రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి.. మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి అరెస్టును తీవ్రంగా ఖండించిన* --- *ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుకాకులమర్రి లక్ష్మణ్ బాబు* పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వరంగల్ వచ్చిన హరీష్ రావు గారిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో శక్తి యూనివర్సిటీ, 97వ జీవో, PPP విధానాల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ విధానం నిజంగా విద్యార్థుల ప్రయోజనాల కోసమే అయితే, ప్రభుత్వం బహిరంగంగా వివరాలు వెల్లడించి, విద్యార్థులు మరియు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు సాంకేతిక విద్యకు ప్రధాన ఆధారం. వాటిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం PPP పేరుతో వాటి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ కళాశాలల భూములు, ఆస్తులు ప్రజల ఆస్తులని, కార్పొరేటర్ల ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి చూస్తున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు అని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కాదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే విద్యార్థి లోకం, ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. హరీష్ రావు గారి ని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పళ్ళ రాజేశ్వర్ రెడ్డి రెడ్డి గారిని దాస్యం వినయ్ భాస్కర్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే బహిరంగ చర్చకు రావాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి.. మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి అరెస్టును తీవ్రంగా ఖండించిన* --- *ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుకాకులమర్రి లక్ష్మణ్ బాబు* పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వరంగల్ వచ్చిన హరీష్ రావు గారిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో శక్తి యూనివర్సిటీ, 97వ జీవో, PPP విధానాల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ విధానం నిజంగా విద్యార్థుల ప్రయోజనాల కోసమే అయితే, ప్రభుత్వం బహిరంగంగా వివరాలు వెల్లడించి, విద్యార్థులు మరియు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు సాంకేతిక విద్యకు ప్రధాన ఆధారం. వాటిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం PPP పేరుతో వాటి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ కళాశాలల భూములు, ఆస్తులు ప్రజల ఆస్తులని, కార్పొరేటర్ల ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి చూస్తున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు అని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కాదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే విద్యార్థి లోకం, ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. హరీష్ రావు గారి ని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పళ్ళ రాజేశ్వర్ రెడ్డి రెడ్డి గారిని దాస్యం వినయ్ భాస్కర్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే బహిరంగ చర్చకు రావాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు.
- ములుగు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా: 6 పెండింగ్ DAలు, OPS అమలుకు డిమాండ్ ములుగు:దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో గురువారం ములుగు నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున ‘మహాధర్నా’ నిర్వహించారు. ఈ ధర్నాలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు: 6 పెండింగ్ DAల విడుదల: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన 6 బకాయి డియర్నెస్ అలవెన్సులను (DA) ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలి. OPS పునరుద్ధరణ: ఉద్యోగుల భవిష్యత్తుకు నష్టం కలిగిస్తున్న సీపీఎస్ (CPS) విధానాన్ని స్వస్తి పలికి, పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ ముఖ్య నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.2
- కాటాపూర్ పీహెచ్‌సీలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మిక తనిఖీ MLG: కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్, మందుల స్టాక్, హాజరు రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులు రోజూ అప్‌డేట్ చేయాలని సూచించారు. ఆస్పత్రి పరిశుభ్రత, సిబ్బంది సమయపాలన, మందుల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.1
- సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు1
- గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం - 4 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు - వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి 3 కోట్ల 11 లక్షల రూపాయలు - పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం తాడ్వాయి,ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ..మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు,స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. మల్లంపల్లి మండల కేంద్రంలో శివం గార్డెన్ లో నత్తి మొగిలి కూతురు వివాహానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని పలు శుభకార్యాలకు పెళ్లిళ్లు కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఏటూరునాగారం చేరుకొని ఏటూరునాగారం మండల కేంద్రంలో Y జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచారు ఏటూరునాగారం మండలంలో శివపురం గ్రామంలో సిసి రోడ్లను మంత్రి సీతక్క ప్రారంభోత్సవం అదేవిధంగా గోగుపల్లి గ్రామంలో కూడా నూతన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసారు.. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్...రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడం కోసం ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్ కు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది...కావున ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో ప్రైవేటు కార్యక్రమం లో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్లు స్వయంగా మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా వారికి అందజేయనున్నారు. మల్లూరు- మామిడిగూడెం లో నూతనంగా నిర్మాణం చేసిన పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.4
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి.. మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి అరెస్టును తీవ్రంగా ఖండించిన* --- *ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుకాకులమర్రి లక్ష్మణ్ బాబు* పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వరంగల్ వచ్చిన హరీష్ రావు గారిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో శక్తి యూనివర్సిటీ, 97వ జీవో, PPP విధానాల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ విధానం నిజంగా విద్యార్థుల ప్రయోజనాల కోసమే అయితే, ప్రభుత్వం బహిరంగంగా వివరాలు వెల్లడించి, విద్యార్థులు మరియు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు సాంకేతిక విద్యకు ప్రధాన ఆధారం. వాటిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం PPP పేరుతో వాటి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ కళాశాలల భూములు, ఆస్తులు ప్రజల ఆస్తులని, కార్పొరేటర్ల ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి చూస్తున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు అని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కాదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే విద్యార్థి లోకం, ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. హరీష్ రావు గారి ని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పళ్ళ రాజేశ్వర్ రెడ్డి రెడ్డి గారిని దాస్యం వినయ్ భాస్కర్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే బహిరంగ చర్చకు రావాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు.1