logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ పరిధిలోని జాబితాలలో వారి వివరాలను ఈ నెల 15వ తేదీలోగా పరిశీలించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గస్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ ఇంతవరకు పూర్తయిన మ్యాపింగ్ వివరాలను తమకు అందించాలని కోరారు. తహసిల్దార్ డానియల్, ఎంపీడీవో సాయి లీలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసిల్దార్ కూడా 15లోపు ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని పునరుద్ఘాటించారు.

14 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ పరిధిలోని జాబితాలలో వారి వివరాలను ఈ నెల 15వ తేదీలోగా పరిశీలించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గస్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ ఇంతవరకు పూర్తయిన మ్యాపింగ్ వివరాలను తమకు అందించాలని కోరారు. తహసిల్దార్ డానియల్, ఎంపీడీవో సాయి లీలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసిల్దార్ కూడా 15లోపు ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని పునరుద్ఘాటించారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం విజయ డెయిరీ మూసివేతకు సంబంధించి కొన్ని రోజులుగా పలు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో, గురువారం సీపీఎం జిల్లా ప్రతినిధి బృందం ప్లాంట్‌ను పరిశీలించింది. ఈ సందర్బంగా పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ మాట్లాడుతూ, ఈ నెల 1వ తేదీ నుంచి పాలు, పెరుగు ప్యాకింగ్ విభాగాలను మూసివేయడం, అలాగే సిబ్బందిని తొలగించడం సరైంది కాదని స్పష్టం చేశారు. విజయ డెయిరీ మూసివేత ప్రయత్నాలను తీవ్రంగా ఖండించిన ఆయన, ఈ పరిణామాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
    1
    ఖమ్మం విజయ డెయిరీ మూసివేతకు సంబంధించి కొన్ని రోజులుగా పలు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో, గురువారం సీపీఎం జిల్లా ప్రతినిధి బృందం ప్లాంట్‌ను పరిశీలించింది. ఈ సందర్బంగా పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ మాట్లాడుతూ, ఈ నెల 1వ తేదీ నుంచి పాలు, పెరుగు ప్యాకింగ్ విభాగాలను మూసివేయడం, అలాగే సిబ్బందిని తొలగించడం సరైంది కాదని స్పష్టం చేశారు.

విజయ డెయిరీ మూసివేత ప్రయత్నాలను తీవ్రంగా ఖండించిన ఆయన, ఈ పరిణామాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పీవీకే 5 మైన్ వద్ద తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్మికులతో గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కొత్త రాజకీయ శక్తిగా అవతరించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా సింగరేణి కార్మికుల కోసమే పనిచేశామని, కొత్త పార్టీని దీవించి, ఆశీర్వదించమని 'బాయి బాట' కార్యక్రమం పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ సాధనకు నిలబడిన సింగరేణి కార్మికులకు హెచ్ఎంఎస్ యూనియన్ అండగా నిలుస్తుందని, సింగరేణి కార్మికుల ధైర్యం, త్యాగం వల్లే తెలంగాణ వచ్చిందని ఆమె గుర్తుచేశారు. గతంలో మెడికల్ బోర్డుల నిర్వహణకు కృషి చేశామని, దీనివల్ల 20,000 మంది యువ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారని కవిత వివరించారు. కార్మికుల హక్కులను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నిస్తూ, డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని స్పష్టం చేశారు. నెలకు ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించిందని, ఇది అవినీతిమయమని ఆమె ఆరోపించారు. తమ మైన్స్‌ తమకే కావాలని కొట్లాడితే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. కిషన్ రెడ్డి తాడిచెర్ల-2 బొగ్గుబాయిని సింగరేణికి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించిన కవిత, 16 మైన్స్‌ ఇచ్చేవరకు కిషన్ రెడ్డి వెంట పడతామని హెచ్చరించారు. బయ్యారం గనులు సింగరేణి ఆధ్వర్యంలో నడవాలని పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. నాణ్యతలేని బూట్లు, గ్లౌజులు ఇస్తున్నారని కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయించాలని కూనంనేని సాంబశివరావును డిమాండ్ చేశారు. ఎర్రజెండాలు కప్పుకొని సీపీఐ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని హాట్ కామెంట్స్ చేసిన ఆమె, గుర్తింపు సంఘంగా ఉండి ఏఐటీయూసీ మెడికల్ బోర్డు పెట్టకపోతే ఎందుకు పోరాటం చేయటం లేదని ప్రశ్నించారు. అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలని, కమిటీల పేర్లతో కాలయాపన చేయొద్దని ఆమె కోరారు. అలియాస్, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డుపై హెచ్‌ఎంఎస్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ మార్గంలో పోరాటం చేస్తామని, ఈ నెల 20వ తారీకు లోపల సింగరేణి అఫీషియల్ ఆర్డర్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం చేయాల్సిన పని సీఎం చేయాలని, జెన్‌కో నుంచి రావాల్సిన ₹30,000 కోట్లు, ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన ₹20,000 కోట్లు సింగరేణికి ఇప్పించాలని కోరారు. జీఎంలు, క్లర్కులు చేసే పనులు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు చేయొద్దని, విధానపరమైన పనులు చేయాలని ఆమె హితవు పలికారు. రాబోయే గుర్తింపు సంఘ ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ యూనియన్‌కు అవకాశం ఇవ్వాలని, మద్దతు ఇవ్వాలని ఆమె కార్మికులను అభ్యర్థించారు. సింగరేణి సంస్థ బాగుండాలని ఆకాంక్షించిన కవిత, కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు, మినిమం వేజెస్ కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. పీవీకే 5 మైన్‌లో సింగరేణి కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, వారి భద్రత పట్ల అధికారులు దృష్టి పెట్టాలని ఆమె అధికారులకు సూచించారు.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పీవీకే 5 మైన్ వద్ద తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్మికులతో గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కొత్త రాజకీయ శక్తిగా అవతరించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా సింగరేణి కార్మికుల కోసమే పనిచేశామని, కొత్త పార్టీని దీవించి, ఆశీర్వదించమని 'బాయి బాట' కార్యక్రమం పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ సాధనకు నిలబడిన సింగరేణి కార్మికులకు హెచ్ఎంఎస్ యూనియన్ అండగా నిలుస్తుందని, సింగరేణి కార్మికుల ధైర్యం, త్యాగం వల్లే తెలంగాణ వచ్చిందని ఆమె గుర్తుచేశారు.

