logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జనగణన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలి సెన్సస్–2027 విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి అభివృద్ధికి ఆధారమైన జనగణనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి కొణిజర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో అత్యంత కీలకమైన జనగణన 2027 హౌస్ లిస్టింగ్ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అయిందని, ఇంటికి వచ్చే ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలనీ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పేర్కొన్నారు.వైరా నియోజకవర్గ పరిధిలోని కొణిజర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సెన్సస్–2027 జనగణన ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామంలోని ఎస్సీ కాలనీలు సహా పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న జనాభా వివరాలు, కుటుంబ గణాంకాల నమోదు విధానాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు, వార్డ్ అధికారులు నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియపై వివరణ తీసుకొని పలు సూచనలు చేశారు.ప్రతి ఇంటి సమాచారం సరైన రీతిలో నమోదు చేయడంతో పాటు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితత్వంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ జనగణన 2027 హౌస్ లిస్టింగ్ కార్యక్రమం సోమవారం ప్రారంభం అయిందని, ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి ప్రజల నుంచి వివరాలు సేకరిస్తారని, ఈ ప్రక్రియకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.జనగణన ద్వారా సేకరించే సమాచారం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు మూలాధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు.జనాభా, కుటుంబాల సామాజిక ఆర్థిక పరిస్థితులు,విద్య, ఉపాధి, నివాస సదుపాయాలు, మౌళిక వసతులు, తదితర అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులోకి రావడం ద్వారా ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించేందుకు ప్రభుత్వంకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.జనగణనలో సేకరించే ప్రతి సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, వ్యక్తిగత వివరాలను ఇతర అవసరాలకు వినియోగించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు.ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా సరైన సమాచారాన్ని అందించడం ద్వారా దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మన సమాచారం – మన భవిష్యత్తు అనే భావనతో ప్రతి పౌరుడు జనగణనలో చురుకుగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దేశ ప్రగతికి ఖచ్చితమైన గణాంకాలు ఎంతో అవసరమని, సమగ్ర గణాంకాల ఆధారంగానే అభివృద్ధి కార్యాచరణలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు.జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ జనగణన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలని, గ్రామ పంచాయతీలు,మండలాలు,మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.విద్యాసంస్థలు,స్వయం సహాయక సంఘాలు,యువజన సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.జనగణన సిబ్బంది ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, ఇంటింటికి వెళ్లే సమయంలో అధికారిక గుర్తింపు కార్డులు ధరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే సమయంలో ప్రజలు అడిగే సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని, సమాచార సేకరణలో పారదర్శకత పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సీపీవో శ్రీనివాస్, తహసీల్దారు అరుణ, ఎంపీఓ ఉపేంద్రయ్య, గ్రామ సర్పంచ్ బూదె పుష్పవతి ఉపేందర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago
1887b06e-a0b8-4f26-bdf0-1b4b009c36e7

జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జనగణన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలి సెన్సస్–2027 విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి అభివృద్ధికి ఆధారమైన జనగణనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి కొణిజర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో అత్యంత కీలకమైన జనగణన 2027 హౌస్ లిస్టింగ్ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అయిందని, ఇంటికి వచ్చే ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలనీ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పేర్కొన్నారు.వైరా నియోజకవర్గ పరిధిలోని కొణిజర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సెన్సస్–2027 జనగణన ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామంలోని ఎస్సీ కాలనీలు సహా పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న జనాభా వివరాలు, కుటుంబ గణాంకాల నమోదు విధానాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు, వార్డ్ అధికారులు నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియపై వివరణ తీసుకొని పలు సూచనలు చేశారు.ప్రతి ఇంటి సమాచారం సరైన రీతిలో నమోదు చేయడంతో పాటు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితత్వంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ జనగణన 2027 హౌస్ లిస్టింగ్ కార్యక్రమం సోమవారం ప్రారంభం అయిందని, ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి ప్రజల నుంచి వివరాలు సేకరిస్తారని, ఈ ప్రక్రియకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.జనగణన ద్వారా సేకరించే సమాచారం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు మూలాధారంగా ఉపయోగపడుతుందని

9584bd68-6873-49a7-9389-9d1282ca3000

తెలిపారు.జనాభా, కుటుంబాల సామాజిక ఆర్థిక పరిస్థితులు,విద్య, ఉపాధి, నివాస సదుపాయాలు, మౌళిక వసతులు, తదితర అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులోకి రావడం ద్వారా ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించేందుకు ప్రభుత్వంకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.జనగణనలో సేకరించే ప్రతి సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, వ్యక్తిగత వివరాలను ఇతర అవసరాలకు వినియోగించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు.ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా సరైన సమాచారాన్ని అందించడం ద్వారా దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మన సమాచారం – మన భవిష్యత్తు అనే భావనతో ప్రతి పౌరుడు జనగణనలో చురుకుగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దేశ ప్రగతికి ఖచ్చితమైన గణాంకాలు ఎంతో అవసరమని, సమగ్ర గణాంకాల ఆధారంగానే అభివృద్ధి కార్యాచరణలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు.జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ జనగణన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలని, గ్రామ పంచాయతీలు,మండలాలు,మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.విద్యాసంస్థలు,స్వయం సహాయక సంఘాలు,యువజన సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.జనగణన సిబ్బంది ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, ఇంటింటికి వెళ్లే సమయంలో అధికారిక గుర్తింపు కార్డులు ధరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే సమయంలో ప్రజలు అడిగే సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని, సమాచార సేకరణలో పారదర్శకత పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సీపీవో శ్రీనివాస్, తహసీల్దారు అరుణ, ఎంపీఓ ఉపేంద్రయ్య, గ్రామ సర్పంచ్ బూదె పుష్పవతి ఉపేందర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨............. 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨 *డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు* *🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం* 🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్‌.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్‌.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు, మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు. నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది. 👉 ప్రజలకు సూచన: బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. –కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు
    1
    🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨.............

🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨
*డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు*
*🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం*
🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37  క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి
విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్‌.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్‌.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు.
సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు,  మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు.
నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది.
👉 ప్రజలకు సూచన:
బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు.
–కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు
    user_Ravi Reporter
    Ravi Reporter
    Local News Reporter తిరువూరు, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    19 min ago
  • బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.

పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు.

తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
    1
    ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    24 min ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    user_Shivaram
    Shivaram
    Apprenticeship Centre బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    1
    ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    user_Jayateja
    Jayateja
    Hotel Vijayawada (Rural), Ntr•
    8 hrs ago
  • సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.
    1
    సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు.
పల్నాడు జిల్లా..
సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు
ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం
సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను  ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు.
నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు.
ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
    1
    కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.