాస్ మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా CID లేదా సిబిఐ విచారణ వెయ్యాలని CM రేవంత్ రెడ్డిని కొంగు చాచి ధర్మారం మండలానికి చెందిన మహిళ రాజమ్మ వేడుకుంది. ఉరి వేసి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తల్లి కన్నీటితో వేడుకోవడం చూపరులను ఆవేదనకు గురి చేసింది. వెంటనే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజమ్మ ను సముదాయించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని, కేసు విషయం పై వివరాలు తెలుపాలని కరీంనగర్ సిపి ని కోరారు. వెంటనే సిపి గౌస్ ఆలం, శ్రీనివాస్ మృతికి సంబంధించిన కేసు తన దృష్టికి వచ్చిందని మరోసారి విచారణ చేయిస్తామని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాజమ్మ కొంగుచాచి వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది.1
- హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.1
- వరుస హిందూ దేవాలయాల పై దాడులను ఖండిస్తూ మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, కౌన్సిలర్ శశాంక్ తో కలిసి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పట్టణం గాంధీనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం లోని హనుమాన్, శివలింగం, దేవతల విగ్రహాల పై ఓ ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేసి హిందువుల ఆరాధ్య దైవాలను అవమానించడం జరిగిందని అన్నారు. గత వారం రోజులుగా హిందూ దేవాలయ పై దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. కొన్ని రోజుల క్రితం మంబోజీపల్లి హనుమాన్ దేవాలయం పై ఇదేవిధంగా మూత్ర విసర్జన చేయడం, అవుసులపల్లి గ్రామంలో దేవీ, దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం తెలిసేది అని గుర్తు చేశారు. అవుసులపల్లి విగ్రహాల ధ్వంసం పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎవరిని నిందితులుగా గుర్తించకపోవడం వల్లనే మరో సంఘటన చోటు చేసుకోవడం హిందూలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పోలీస్ లు నిందితులను గుర్తించి హిందూ మనోభావాలు దెబ్బ తీసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో మెదక్ పట్టణంలో హిందూ ఐక్యత చూపించేలా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ దాడులను నిరసిస్తూ హిందూ బంధువులు ఈ నెల 6 న మెదక్ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని హిందువుల ఐక్యత చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శశాంక్, రితీష్, రమేష్, లోకేష్, సంతోష్ బజరంగ్దళ్ నాయకులు పృద్వి, వంశీ, బీజేవైఎం నాయకులు సాయి, బబ్లు, చందు, స్థానిక యువకులు పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.3
- గజ్వేల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్, కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించారు. అంక్షారెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. భారీ వేతనాలు, అలవెన్సులు తీసుకుంటూనే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తక్షణమే స్పందించి గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ నేతలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపిస్తూ, ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి జి. శ్రావణ్ కుమార్ గారు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.1