ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా యోగాంధ్ర-2026కు సంబంధించిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుండి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో యోగాంధ్ర నిర్వహించాలని సీఎం సూచించారు. మొత్తంగా కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. రాజధాని అమరావతిలోని కృష్ణా నదీ వంతెనపై, వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా నిర్మించిన బ్రిడ్జిపై జూన్ 21న 25 వేల మందితో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది ట్రైనర్లకు అదనంగా మరో లక్ష మందిని ట్రైనర్లుగా చేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి జిల్లా ఒక థీమ్ తో 14 రోజుల యోగాంధ్రను నిర్వహిస్తుంది. జిల్లాల్లో యోగాంధ్ర నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ. 25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ఆరోగ్య, మానవవనరులు, మునిసిపల్, పంచాయతీ రాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో (మొత్తం 56 కేంద్రాల్లో) ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తారు. ఒక రోజుకు రెండు జిల్లాల చొప్పున 500 మందితో పర్యాటక ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తారు. అలాగే, 14 రోజుల పాటు పార్కులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయి. యోగాంధ్ర ఈవెంట్లకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అవార్డులు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ యోగా, నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు యోగాంధ్ర నిర్వహణకు సంబంధించి రూపొందించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. యోగాపై అవగాహన, శిక్షణ కోసం తాను చేపట్టిన కార్యక్రమాలను సత్యనారాయణ రాజు సీఎంకు వివరించారు. 90 ఆసనాల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాల వీడియోలు, రోజు వారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామంపై 7 వీడియోలు, యోగా సందేహాలు ప్రశ్నలు-సమాధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్ డొమైనులో పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మీడియా, సోషల్ మీడియా, వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. 8142404888 నెంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపడం లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సత్యనారాయణ రాజు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ తో పాటు సీఎస్ సాయి ప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీర పాండియన్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ట్రామా బ్లాక్‌లో అగ్నిమాపక మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్ అగ్నిమాపక శాఖ మార్గదర్శకత్వంలో చేపట్టిన ఈ విన్యాసంలో, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు రోగులను సురక్షితంగా తరలించే విధానాలపై డమ్మీ పేషెంట్లతో సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో స్పందించే నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం కాగా, అగ్ని ప్రమాదం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై నిమ్స్‌లో ప్రత్యక్ష అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.1
- Post by SHOT NEWS1
- తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి, రూరల్ మండలాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కుసుమంచి మండలంలోని గణపేశ్వర ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, అలాగే కొండాపురం నుంచి పొన్నెకల్లు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి, వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ కోరారు.1
- పని ఒత్తిడి, ఆందోళనల కారణంగా తన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం ఆటో డ్రైవర్‍గా జీవనం సాగిస్తున్న ఓ మహిళ గురించి లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. మిథ్లాజ్ స్వయంగా ఆ మహిళ ఆటో ఎక్కి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ఐటీ మేనేజర్‍గా పని చేసిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఆ ఉద్యోగం మానేసినట్లు ఆ మహిళ చెప్పినట్లు మిథ్లాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా, ఆటో డ్రైవర్‍గా ఆమె చాలా సంతోషంగా ఉన్నారని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఆ మహిళ ఎక్కడ ఆటో నడుపుతున్నారనే వివరాలను మాత్రం ఆ వీడియోలో చెప్పలేదు.1
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా యోగాంధ్ర-2026కు సంబంధించిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుండి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో యోగాంధ్ర నిర్వహించాలని సీఎం సూచించారు. మొత్తంగా కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. రాజధాని అమరావతిలోని కృష్ణా నదీ వంతెనపై, వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా నిర్మించిన బ్రిడ్జిపై జూన్ 21న 25 వేల మందితో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది ట్రైనర్లకు అదనంగా మరో లక్ష మందిని ట్రైనర్లుగా చేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి జిల్లా ఒక థీమ్ తో 14 రోజుల యోగాంధ్రను నిర్వహిస్తుంది. జిల్లాల్లో యోగాంధ్ర నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ. 25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ఆరోగ్య, మానవవనరులు, మునిసిపల్, పంచాయతీ రాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో (మొత్తం 56 కేంద్రాల్లో) ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తారు. ఒక రోజుకు రెండు జిల్లాల చొప్పున 500 మందితో పర్యాటక ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తారు. అలాగే, 14 రోజుల పాటు పార్కులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయి. యోగాంధ్ర ఈవెంట్లకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అవార్డులు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ యోగా, నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు యోగాంధ్ర నిర్వహణకు సంబంధించి రూపొందించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. యోగాపై అవగాహన, శిక్షణ కోసం తాను చేపట్టిన కార్యక్రమాలను సత్యనారాయణ రాజు సీఎంకు వివరించారు. 90 ఆసనాల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాల వీడియోలు, రోజు వారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామంపై 7 వీడియోలు, యోగా సందేహాలు ప్రశ్నలు-సమాధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్ డొమైనులో పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మీడియా, సోషల్ మీడియా, వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. 8142404888 నెంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపడం లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సత్యనారాయణ రాజు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ తో పాటు సీఎస్ సాయి ప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీర పాండియన్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.1
- కంకిపాడు పోలీసులు గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. సీలేరు నుండి గంజాయి తరలించి ఈడుపుగల్లులోని పామాయిల్ తోటలో విక్రయిస్తుండగా ఈ అరెస్టు జరిగింది. సీలేరుకు చెందిన కిముడు శంకర్‌తో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించిన మరో ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 6 కిలోల గంజాయి మరియు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన పోలీస్ సిబ్బందిని సీఐ మురళీకృష్ణ అభినందించారు. సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గంజాయి కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం అవసరం మేరకు డి-అడిక్షన్ సెంటర్‌కు తరలిస్తామని వివరించారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టి పెట్టాలని సూచించిన ఆయన, ఈ కిట్ల ద్వారా 3 నెలల నుండి 6 నెలల క్రితం సేవించినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.1