గతంలో మెడికల్ బోర్డుల నిర్వహణకు కృషి చేశామని, దీనివల్ల 20,000 మంది యువ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారని కవిత వివరించారు. కార్మికుల హక్కులను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నిస్తూ, డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని స్పష్టం చేశారు. నెలకు ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించిందని, ఇది అవినీతిమయమని ఆమె ఆరోపించారు. తమ మైన్స్‌ తమకే కావాలని కొట్లాడితే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

కిషన్ రెడ్డి తాడిచెర్ల-2 బొగ్గుబాయిని సింగరేణికి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించిన కవిత, 16 మైన్స్‌ ఇచ్చేవరకు కిషన్ రెడ్డి వెంట పడతామని హెచ్చరించారు. బయ్యారం గనులు సింగరేణి ఆధ్వర్యంలో నడవాలని పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. నాణ్యతలేని బూట్లు, గ్లౌజులు ఇస్తున్నారని కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయించాలని కూనంనేని సాంబశివరావును డిమాండ్ చేశారు. ఎర్రజెండాలు కప్పుకొని సీపీఐ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని హాట్ కామెంట్స్ చేసిన ఆమె, గుర్తింపు సంఘంగా ఉండి ఏఐటీయూసీ మెడికల్ బోర్డు పెట్టకపోతే ఎందుకు పోరాటం చేయటం లేదని ప్రశ్నించారు. అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలని, కమిటీల పేర్లతో కాలయాపన చేయొద్దని ఆమె కోరారు.

