Shuru
Apke Nagar Ki App…
ప్రజలకు మంచి సేవలు అందించండి* *మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్ టికే శ్రీదేవి* *షాద్ నగర్ మున్సిపల్ పాలకవర్గంతో టికే శ్రీదేవి* మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్ టికే శ్రీదేవితో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్, మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి, కౌన్సిలర్లు రాజు నాయక్, నడికుడ శ్రావణి, కళ్యాణ్ కార్ దిలీప్ తదితరులు కలుసుకున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్థానిక ప్రజాప్రతినిధుల శిక్షణ తరగతుల సందర్భంగా ఆమె కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు మంచి సేవలు అందించాలని టికే శ్రీదేవి కోరారు..
Rameshu Avula
ప్రజలకు మంచి సేవలు అందించండి* *మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్ టికే శ్రీదేవి* *షాద్ నగర్ మున్సిపల్ పాలకవర్గంతో టికే శ్రీదేవి* మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్ టికే శ్రీదేవితో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్, మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి, కౌన్సిలర్లు రాజు నాయక్, నడికుడ శ్రావణి, కళ్యాణ్ కార్ దిలీప్ తదితరులు కలుసుకున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్థానిక ప్రజాప్రతినిధుల శిక్షణ తరగతుల సందర్భంగా ఆమె కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు మంచి సేవలు అందించాలని టికే శ్రీదేవి కోరారు..
More news from Telangana and nearby areas
- వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.5
- Post by Bandi renu1
- కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీ లిమిటేషన్‌ను అడ్డుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌ను ఎలా అడ్డుకుంటారో సీఎం చెప్పాలని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మోదీని విమర్శించి ఎక్కడున్నారో అందరికీ తెలుసని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్‌లో అదే పరిస్థితి పడుతుందని పేర్కొన్నారు.1
- More details to buy Watsup 8374614046 👆👆👆👆👆👆👆5
- చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు1
- అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని లాలాపేట లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏతర పార్టీల అధికారంలో అంబేద్కర్ కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ ను గౌరవించే విధంగా ఆయన చదివిన తిరిగిన ప్రదేశాలను పంచ తీర్థలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయాలు కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు.2