logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాటాపూర్ పీహెచ్‌సీలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మిక తనిఖీ MLG: కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్, మందుల స్టాక్, హాజరు రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులు రోజూ అప్‌డేట్ చేయాలని సూచించారు. ఆస్పత్రి పరిశుభ్రత, సిబ్బంది సమయపాలన, మందుల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.

1 hr ago
user_MAHI
MAHI
ములుగు, ములుగు, తెలంగాణ•
1 hr ago

కాటాపూర్ పీహెచ్‌సీలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మిక తనిఖీ MLG: కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్, మందుల స్టాక్, హాజరు రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులు రోజూ అప్‌డేట్ చేయాలని సూచించారు. ఆస్పత్రి పరిశుభ్రత, సిబ్బంది సమయపాలన, మందుల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఓనం వేడుకల్లో ఘనంగా అయ్యప్ప స్వామికి మహా పడిపూజ కార్యక్రమం MLG: గోవిందరావుపేటలోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో బుధవారం ఓనం పండుగ సందర్భంగా స్వామివారికి శుభయాత్ర, కోనేరులో చక్రస్నానం, అభిషేకం, మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు డింగరి రంగాచార్యుల ఆధ్వర్యంలో ధూపాటి సమ్మక్క–అంతయ్య కుటుంబ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ పీఎంకే గాంధీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
    1
    ఓనం వేడుకల్లో ఘనంగా అయ్యప్ప స్వామికి మహా పడిపూజ కార్యక్రమం
MLG: గోవిందరావుపేటలోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో బుధవారం ఓనం పండుగ సందర్భంగా స్వామివారికి శుభయాత్ర, కోనేరులో చక్రస్నానం, అభిషేకం, మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు డింగరి రంగాచార్యుల ఆధ్వర్యంలో ధూపాటి సమ్మక్క–అంతయ్య కుటుంబ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ పీఎంకే గాంధీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    23 hrs ago
  • ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే ప్రాధాన్యత - రూ: 4 కోట్ల 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు : మంత్రి సీతక్క. ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 26 (భారత శక్తి): గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్‌ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
    1
    ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే  ప్రాధాన్యత
- రూ: 4 కోట్ల 46 లక్షల అభివృద్ధి పనులకు  శంకుస్థాపనలు
:  మంత్రి సీతక్క.

ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 26 (భారత శక్తి):  గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

బుధవారం తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి  సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్‌ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
    user_KOMURAIAH ANAGANDULA
    KOMURAIAH ANAGANDULA
    ములుగు, ములుగు, తెలంగాణ•
    23 hrs ago
  • ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: నాయిని హనుమకొండ జిల్లా: తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) హెచ్‌ఎన్‌కే జిల్లా ఆధ్వర్యంలో గురువారం సుబేదారి కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగ వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహాధర్నాలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
    1
    ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: నాయిని
హనుమకొండ జిల్లా: తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) హెచ్‌ఎన్‌కే జిల్లా ఆధ్వర్యంలో గురువారం సుబేదారి కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగ వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహాధర్నాలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
    3
    మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు


హైదరాబాద్ (ఆగస్టు 26):
మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
​మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు.
​అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభస...కాంగ్రెస్ బిజేపి కార్యకర్తలు మద్య తోపులాట ఉద్రిక్తత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బిజెపి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీశారు. దీంతో బిజెపి పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బిజేపి నాయకుల్ని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకుల తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
    4
    రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభస...కాంగ్రెస్ బిజేపి కార్యకర్తలు మద్య తోపులాట ఉద్రిక్తత
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బిజెపి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీశారు.  దీంతో బిజెపి పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బిజేపి నాయకుల్ని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకుల తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    17 min ago
  • మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.
    1
    మరి చెట్టుకు మర్రి కల్లు.. 
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. 
కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... 
బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... 
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్  కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు  వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద  వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి  పూడిక తో ఉండడంతో  ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి  నీరు సరిపోక పోవడంతో  తన  బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి  పెద్ద వేరు తెగి పోవడం  వల్ల, వేరు  నుంచి మూడు నాలుగు రోజులుగా  మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • గోవిందరావుపేటలో వాన దేవుని కరుణ కోసం కప్పతల్లి ఆట..... MLG:అడపా దడపా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి భరోసా ఇవ్వట్లేదు. లక్నవరం చెరువులో ఉన్న నీరు ఈ సీజను సరిపోయేలా లేదు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో 80%వరి సాగుపై ఆధారపడ్డ గోవిందరావుపేట మండల రైతుల్లో ఆందోళన నెలకొంది. నాట్లు వేసుకున్న అన్నదాతలు పైరుకు తడికోసం తండ్లాడుతున్నారు. ఈ క్రమంలో మండలకేంద్రంలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. వానలు కురిపించాలని దైవాలను వేడుకున్నారు.
    1
    గోవిందరావుపేటలో వాన దేవుని కరుణ కోసం కప్పతల్లి ఆట.....
MLG:అడపా దడపా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి భరోసా ఇవ్వట్లేదు. లక్నవరం చెరువులో ఉన్న నీరు ఈ సీజను సరిపోయేలా లేదు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో 80%వరి సాగుపై ఆధారపడ్డ గోవిందరావుపేట మండల రైతుల్లో ఆందోళన నెలకొంది. నాట్లు వేసుకున్న అన్నదాతలు పైరుకు తడికోసం తండ్లాడుతున్నారు. ఈ క్రమంలో మండలకేంద్రంలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. వానలు కురిపించాలని దైవాలను వేడుకున్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    19 hrs ago
  • వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల జేఏసీ మహా ధర్నా... వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు వేణుగోపాల్, రాంకిషన్ కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
    1
    వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల జేఏసీ మహా ధర్నా...
వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.  ఈ ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు వేణుగోపాల్, రాంకిషన్ కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల జిల్లా గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమ మద్యం పట్టివేత...ముగ్గురు అరెస్ట్, 6 లక్షల 98 వేల రూ.ల మద్యం సీజ్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో ఎక్సైజ్ అధికారులు మద్యం పట్టుకున్నారు. మహారాష్ట్రలోని దాద్రా, హవేలి, దయ్యూధామన్ నుంచి అక్రమంగా కథలాపూర్ మండలం గంభీర్పూర్ కు రవాణా చేస్తున్న మద్యంపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యం ను పట్టుకున్నారు. వాటి విలువ మహారాష్ట్రలో 2లక్షల 80వేలు ఉంటే, తెలంగాణలో 6 లక్షల 98 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సెల్ఫోన్ ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సుంకం ఎగ్గొట్టి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని ఎక్సైజ్ జిల్లా అధికారి తిరుపతి తెలిపారు.
    2
    జగిత్యాల జిల్లా గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమ మద్యం పట్టివేత...ముగ్గురు అరెస్ట్, 6 లక్షల 98 వేల రూ.ల మద్యం సీజ్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో ఎక్సైజ్ అధికారులు మద్యం పట్టుకున్నారు. మహారాష్ట్రలోని దాద్రా, హవేలి, దయ్యూధామన్  నుంచి అక్రమంగా కథలాపూర్ మండలం గంభీర్పూర్ కు రవాణా చేస్తున్న మద్యంపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యం ను పట్టుకున్నారు. వాటి విలువ మహారాష్ట్రలో 2లక్షల 80వేలు ఉంటే, తెలంగాణలో  6 లక్షల 98 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సెల్ఫోన్ ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సుంకం ఎగ్గొట్టి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని  ఎక్సైజ్ జిల్లా అధికారి తిరుపతి తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.