logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాఫెడ్ స్వచ్చంధ సంస్థ అధ్వర్యంలో... అడవి ఆహార పదార్థాలు మరియు ఔషధ మూలికలపై సాంప్రదాయ జ్ఞాన డాక్యుమెంటేషన్ అవగాహన సదస్సు.. వాజేడు మండలం మురుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రగలపల్లి గ్రామంలో అడవి ఆహార పదార్థాలు మరియు ఔషధ మూలికలపై సాంప్రదాయ జ్ఞాన డాక్యుమెంటేషన్ పైన అవగాహన సదస్సు ను బుదవారం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్టు శాఖ గొంది నారాయణ , ఎఫ్. ఈ ఓ మాట్లాడుతూ అడవి ఆహార పదార్థాలు మరియు ఔషధ మూలికలు గ్రామీణ, గిరిజన సమాజాల జీవన విధానంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయని అన్నారు. తరతరాలుగా ప్రజలు అడవిలో లభించే వివిధ ఆకులు, కాయలు, పండ్లు, వేర్లు, గింజలు మరియు ఇతర సహజ వనరులను ఆహారంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అదేవిధంగా, స్థానికంగా లభించే ఔషధ మొక్కల ఉపయోగం, వాటి గుర్తింపు, సేకరణ మరియు సంప్రదాయ వినియోగంపై విలువైన జ్ఞానం సమాజంలో ఉందని అన్నారు. ఈ అధ్యయనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం స్థానిక ప్రజల్లో ఉన్న అడవి ఆహారాలు మరియు ఔషధ మూలికలకు సంబంధించిన సాంప్రదాయ జ్ఞానాన్ని సేకరించి, పద్ధతిగా నమోదు చేయడం, మరియు ఈ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచడంతో పాటు, జీవవైవిధ్య పరిరక్షణ మరియు స్థానిక సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటం ఈ డాక్యుమెంటేషన్ యొక్క ముఖ్య లక్ష్యంఅనితెలిపారు. ఈ కార్యక్రమానికి. మురుమూరు గ్రామపంచాయతీ.సర్పంచ్ మడకం సుభద్ర,ఉప సర్పంచ్, వాజేడు మండల కోఆర్డినేటర్ జి. కామేష్, యానిమేటర్స, పి స్వరూప, సిహెచ్ రమాదేవి, సిహెచ్ భాస్కరు, దీపిక,ప్రసాదు,గ్రామస్థులు పాల్గొన్నారు.

42 min ago
user_Timothy Pastor Gattipally
Timothy Pastor Gattipally
వాజేడు, ములుగు, తెలంగాణ•
42 min ago
63c1be30-0cd8-47da-a4c5-66bf5c6354e2

కాఫెడ్ స్వచ్చంధ సంస్థ అధ్వర్యంలో... అడవి ఆహార పదార్థాలు మరియు ఔషధ మూలికలపై సాంప్రదాయ జ్ఞాన డాక్యుమెంటేషన్ అవగాహన సదస్సు.. వాజేడు మండలం మురుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రగలపల్లి గ్రామంలో అడవి ఆహార పదార్థాలు మరియు ఔషధ మూలికలపై సాంప్రదాయ జ్ఞాన డాక్యుమెంటేషన్ పైన అవగాహన సదస్సు ను బుదవారం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్టు శాఖ గొంది నారాయణ , ఎఫ్. ఈ ఓ మాట్లాడుతూ అడవి ఆహార పదార్థాలు మరియు ఔషధ మూలికలు గ్రామీణ, గిరిజన సమాజాల జీవన విధానంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయని అన్నారు. తరతరాలుగా ప్రజలు అడవిలో లభించే వివిధ ఆకులు, కాయలు, పండ్లు, వేర్లు, గింజలు మరియు ఇతర సహజ

0b42efa7-8804-4007-97b9-681e9857ad23

వనరులను ఆహారంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అదేవిధంగా, స్థానికంగా లభించే ఔషధ మొక్కల ఉపయోగం, వాటి గుర్తింపు, సేకరణ మరియు సంప్రదాయ వినియోగంపై విలువైన జ్ఞానం సమాజంలో ఉందని అన్నారు. ఈ అధ్యయనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం స్థానిక ప్రజల్లో ఉన్న అడవి ఆహారాలు మరియు ఔషధ మూలికలకు సంబంధించిన సాంప్రదాయ జ్ఞానాన్ని సేకరించి, పద్ధతిగా నమోదు చేయడం, మరియు ఈ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచడంతో పాటు, జీవవైవిధ్య పరిరక్షణ మరియు స్థానిక సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటం ఈ డాక్యుమెంటేషన్ యొక్క ముఖ్య లక్ష్యంఅనితెలిపారు. ఈ కార్యక్రమానికి. మురుమూరు గ్రామపంచాయతీ.