అంగరంగ వైభవంగా రథోత్సవం ’ స్వర్ణకాంతులు చిందే రథంపై కామాక్షీ సమేత కరకంఠేశ్వరుని విహారం నగరి:స్వర్ణకాంతులు చిందే రథంపై కామాక్షిసమేతంగా కరంఠేశ్వరుడు దేధీప్యమానంగా మాడవీధుల్లో విహరించాడు. పట్టణ పరిధిలోని కామాక్షీ సమేత కరకంఠేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న పంగుణోత్తర కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం స్థానిక అగముడి మొదలియార్ సంఘస్థులు రథోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా స్వామి, అమ్మ వార్ల ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి సువర్ణశోభితంగా కాంతులీలిన రథం పైకి తీసుకువచ్చారు. రథ పూజలు నిర్వహించిన అనంతరం హరహర మహాధేవ నామ ఘోషాల మద్య అగముడిమొదలియార్ సంఘస్థులు రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్వామి, అమ్మవారు కొలువుతీరిన రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. రథోత్సవానికి తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో మాడవీధులు కిటకిటలాడింది. వీధుల్లో తమ ఇంటి ముందుకు నేత్రపర్వంగా రథంపై ఊరేగుతూ వచ్చిన ఆదిదంపతులకు నివాసితులు కొబ్బరి కాయలు కొట్టి హారతులు పట్టారు. మాడ వీధుల్లో భక్తజనసందోహం నడుమ రథోత్సవం మూడు గంటల పాటు కనులపండువగా జరిగింది. ఊరేగింపు ఆధ్యంతం ఏర్పాటుచేసిన మంగళవాయిద్యాలు, కైలాయ వాయిద్యాలు, మాణిక్యవాసగర్ బృందం వారి శివపురాణ పారాయణం, కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రథంముందు సంచరించిన గంగిరెద్దు ప్రత్యేకతను సంతరించుకుంది. ఎద్దుకు భక్తులు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. మాడవీ«ధుల్లో విహరించి రథం మళ్లీ ఆలయానికి చేరుకోవడంతో రథోత్సవం ముగిసింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు భారీఎత్తున సహపంక్తి భోజనం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో రథం విరాళదాతలు కోనేరు అమృతమ్మ, సుబ్రమణ్య మొదలియార్‌లను, అగముడి మొదలియార్ సంఘస్థులను, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన బృందాల సభ్యులను, ఆలయ ధర్మకర్త సుబ్రమణ్యం, ఉత్సవ నిర్వాహకులు మురళీమోహన్ దుస్సాలువలు, కండువలతో సత్కరించి ఆలయ మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, దయానిధి తదితరులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా రథోత్సవం ’ స్వర్ణకాంతులు చిందే రథంపై కామాక్షీ సమేత కరకంఠేశ్వరుని విహారం నగరి:స్వర్ణకాంతులు చిందే రథంపై కామాక్షిసమేతంగా కరంఠేశ్వరుడు దేధీప్యమానంగా మాడవీధుల్లో విహరించాడు. పట్టణ పరిధిలోని కామాక్షీ సమేత కరకంఠేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న పంగుణోత్తర కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం స్థానిక అగముడి మొదలియార్ సంఘస్థులు రథోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా స్వామి, అమ్మ వార్ల ఉత్సవ
విగ్రహాలను సుందరంగా అలంకరించి సువర్ణశోభితంగా కాంతులీలిన రథం పైకి తీసుకువచ్చారు. రథ పూజలు నిర్వహించిన అనంతరం హరహర మహాధేవ నామ ఘోషాల మద్య అగముడిమొదలియార్ సంఘస్థులు రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్వామి, అమ్మవారు కొలువుతీరిన రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. రథోత్సవానికి తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో మాడవీధులు కిటకిటలాడింది. వీధుల్లో తమ ఇంటి ముందుకు నేత్రపర్వంగా రథంపై ఊరేగుతూ
వచ్చిన ఆదిదంపతులకు నివాసితులు కొబ్బరి కాయలు కొట్టి హారతులు పట్టారు. మాడ వీధుల్లో భక్తజనసందోహం నడుమ రథోత్సవం మూడు గంటల పాటు కనులపండువగా జరిగింది. ఊరేగింపు ఆధ్యంతం ఏర్పాటుచేసిన మంగళవాయిద్యాలు, కైలాయ వాయిద్యాలు, మాణిక్యవాసగర్ బృందం వారి శివపురాణ పారాయణం, కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రథంముందు సంచరించిన గంగిరెద్దు ప్రత్యేకతను సంతరించుకుంది. ఎద్దుకు భక్తులు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. మాడవీ«ధుల్లో విహరించి రథం మళ్లీ ఆలయానికి చేరుకోవడంతో రథోత్సవం
ముగిసింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు భారీఎత్తున సహపంక్తి భోజనం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో రథం విరాళదాతలు కోనేరు అమృతమ్మ, సుబ్రమణ్య మొదలియార్‌లను, అగముడి మొదలియార్ సంఘస్థులను, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన బృందాల సభ్యులను, ఆలయ ధర్మకర్త సుబ్రమణ్యం, ఉత్సవ నిర్వాహకులు మురళీమోహన్ దుస్సాలువలు, కండువలతో సత్కరించి ఆలయ మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, దయానిధి తదితరులు పాల్గొన్నారు.
