కరీంనగర్ లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…17 మంది అరెస్టు, 6 లక్షల 74 వేల నగదు సెల్ ఫోన్లు వాహనాలు స్వాధీనం కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబాష్‌నగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 17 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 లక్షల 74 వేల 280 రూపాయల నగదు, 16 మొబైల్ ఫోన్లు, 2 బైకులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటిపై పెంటౌజ్ లో రెండు టేబుళ్లపై మూడు కార్డులతో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏసిపి పర్యవేక్షణలో పోలీసుల మెరుపు దాడి చేసి సిరిపురం నాగభూషణం, చింతల రవీందర్, బండ రత్నాకర్ రెడ్డి, గోదాల రాజిరెడ్డి, జంగ దేవేందర్ రెడ్డి, దొంతుల భరత్, ముష్కం ఉపేందర్, తల్లపల్లి తిరుపతి, రావికంటి సందీప్, మేచినేని శ్రీనివాస్ రావు, కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, ముష్కం ఎల్లయ్య, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, అలువోజు సంపూర్ణ చారి, బొట్టు రవీందర్, వడ్డి కవికుమార్ రెడ్డి, గడ్డం విద్యాసాగర్ లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు సిరిపురం నాగభూషణం పేకాట నిర్వహిస్తూ కామన్ గేమింగ్ హౌస్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కరీంనగర్ లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…17 మంది అరెస్టు, 6 లక్షల 74 వేల నగదు సెల్ ఫోన్లు వాహనాలు స్వాధీనం కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబాష్‌నగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 17 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 లక్షల 74 వేల 280 రూపాయల నగదు, 16 మొబైల్
ఫోన్లు, 2 బైకులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటిపై పెంటౌజ్ లో రెండు టేబుళ్లపై మూడు కార్డులతో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏసిపి పర్యవేక్షణలో పోలీసుల మెరుపు దాడి చేసి సిరిపురం నాగభూషణం, చింతల రవీందర్, బండ రత్నాకర్ రెడ్డి, గోదాల రాజిరెడ్డి, జంగ దేవేందర్ రెడ్డి, దొంతుల భరత్, ముష్కం ఉపేందర్, తల్లపల్లి తిరుపతి, రావికంటి
సందీప్, మేచినేని శ్రీనివాస్ రావు, కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, ముష్కం ఎల్లయ్య, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, అలువోజు సంపూర్ణ చారి, బొట్టు రవీందర్, వడ్డి కవికుమార్ రెడ్డి, గడ్డం విద్యాసాగర్ లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు సిరిపురం నాగభూషణం పేకాట నిర్వహిస్తూ కామన్ గేమింగ్ హౌస్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- హుజురాబాద్ లో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ బైక్ ల పంపిణీ లో ప్రోటోకాల్ వివాదం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రోటోకాల్ పాటించకుండా దివ్యాంగులకు స్కూటీలు, ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా కాంగ్రెస్ నాయకులతో దివ్యాంగులకు బైకులు పంపిణీ చేయడంపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరం నినాదాలు స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి. హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్ లో ఒకే సమయంలో రెండు ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక ఫ్లోర్ లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేస్తే మరో ఫ్లోర్ లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు స్కూటీ లు పంపిణీ చేశారు. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వికలాంగులకు బైకులు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికంగానే తాను ఉన్నప్పటికీ తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా నా, ఎమ్మెల్యే మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తు పద్ధతి మార్చుకోవాలని మందలించారు. జరిగిన పొరపాటును కప్పించుకునేందుకు అధికారులు ప్రయత్నించగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలని సూచిస్తూ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి దివ్యాంగులకు బైకులు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు.1
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- *కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు..*మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చాం..* *అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఆహ్వానించాం..* *అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు పై చర్చకు ఆహ్వానించినా స్పందించని కెసిఆర్..* రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పోవాలి.. ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడడం తగదు..*కరీంనగర్ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి..* తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని కేసీఆర్ గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కరీంనగర్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నేతలతో కలిసి ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు.* ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఈనెల 20వ తేదీన నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు అసెంబ్లీకి రాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే 2023 ఎన్నికల ఫలితాలకు ముందే బీఆర్ఎస్ నాయకులు మూడోసారి అధికారంలోకి వస్తామని ముందస్తు విజయోత్సవాలు నిర్వహించుకున్నారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుబంధు నిధులు టింగు టింగుమని పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని 2023లో చివరి రైతుబంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువబట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2018 వరకు 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రి ని అమర్యాదగా మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు వంటి అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. 2014, 2018 ఇచ్చిన ఒక హామీను కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని మంత్రి అన్నారు. రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత కోపం అని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు పై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని మంత్రి పేర్కొన్నారు. ఇందులో 2023లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనాస్ ఇవ్వడంలో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అన్ని రకాల చర్యలు చేపట్టామని వచ్చే వర్షాకాలం యూరియా కోరత లేకుండ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రం శాసనసభలో 64 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా 40 మంది కొత్తగా ఎన్నికైన వారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఇదేనా సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద అనే మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే వారిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని అన్ని అంశాలపై చర్చించే స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో వస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి తో త్వరలో జగిత్యాలను సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని మంత్రి అన్నారు.4
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికితీతకే పోటీలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పీఎం శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి.. అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12 వ తేదీ వరకు 10 శాఖల ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటి దాకా చేసిన పనులు వివరిస్తూ.. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తుందని వెల్లడించారు.ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, అవగాహన కల్పించామని, రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామని వివరించారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కిచెన్, స్కూల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని పేర్కొన్నారు. టాలెంట్ హంట్ లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అన్ని విద్యాలయాలకు కావాల్సిన మరమ్మత్తుల వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, అన్ని విద్యాలయాల్లో కామన్ డైట్ మెనూ అమలు చేస్తుందని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి పుస్తకాలతో పాటు దిన పత్రికలు, కథల పుస్తకాలు చదవాలని సూచించారు. ఆటలు లేదా ఏదైనా ఒక రంగంలో బాగా సాధన చేసి.. రాణించాలని పేర్కొన్నారు. పరిసరాల పై అవగాహన ఉండాలని, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సమయం వృథా చేయవద్దని వివరించారు. విద్యార్థులు అందరూ ఏ నేపథ్యం నుంచి వచ్చినా కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, గురుకులాల డీసీఓ థెరిస్సా, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సిలివేరి లావణ్య, ప్రిన్సిపాల్ బీ పద్మ తదితరులు పాల్గొన్నారు.2
- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1
- Post by Tagore1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సుభాష్ నగర్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో ఇందిరానగర్ కు చెందిన వృద్దుడు అలువాల అంకయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో బైక్ కు ట్రాక్టర్ తగలగా బైక్ కింద పడింది. తృటిలో ఆ బైకిస్ట్ కు ప్రమాదం తప్పింది. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. అతివేగం అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1