సర్పంచ్ మడకం సుభద్ర,ఉప సర్పంచ్, వాజేడు మండల కోఆర్డినేటర్ జి. కామేష్, యానిమేటర్స, పి స్వరూప, సిహెచ్ రమాదేవి, సిహెచ్ భాస్కరు, దీపిక,ప్రసాదు,గ్రామస్థులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మాకు ఆకలి అవుతుంది మమల్ని వదిలేయండి ప్లీజ్... పాలిటెక్నీక్ విద్యార్థుల ఆవేదన వరంగల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులను పోలీసులు గేటు లోపలే నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచ్‌ కోసం బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. “మాకు ఆకలైతుంది.. వదిలేయండి ప్లీజ్‌” అంటూ విద్యార్థులు వేడుకున్నట్లు తెలుస్తోంది.
    1
    మాకు ఆకలి అవుతుంది మమల్ని వదిలేయండి ప్లీజ్... పాలిటెక్నీక్ విద్యార్థుల ఆవేదన 
వరంగల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులను పోలీసులు గేటు లోపలే నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచ్‌ కోసం బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. “మాకు ఆకలైతుంది.. వదిలేయండి ప్లీజ్‌” అంటూ విద్యార్థులు వేడుకున్నట్లు తెలుస్తోంది.
    user_Madhu
    Madhu
    కన్నాయిగూడెం, ములుగు, తెలంగాణ•
    1 hr ago
  • ఆరు నెలల్లో రహదారుల పనులు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క MLG: ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. రహదారుల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    ఆరు నెలల్లో రహదారుల పనులు పూర్తి చేయాలి
: మంత్రి సీతక్క
MLG: ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. రహదారుల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    41 min ago
  • ములుగు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా: 6 పెండింగ్ DAలు, OPS అమలుకు డిమాండ్ ​ములుగు:దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో గురువారం ములుగు నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున ‘మహాధర్నా’ నిర్వహించారు. ​ఈ ధర్నాలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు: ​6 పెండింగ్ DAల విడుదల: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన 6 బకాయి డియర్నెస్ అలవెన్సులను (DA) ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలి. ​OPS పునరుద్ధరణ: ఉద్యోగుల భవిష్యత్తుకు నష్టం కలిగిస్తున్న సీపీఎస్ (CPS) విధానాన్ని స్వస్తి పలికి, పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి. ​ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు. ​ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ ముఖ్య నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    2
    ములుగు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా: 6 పెండింగ్ DAలు, OPS అమలుకు డిమాండ్
​ములుగు:దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో గురువారం ములుగు నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున ‘మహాధర్నా’ నిర్వహించారు.
​ఈ ధర్నాలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు:
​6 పెండింగ్ DAల విడుదల: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన 6 బకాయి డియర్నెస్ అలవెన్సులను (DA) ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలి.
​OPS పునరుద్ధరణ: ఉద్యోగుల భవిష్యత్తుకు నష్టం కలిగిస్తున్న సీపీఎస్ (CPS) విధానాన్ని స్వస్తి పలికి, పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.
​ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు.
​ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ ముఖ్య నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    2 hrs ago
  • సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు
    1
    సోదరా ABN రాధాకృష్ణ  మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా
కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది
ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది
మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు
మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది
ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ
కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా
ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు
    user_KOMURAIAH ANAGANDULA
    KOMURAIAH ANAGANDULA
    ములుగు, ములుగు, తెలంగాణ•
    20 hrs ago
  • వికలాంగుల రాజ్యాధికారమే లక్ష్యం 8వ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ చివ్వెంల: వికలాంగుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. గురువారం దురాజ్‌పల్లిలో సంఘం 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంఘం జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలతో వికలాంగుల సమస్యలు పరిష్కారం కావని, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల కోసం గత ఎనిమిదేళ్లుగా పోరాటాలు కొనసాగిస్తున్నామని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఎర్రకోట, గోల్కొండ కోటపై వికలాంగుడు జాతీయ జెండా ఎగురవేసే రోజు వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    వికలాంగుల రాజ్యాధికారమే లక్ష్యం
8వ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్
చివ్వెంల: వికలాంగుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. గురువారం దురాజ్‌పల్లిలో సంఘం 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంఘం జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలతో వికలాంగుల సమస్యలు పరిష్కారం కావని, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల కోసం గత ఎనిమిదేళ్లుగా పోరాటాలు కొనసాగిస్తున్నామని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఎర్రకోట, గోల్కొండ కోటపై వికలాంగుడు జాతీయ జెండా ఎగురవేసే రోజు వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 min ago
  • భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    1
    భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా  మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 
18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని
మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు.
నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు.
నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, 
ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    49 min ago
  • రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి.. మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి అరెస్టును తీవ్రంగా ఖండించిన* --- *ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుకాకులమర్రి లక్ష్మణ్ బాబు* పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వరంగల్ వచ్చిన హరీష్ రావు గారిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో శక్తి యూనివర్సిటీ, 97వ జీవో, PPP విధానాల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ విధానం నిజంగా విద్యార్థుల ప్రయోజనాల కోసమే అయితే, ప్రభుత్వం బహిరంగంగా వివరాలు వెల్లడించి, విద్యార్థులు మరియు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు సాంకేతిక విద్యకు ప్రధాన ఆధారం. వాటిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం PPP పేరుతో వాటి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ కళాశాలల భూములు, ఆస్తులు ప్రజల ఆస్తులని, కార్పొరేటర్ల ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి చూస్తున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు అని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కాదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే విద్యార్థి లోకం, ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. హరీష్ రావు గారి ని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పళ్ళ రాజేశ్వర్ రెడ్డి రెడ్డి గారిని దాస్యం వినయ్ భాస్కర్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే బహిరంగ చర్చకు రావాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు.
    1
    రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి..
మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి అరెస్టును తీవ్రంగా ఖండించిన*
---  *ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుకాకులమర్రి లక్ష్మణ్ బాబు* 
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వరంగల్ వచ్చిన హరీష్ రావు గారిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో శక్తి యూనివర్సిటీ, 97వ జీవో, PPP విధానాల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అన్నారు. 
ఈ విధానం నిజంగా విద్యార్థుల ప్రయోజనాల కోసమే అయితే, ప్రభుత్వం బహిరంగంగా వివరాలు వెల్లడించి, విద్యార్థులు మరియు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు సాంకేతిక విద్యకు ప్రధాన ఆధారం. వాటిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం PPP పేరుతో వాటి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం సరికాదన్నారు.
ప్రభుత్వ కళాశాలల భూములు, ఆస్తులు ప్రజల ఆస్తులని, కార్పొరేటర్ల ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి చూస్తున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు అని మండిపడ్డారు.
విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కాదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే విద్యార్థి లోకం, ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు.
హరీష్ రావు గారి ని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పళ్ళ రాజేశ్వర్ రెడ్డి రెడ్డి గారిని దాస్యం వినయ్ భాస్కర్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే బహిరంగ చర్చకు రావాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    2 hrs ago
  • నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు* కాఠ్మాండు, నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు. వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది. *గల్లంతైన వారిలో భారతీయులు* నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు. *కొనసాగుతున్న సహాయక చర్యలు* గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
    1
    నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు*
కాఠ్మాండు,  నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు.
వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం
వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది.
*గల్లంతైన వారిలో భారతీయులు* 
నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు.
*కొనసాగుతున్న సహాయక చర్యలు* 
గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.
భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.