అలియాస్, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డుపై హెచ్‌ఎంఎస్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ మార్గంలో పోరాటం చేస్తామని, ఈ నెల 20వ తారీకు లోపల సింగరేణి అఫీషియల్ ఆర్డర్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం చేయాల్సిన పని సీఎం చేయాలని, జెన్‌కో నుంచి రావాల్సిన ₹30,000 కోట్లు, ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన ₹20,000 కోట్లు సింగరేణికి ఇప్పించాలని కోరారు. జీఎంలు, క్లర్కులు చేసే పనులు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు చేయొద్దని, విధానపరమైన పనులు చేయాలని ఆమె హితవు పలికారు. రాబోయే గుర్తింపు సంఘ ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ యూనియన్‌కు అవకాశం ఇవ్వాలని, మద్దతు ఇవ్వాలని ఆమె కార్మికులను అభ్యర్థించారు. సింగరేణి సంస్థ బాగుండాలని ఆకాంక్షించిన కవిత, కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు, మినిమం వేజెస్ కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. పీవీకే 5 మైన్‌లో సింగరేణి కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, వారి భద్రత పట్ల అధికారులు దృష్టి పెట్టాలని ఆమె అధికారులకు సూచించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అరుదైన వ్యాధితో మరణించిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు జనసైనికులు మరియు వీరమహిళలు ఘనంగా నివాళులర్పించారు. జనసేన పార్టీ కార్యాలయం నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు సంతాప ర్యాలీ నిర్వహించి, అక్కడ నిరంజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. నిరంజన్ చివరి కోరికను నెరవేర్చడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరంజన్ మరణం నేపథ్యంలో పేర్ని నాని చేసిన వెకిలి వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తూ, మానవత్వం లేకుండా ఆయన విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అభిమానించే ఒక చిన్న బాలుడి చివరి కోరికను పవన్ కళ్యాణ్ తీర్చడంపై పేర్ని నాని విమర్శలు చేయడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిరంజన్ మృతితో పేర్ని నాని కళ్లు చల్లబడ్డాయా? పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న కడుపు మంట తగ్గిందా? అంటూ వారు సూటిగా ప్రశ్నించారు.
    1
    కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అరుదైన వ్యాధితో మరణించిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు జనసైనికులు మరియు వీరమహిళలు ఘనంగా నివాళులర్పించారు. జనసేన పార్టీ కార్యాలయం నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు సంతాప ర్యాలీ నిర్వహించి, అక్కడ నిరంజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. నిరంజన్ చివరి కోరికను నెరవేర్చడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరంజన్ మరణం నేపథ్యంలో పేర్ని నాని చేసిన వెకిలి వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తూ, మానవత్వం లేకుండా ఆయన విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అభిమానించే ఒక చిన్న బాలుడి చివరి కోరికను పవన్ కళ్యాణ్ తీర్చడంపై పేర్ని నాని విమర్శలు చేయడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిరంజన్ మృతితో పేర్ని నాని కళ్లు చల్లబడ్డాయా? పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న కడుపు మంట తగ్గిందా? అంటూ వారు సూటిగా ప్రశ్నించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, పెద్దకోట పంచాయతీ పరిధిలోని మడ్రేబు పీవీటీజీ కొందు గిరిజన గ్రామానికి ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు గుర్రాల ర్యాలీ నిర్వహించారు. మడ్రేబు నుండి తునిసీబు గ్రామం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర గుర్రాలపై ప్రదర్శన చేపట్టి, తమ సమస్యను వినూత్న రీతిలో ప్రభుత్వానికి తెలియజేశారు. మడ్రేబు గ్రామంలో 29 రేషన్ కార్డులు ఉన్నాయని, అయితే ప్రస్తుతం బియ్యం కోసం 15 కిలోమీటర్లు ప్రయాణించి వేలమామిడి జీసీసీ డిపోకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ఒకరోజు మొత్తం ప్రయాణానికే సమయం వెచ్చించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై 2026 మే 27న అనంతగిరి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన 'మీకోసం' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని గిరిజనులు తెలిపారు. తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌లో, రేషన్ కార్డుల మ్యాపింగ్ కారణంగా దాయర్తి జీసీసీ డిపో ద్వారా ఆఫ్‌లైన్‌లో బియ్యం అందుతుండగా, వేలమామిడి డిపోలో సాంకేతిక కారణాల వల్ల సరఫరా సాధ్యం కాదని పేర్కొన్నట్లు వివరించారు. అందువల్ల, మడ్రేబు గ్రామంలో ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేసి నెలకు ఒకరోజు బియ్యం పంపిణీ చేయాలని, అలాగే సమీపంలోని తునిసీబు గ్రామంలోని 30 పీవీటీజీ కుటుంబాలను కూడా మడ్రేబుతో కలిపి రెండు గ్రామాలకు ఒకే రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రహదారి పనులను అల్లూరి జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కే. గోవిందరావు, పీవీటీజీ సంఘం నాయకుడు కొండతాంబలి నర్సింగరావు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పీవీటీజీ గ్రామాలకు ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలన్నదే వారి ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
    4
    అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, పెద్దకోట పంచాయతీ పరిధిలోని మడ్రేబు పీవీటీజీ కొందు గిరిజన గ్రామానికి ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు గుర్రాల ర్యాలీ నిర్వహించారు. మడ్రేబు నుండి తునిసీబు గ్రామం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర గుర్రాలపై ప్రదర్శన చేపట్టి, తమ సమస్యను వినూత్న రీతిలో ప్రభుత్వానికి తెలియజేశారు. మడ్రేబు గ్రామంలో 29 రేషన్ కార్డులు ఉన్నాయని, అయితే ప్రస్తుతం బియ్యం కోసం 15 కిలోమీటర్లు ప్రయాణించి వేలమామిడి జీసీసీ డిపోకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ఒకరోజు మొత్తం ప్రయాణానికే సమయం వెచ్చించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై 2026 మే 27న అనంతగిరి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన 'మీకోసం' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని గిరిజనులు తెలిపారు. తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌లో, రేషన్ కార్డుల మ్యాపింగ్ కారణంగా దాయర్తి జీసీసీ డిపో ద్వారా ఆఫ్‌లైన్‌లో బియ్యం అందుతుండగా, వేలమామిడి డిపోలో సాంకేతిక కారణాల వల్ల సరఫరా సాధ్యం కాదని పేర్కొన్నట్లు వివరించారు.

