Shuru
Apke Nagar Ki App…
జుక్కల్ నియోజవర్గం : తెలంగాణ ఉద్యమకారులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వినూత్న నిరసన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జుక్కల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తమను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు ప్రకటించిన ఫలాలను అందించాలని డిమాండ్ చేశారు.
Narmala Swapna
జుక్కల్ నియోజవర్గం : తెలంగాణ ఉద్యమకారులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వినూత్న నిరసన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జుక్కల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తమను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు ప్రకటించిన ఫలాలను అందించాలని డిమాండ్ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలంలోని రామాలయంలో ఆదివారం నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం ఆధ్యాత్మిక శోభతో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో హిందూ ధర్మ సంకీర్తనలకు చేసిన నృత్యాలు, భరతనాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం అనంతరం భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.1
- వరుస హిందూ దేవాలయాల పై దాడులను ఖండిస్తూ మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, కౌన్సిలర్ శశాంక్ తో కలిసి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పట్టణం గాంధీనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం లోని హనుమాన్, శివలింగం, దేవతల విగ్రహాల పై ఓ ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేసి హిందువుల ఆరాధ్య దైవాలను అవమానించడం జరిగిందని అన్నారు. గత వారం రోజులుగా హిందూ దేవాలయ పై దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. కొన్ని రోజుల క్రితం మంబోజీపల్లి హనుమాన్ దేవాలయం పై ఇదేవిధంగా మూత్ర విసర్జన చేయడం, అవుసులపల్లి గ్రామంలో దేవీ, దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం తెలిసేది అని గుర్తు చేశారు. అవుసులపల్లి విగ్రహాల ధ్వంసం పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎవరిని నిందితులుగా గుర్తించకపోవడం వల్లనే మరో సంఘటన చోటు చేసుకోవడం హిందూలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పోలీస్ లు నిందితులను గుర్తించి హిందూ మనోభావాలు దెబ్బ తీసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో మెదక్ పట్టణంలో హిందూ ఐక్యత చూపించేలా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ దాడులను నిరసిస్తూ హిందూ బంధువులు ఈ నెల 6 న మెదక్ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని హిందువుల ఐక్యత చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శశాంక్, రితీష్, రమేష్, లోకేష్, సంతోష్ బజరంగ్దళ్ నాయకులు పృద్వి, వంశీ, బీజేవైఎం నాయకులు సాయి, బబ్లు, చందు, స్థానిక యువకులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీ అంజనా రెడ్డి గారిని ఇన్‌చార్జ్ ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్‌చార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.తరువాత ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ గారు, శేషవస్త్రం మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఈవో గారి చాంబర్‌లో అంజనా రెడ్డి గారు ఇన్‌చార్జ్ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.1
- నిజామాబాద్, ఏప్రిల్: సరిపడా సౌకర్యాలు లేనప్పటికీ క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా అద్వితీయ ప్రతిభను కలిగి ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్, గుగులోత్ సౌమ్య, యెండల సౌందర్య, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు. వీరిని స్పూర్తిగా తీసుకుని క్రీడాకారులు ముందుకుసాగాలని, నిజామాబాద్ జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్ – 2025 క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. వివిధ అంశాలలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ అభినందిస్తూ, వారికి మెడల్స్, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. నిజామాబాద్ జిల్లా వాసులైన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్, భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ గుగులోత్ సౌమ్యలు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన అనేక మంది క్రీడాకారులు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. తాను కూడా కళాశాలలో చదివే రోజుల్లో స్విమ్మింగ్ లో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లాలో క్రీడా సదుపాయాల మెరుగుదలకు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని, వీటి ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీ.ఎం కప్ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 31,353 మంది క్రీడాకారులు వివిధ దశలలో పాల్గొనడం ద్వారా జిల్లాను మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. 2700 మంది జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో వివిధ అంశాలలో పాల్గొని 53 పతకాలు సాధించడం జరిగిందన్నారు. వీటిలో 12 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయని, తద్వారా నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో టాప్–5 లో నిలిచిందని అభినందించారు. కోచ్ లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపాలని కలెక్టర్ ఉద్బోధించారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపితే, అధ్బుత అవకాశాలు దక్కుతాయని, ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని సూచించారు. ఉద్యోగ నియామకాలతో పాటు, ఉన్నత విద్యావకాశాలలోనూ స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలు పొందవచ్చని అన్నారు. విద్యార్థులను, యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సీ.ఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను చాటేలా విద్యార్థులను తీర్చిదిద్దిన కోచ్ లను, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బందిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డివైఎస్ఓ పవన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ---------------------------------1
- గజ్వేల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్, కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించారు. అంక్షారెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. భారీ వేతనాలు, అలవెన్సులు తీసుకుంటూనే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తక్షణమే స్పందించి గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ నేతలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపిస్తూ, ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.4
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.3
- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు మాజీ ఎమ్మెల్యే పేరు... నిరసన రామంతపూర్ లో నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం నుంచి 650 కోట్ల నిధులు తెచ్చిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జుక్కల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తమను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు ప్రకటించిన ఫలాలను అందించాలని డిమాండ్ చేశారు.1