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- నిత్య చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ నెల్లూరులో గొప్ప ప్రారంభం నెల్లూరు నగరం లోని దర్గా మిట్ట సమీపంలో గల రాజరాజేశ్వరి దేవస్థానం కళ్యాణ మండపం నందు నిత్య చేనేత హస్త కళా మేళా ప్రదర్శన అమ్మ కాల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు. చేనేత హస్త కళా మేల నందు చేనేత వస్త్రములు ముత్యాల హారాలు పోచంపల్లి బెడ్ షీట్స్ కలంకారి ప్రెస్ మెటీరియల్స్ శారీస్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేత వస్త్రాలు వరంగల్ టవల్స్ లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు గద్వాల్ చీరలు జైపూర్ టాప్స్ లెగ్గిన్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ హైదరాబాద్ మంచి ముత్యాలు లెదర్ బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ డ్రై ఫ్రూట్ తినుబండారాలు జైపూర్ బ్యాంగిల్స్ తదితర ఐటమ్స్ స్టాల్స్ ను ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అదే క్రమంలో ప్రత్యేక డిస్కౌంట్ లో కలవని మార్చి 23వ తారీకు నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ప్రవేశ రుసుము పార్కింగ్ రుసుము ఉండదని నిర్వాహకులు నిత్య మరియు శ్రీను మీడియాతో తెలియజేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.3
- అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు ప్రిన్సిపాల్ దాష్టికం విద్యార్థినులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్ నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎక్కువ అన్నం ఎక్కువ కూరలు పెట్టలేమని.. విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతని బెదిరింపులు విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ ను డిస్మిస్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్1
- బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.1
- *జాతీయ రహదారి 40(కర్నూల్ - కడప) రోడ్డు లో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి మనిషి చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు* *మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ వేసి కోర్టు ముందు హాజరు పరచడం అయినది* ముద్దాయి పేరు: షేక్ మస్తాన్, వయసు: 58 సం’’రాలు తండ్రి: లేట్ మౌలాలి, వృత్తి: కూలి, కులం: ముస్లిం, D.No.01/15, అద్దంకి రోడ్డు, St కాలనీ, దర్శి టౌన్ & మండలం, ప్రకాశం జిల్లా. నేరము జరిగిన తేది సమయము మరియు స్థలము: 25.03.2026 వ తేదీన మద్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో కడప జిల్లా, మైదుకూరు టౌన్, ప్రొద్దుటూరు రోడ్డులో జాతీయ రహదారి- 40 (కర్నూల్ - కడప రోడ్డు)లో నుండి సర్వీసు రోడ్డు కలిసే ప్రదేశం అరెస్ట్ జరిగిన తేది మరియు సమయము: On 30.03.2026 at 11.30 AM కడప - కర్నూల్ రోడ్డులోని శ్రీనగరము గ్రామము దగ్గర. Seizure:- AP39 VE 0499 పాల ట్యాంకర్. Brief facts of the case: పైన తెలిపిన ముద్దాయి AP 39 VE 0499 పాల ట్యాంకర్ లో ధర్మవరము నుండి మైదుకూరు లోని అమృత మిల్క్ డైరీకి పాలు తోలుతూ ఉన్న క్రమములో 25.03.2026 వ తేదిన పాలు అమృత మిల్క్ డైరి నందు దించి మరలా ధర్మవరానికి వెళ్తున్న క్రమములో సుమారు 02.30 PM గంటల సమయములో పైన తెలిపిన ముద్దాయి, పైన తెలిపిన స్థలం వద్దకు పాల ట్యాంకర్ ను నడుపుతూ ఆపోసిట్/ రాంగు రోడ్డులో వెళితే ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఆపోసిట్/ రాంగు రోడ్డులో ట్యాంకర్ ను నిర్లక్షంగా నడిపి మోటర్ సైకిల్ పైన వస్తున్న వారికి తగిలించి దువ్వూరు కు చెందిన భాను ప్రకాష్ చనిపోడానికి, గంగా ప్రసాద్ గాయపడటానికి కారణము అయినాడు కాబట్టి అతనిని మైదుకూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. రమణారెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడమైనది. జాతీయ రహదారి మరియు ఇతర రోడ్డులలో వ్యతిరేక దిశలో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అయితే వారిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ను పెట్టి, అరెస్టు చేసి, ప్రమాదాలకు కారణం అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కె.రమణా రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మైదుకూరు అర్బన్ పీఎస్.1
- సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలo కటారుపల్లి గ్రామంలో యోగువేమన ఉత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం చాందిని బండ్లు పానక పన్నీరు తోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యోగివేమన భక్తాదులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి తెలిపారు.1
- వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లి. న్యూస్.. మణపురం రితి జువెలరీస్ లో భారీ మోసం... తరుగు, కూలి లేకుండా బంగారు ఇస్తామని చీటీ రూపంలో డబ్బు కట్టించుకుని ఊడయించిన కేరళాకు చెందిన స్టోర్ మేనేజర్ సూరజ్... జ్యువెలరీ దుకాణం వద్ద గొడవకు దిగిన బాధితులు... సుమారు రూ. కోటి వరకు మోసం జరిగినట్లుగా బాధితుల ఆరోపణ... దుకాణంలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు...3