అందువల్ల, మడ్రేబు గ్రామంలో ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేసి నెలకు ఒకరోజు బియ్యం పంపిణీ చేయాలని, అలాగే సమీపంలోని తునిసీబు గ్రామంలోని 30 పీవీటీజీ కుటుంబాలను కూడా మడ్రేబుతో కలిపి రెండు గ్రామాలకు ఒకే రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రహదారి పనులను అల్లూరి జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కే. గోవిందరావు, పీవీటీజీ సంఘం నాయకుడు కొండతాంబలి నర్సింగరావు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పీవీటీజీ గ్రామాలకు ప్రత్యేక రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలన్నదే వారి ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
    user_Laxman Regam
    Laxman Regam
    Local News Reporter అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్‌లు మరియు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ మేరకు మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పరస్పర సహకారంతో విధులు నిర్వహించడం అత్యవసరమని ఆయన ఉద్ఘాటించారు. సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కూనంనేని స్పష్టం చేశారు.
    1
    ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్‌లు మరియు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ మేరకు మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పరస్పర సహకారంతో విధులు నిర్వహించడం అత్యవసరమని ఆయన ఉద్ఘాటించారు. సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కూనంనేని స్పష్టం చేశారు.
    user_Kinnera narendra kumar
    Kinnera narendra kumar
    Kothagudem, Bhadradri Kothagudem•
    21 hrs ago
  • కొత్తగూడెంలో గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరస్పర సహకారంతో తమ విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
    1
    కొత్తగూడెంలో గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరస్పర సహకారంతో తమ విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
    user_Kinnera narendra kumar
    Kinnera narendra kumar
    Kothagudem, Bhadradri Kothagudem•
    21 hrs ago
  • కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో బీజేపీ నేతలు కూడా జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం, నడ్డా బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించి, హైదరాబాద్‌లో నిర్వహించే ఒక సదస్సులో పాల్గొననున్నారు.
    1
    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో బీజేపీ నేతలు కూడా జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం, నడ్డా బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించి, హైదరాబాద్‌లో నిర్వహించే ఒక సదస్సులో పాల్గొననున్నారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    11 hrs ago
  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రేయాన్ష్ కోసం స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన గరిటె పట్టి, నూనెలో పూరీలు వేయిస్తూ మనవడితో సరదాగా మాట్లాడుతుండటం కనిపిస్తోంది. ఈ సందర్బంగా తన మనవడితో ఆయన జరిపిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన అమ్మమ్మ కోసం పూరీలు కావాలని మనవడు అడగడం ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    1
    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రేయాన్ష్ కోసం స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన గరిటె పట్టి, నూనెలో పూరీలు వేయిస్తూ మనవడితో సరదాగా మాట్లాడుతుండటం కనిపిస్తోంది.

ఈ సందర్బంగా తన మనవడితో ఆయన జరిపిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన అమ్మమ్మ కోసం పూరీలు కావాలని మనవడు అడగడం ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా గరాజియా గ్రామంలో ఒక వ్యక్తిపై సింహం దాడికి పాల్పడింది. పశువులను కాచుకుంటున్న సమయంలో పొదల్లో దాక్కున్న సింహం ఒక్కసారిగా అతనిపైకి దూకింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, స్థానికులు అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో సింహం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. సింహం నోటి వరకు వెళ్లిన ప్రాణాలు దక్కడంతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.
    1
    గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా గరాజియా గ్రామంలో ఒక వ్యక్తిపై సింహం దాడికి పాల్పడింది. పశువులను కాచుకుంటున్న సమయంలో పొదల్లో దాక్కున్న సింహం ఒక్కసారిగా అతనిపైకి దూకింది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, స్థానికులు అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో సింహం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. సింహం నోటి వరకు వెళ్లిన ప్రాణాలు దక్కడంతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.