logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోలవరం ఆంధ్రప్రదేశ్ ఆధునిక దేవాలయం పుష్కరాలకు ముందే పూర్తికి సన్నాహాలు నాణ్యత విషయంలో రాజీలేదు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక దేవాలయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలో చారిత్రక ఘట్టమైన గోదావరి పుష్కరాలకు ముందే, పోలవరం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను, ప్రగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా.. ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తి చేయడం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు గోదావరి జలాలు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయబోతున్నామని చెప్పారు. ఈ మహా యజ్ఞం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయడమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయంగా ఆయన పేర్కొన్నారు. అలాగే పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమపద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నామన్నారు. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ, ఇప్పుడు పెద్ద పీట వేసి, అవి పూర్తి అయ్యేలా చేసింది, చేస్తోంది కూటమి ప్రభుత్వమే.. అని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా, రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని చంద్రబాబు సూచించిన విషయాన్ని రామానాయుడు గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కీలకమైన డయాఫ్రం వాల్ ధ్వంసం అయింది. దాన్ని సరి చేస్తే సరిపోతుంది అని నిపుణులు చెప్పినా నాణ్యత, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. సి డబ్ల్యూ సి డిజైన్స్ ప్రకారమే పోలవరం పనులు జరుగుతున్నాయన్నారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనలు, ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నామన్నారు. ఈ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిత్యం పర్యవేక్షిస్తుందని..రామానాయుడు అన్నారు. అలాగే ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నట్లు చెప్పారు. కొత్త డయాఫ్రం వాల్ 1372 మీటర్లకు గానూ, 1300 మీటర్లు నేటికి పూర్తయిందన్నారు. ఈ నెలాఖరికి మొత్తం పూర్తవుతుందన్నారు. ఈసిఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో నేలను గట్టిపరచేలా వైబ్రో కాంప్యాక్షన్ పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్ట్ అనుసంధాన పనుల్లో ముఖ్యమైన కుడి, ఎడమ కాలువలను ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. నిర్వాసితుల నష్టపరిహారానికి సంబంధించి నాడు 2016లో రూ.700 కోట్ల పరిహారం అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు దపాలుగా 1900 కోట్లు పంపిణీ చేసి నిర్వాసితులకు అండగా నిలిచారన్నారు. నిర్వాశితులను కొంత మంది మధ్యవర్తులు మీకు మావల్లే పరిహారం అందింది అంటూ మోసం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని, మధ్యవర్తుల విషయం లో అధికారులు కఠినం గా వ్యవహారించాలని సూచించారు. నిర్వాసితులు కూడా ఇలా మోసానికి పాల్పడే వారిపట్ల జాగ్రత్త గా ఉండాలని సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణం పై సూచనలు, సలహాలు, విమర్శలు, డిమాండ్స్ వస్తున్నా, వాటిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తామని మంత్రి రామానాయుడు చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యత పై గాని, భద్రతా ప్రమాణాలు పాటించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన నొక్కి వక్కాణించారు. మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈ ఎన్ సి నరసింహ మూర్తి, ప్రాజెక్ట్ అడ్మిన్ అభిషేక్, మరియు కాంట్రాక్టు ఏజెన్సీ ల ప్రతినిధులు, ఇతర ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Mallikarjuna Akula
Mallikarjuna Akula
Organic farm కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
3e70c156-ae44-4e9d-9f4e-a5a67ab431e7

పోలవరం ఆంధ్రప్రదేశ్ ఆధునిక దేవాలయం పుష్కరాలకు ముందే పూర్తికి సన్నాహాలు నాణ్యత విషయంలో రాజీలేదు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక దేవాలయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలో చారిత్రక ఘట్టమైన గోదావరి పుష్కరాలకు ముందే, పోలవరం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను, ప్రగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా.. ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తి చేయడం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు గోదావరి జలాలు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయబోతున్నామని చెప్పారు. ఈ మహా యజ్ఞం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయడమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయంగా ఆయన పేర్కొన్నారు. అలాగే పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమపద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నామన్నారు. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ, ఇప్పుడు పెద్ద పీట వేసి, అవి పూర్తి అయ్యేలా చేసింది, చేస్తోంది కూటమి ప్రభుత్వమే.. అని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా, రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని చంద్రబాబు సూచించిన విషయాన్ని రామానాయుడు గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కీలకమైన డయాఫ్రం వాల్ ధ్వంసం అయింది. దాన్ని సరి చేస్తే సరిపోతుంది అని నిపుణులు చెప్పినా నాణ్యత, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టామని మంత్రి స్పష్టం

