Shuru
Apke Nagar Ki App…
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల వ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తహశీల్దార్ ఎల్.మంగ తెలిపారు. మండలంలోని 29 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 24,302 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 11,752 ఎస్‌ఐఆర్ ఫారాలను విజయవంతంగా డిజిటలైజేషన్ చేసి అప్‌లోడ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మిగిలిన ఫారాల నమోదు ప్రక్రియ కూడా ఎంతో వేగంగా ముందుకు సాగుతోందని వివరించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఓటర్లు తమ కుటుంబ సభ్యుల ఫారాలను పూర్తిగా భర్తీ చేసి, అధికారులకు తగిన విధంగా సహకరించాలని తహశీల్దార్ కోరారు.
K. UPENDER
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల వ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తహశీల్దార్ ఎల్.మంగ తెలిపారు. మండలంలోని 29 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 24,302 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 11,752 ఎస్‌ఐఆర్ ఫారాలను విజయవంతంగా డిజిటలైజేషన్ చేసి అప్‌లోడ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మిగిలిన ఫారాల నమోదు ప్రక్రియ కూడా ఎంతో వేగంగా ముందుకు సాగుతోందని వివరించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఓటర్లు తమ కుటుంబ సభ్యుల ఫారాలను పూర్తిగా భర్తీ చేసి, అధికారులకు తగిన విధంగా సహకరించాలని తహశీల్దార్ కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సభలో జర్నలిస్టులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో పలువురు జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని గమనించి వెంటనే ఆ ప్లకార్డులను లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జర్నలిస్టులు గట్టిగా కోరారు.1
- మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.1
- తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకూబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇండ్ల పంపిణీ కోసం తాము పదేపదే నిరసనలు, ఉద్యమాలు చేసినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వచ్చిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు, గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాలు మరియు తమ జైలు జీవితాల గురించి వివరిస్తూ ఇండ్ల పంపిణీ కోసం చర్యలు చేపట్టాలని కోరారు. ఇండ్ల పంపిణీ చేపట్టకుండా సీపీఎం నాయకులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడంపై ఎండీ యాకూబ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు డబ్బులు వసూలు చేశారో నిరూపించేందుకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తాము గనుక నోరు విప్పితే కొందరు మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు, పార్టీ నాయకులను ప్రజలు తొర్రూరు నుండి తరిమి కొడతారని హెచ్చరించారు. అబండాలు వేయడం మానుకొని తక్షణమే ఇండ్లను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు మర్క సాంబయ్య, డోనుక దర్గయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.2
- నల్గొండ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ఎండిపోయిన చెట్టు విద్యార్థులకు ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వీచే బలమైన గాలులకు ఈ చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని వారు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో పాఠశాల ఆవరణలో పడిపోయిన మరో చెట్టు దుంగలను కూడా అధికారులు ఇప్పటివరకు తొలగించలేదు. ఈ దుంగల వల్ల విషపూరితమైన పాములు, తేళ్లు వంటివి చేరే అవకాశం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలోనే అంగన్‌వాడీ కేంద్రం కూడా ఉండటంతో, చిన్నారుల భద్రత దృష్ట్యా అధికారులు, పాలకవర్గ సభ్యులు తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు. ఎండిన చెట్టును, పాత దుంగలను వెంటనే తొలగించి, పాఠశాల పరిసరాలను శుభ్రపరచి చిన్నారులకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయ నూతన ఛైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యాదగిరిగుట్టను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలక మండలి కృషి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, మరియు పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.2
- ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం మహిళా సంఘాల కోసం చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలను వివరించారు. మహిళా సంఘాలకు ఇప్పటికే రూ. 67 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందించామని, అలాగే రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు, వారికి వ్యాపార అవకాశాలను మెరుగుపరిచి, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.1