1587c26b-8b0b-422c-a365-247aae8b7634

చేశారు. సి డబ్ల్యూ సి డిజైన్స్ ప్రకారమే పోలవరం పనులు జరుగుతున్నాయన్నారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనలు, ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నామన్నారు. ఈ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిత్యం పర్యవేక్షిస్తుందని..రామానాయుడు అన్నారు. అలాగే ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నట్లు చెప్పారు. కొత్త డయాఫ్రం వాల్ 1372 మీటర్లకు గానూ, 1300 మీటర్లు నేటికి పూర్తయిందన్నారు. ఈ నెలాఖరికి మొత్తం పూర్తవుతుందన్నారు. ఈసిఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో నేలను గట్టిపరచేలా వైబ్రో కాంప్యాక్షన్ పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్ట్ అనుసంధాన పనుల్లో ముఖ్యమైన కుడి, ఎడమ కాలువలను ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. నిర్వాసితుల నష్టపరిహారానికి సంబంధించి నాడు 2016లో రూ.700 కోట్ల పరిహారం అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు దపాలుగా 1900 కోట్లు పంపిణీ చేసి నిర్వాసితులకు అండగా నిలిచారన్నారు. నిర్వాశితులను కొంత మంది మధ్యవర్తులు మీకు మావల్లే పరిహారం అందింది అంటూ మోసం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని, మధ్యవర్తుల విషయం లో అధికారులు కఠినం గా వ్యవహారించాలని సూచించారు. నిర్వాసితులు కూడా ఇలా మోసానికి పాల్పడే వారిపట్ల జాగ్రత్త గా ఉండాలని సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణం పై సూచనలు, సలహాలు, విమర్శలు, డిమాండ్స్ వస్తున్నా, వాటిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తామని మంత్రి రామానాయుడు చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యత పై గాని, భద్రతా ప్రమాణాలు పాటించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన నొక్కి వక్కాణించారు. మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈ ఎన్ సి నరసింహ మూర్తి, ప్రాజెక్ట్ అడ్మిన్ అభిషేక్, మరియు కాంట్రాక్టు ఏజెన్సీ ల ప్రతినిధులు, ఇతర ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Magathala Siddhartha
    2
    Post by Magathala Siddhartha
    user_Magathala Siddhartha
    Magathala Siddhartha
    గోనెగండ్ల, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    1
    మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో  త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బ‌స్సులో బ్ర‌ష్ చేసుకుంటున్న మ‌హిళ‌. ఆశ్చ‌ర్య‌పోయిన తోటి ప్ర‌యాణికులు, కండ‌క్ట‌ర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘ‌ట‌న‌పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.
    1
    నాగర్‌కర్నూల్‌ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బ‌స్సులో బ్ర‌ష్ చేసుకుంటున్న మ‌హిళ‌.
ఆశ్చ‌ర్య‌పోయిన తోటి ప్ర‌యాణికులు, కండ‌క్ట‌ర్. పూర్తి వివరాలకు వెళితే
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘ‌ట‌న‌పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    5 hrs ago
  • గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
    1
    గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    1
    రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి
కడప జిల్లా 
రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు* హైదరాబాద్: జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
    3
    *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు*
హైదరాబాద్: జిహెచ్ఎంసి  శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 
99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది.
ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది
స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు
ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో  సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు 
చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు 
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు
    1
    కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు
    1
    పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్డు మీదికి రావడంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏడవ వార్డు కౌన్సిలర్ వీర్ల స్వరూప జెసిపి సహాయంతో డ్రైనేజీని మరమ్మతులు నిర్వహించి నూతన పైపు వేసి చర్యలు చేపట్టారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.