logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ కాలనీకి చెందిన వారికి దాదాపు 5 లక్షల 90 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు అమరావతి నగర్ మాజీ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ తెలిపారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ రోగాలకు సంబంధించి సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్న ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోగా, అందులో భాగంగా 68 మందికి ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఇందులో భాగంగా అమరావతి నగర్ వార్డుకు చెందిన ఆరుగురికి రూ. 5 లక్షల 90 వేల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న ప్రజలు తమ హాస్పిటల్ రసీదులను ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేస్తే, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు వచ్చేలా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ప్రయత్నం చేస్తారని లలితమ్మ పేర్కొన్నారు. అప్పులు చేసుకుని వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉపేంద్ర, పరుశురాం, మహాదేవ, నాగార్జున, బోయచంద్ర, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_రీపోటర్ గర్జి రాజు
రీపోటర్ గర్జి రాజు
Mantralayam, Kurnool•
1 hr ago
9be93a00-6a02-4786-b49b-210abc2a6afe

ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ కాలనీకి చెందిన వారికి దాదాపు 5 లక్షల 90 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు అమరావతి నగర్ మాజీ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ తెలిపారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ రోగాలకు సంబంధించి సొంత డబ్బులతో వైద్యం

a60ac893-5e9c-42bc-a90d-27f3bd8a6dc1

చేయించుకున్న ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోగా, అందులో భాగంగా 68 మందికి ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఇందులో భాగంగా అమరావతి నగర్ వార్డుకు చెందిన ఆరుగురికి రూ. 5 లక్షల 90 వేల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న ప్రజలు తమ హాస్పిటల్ రసీదులను ఎమ్మెల్యే

36d5e2dd-13f4-4594-8db0-e753ebbb16d4

కార్యాలయంలో అందజేస్తే, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు వచ్చేలా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ప్రయత్నం చేస్తారని లలితమ్మ పేర్కొన్నారు. అప్పులు చేసుకుని వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉపేంద్ర, పరుశురాం, మహాదేవ, నాగార్జున, బోయచంద్ర, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఏబీఎన్ రిపోర్టర్‌కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల ఘటనపై ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ప్రతినిధులు పెద్దకడబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
    1
    కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఏబీఎన్ రిపోర్టర్‌కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల ఘటనపై ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ప్రతినిధులు పెద్దకడబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఆసుపత్రిలోని 'రేడియాలజీ హబ్'లో ఉదయం నుండి కరెంట్ లేకపోవడంతో ఎక్స్-రే, స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పరీక్షల కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రిలో జనరేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అధికారులు మరియు సిబ్బంది దానిని ఆన్ చేసి స్కానింగ్ ప్రక్రియను కొనసాగించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి విద్యుత్ లేదనే నెపంతో టెక్నిషియన్లు కూడా స్కానింగ్ చేయడానికి నిరాకరిస్తున్నారని, దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చిన పేద రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రేడియాలజీ సేవలను పునరుద్ధరించాలని, పేద రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఆసుపత్రిలోని 'రేడియాలజీ హబ్'లో ఉదయం నుండి కరెంట్ లేకపోవడంతో ఎక్స్-రే, స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పరీక్షల కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రిలో జనరేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అధికారులు మరియు సిబ్బంది దానిని ఆన్ చేసి స్కానింగ్ ప్రక్రియను కొనసాగించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి విద్యుత్ లేదనే నెపంతో టెక్నిషియన్లు కూడా స్కానింగ్ చేయడానికి నిరాకరిస్తున్నారని, దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చిన పేద రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రేడియాలజీ సేవలను పునరుద్ధరించాలని, పేద రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితిలో నాయక్ పోడ్ జాతి ఉందని, వారిపై సమాజం చూపిస్తున్న చిన్నచూపును ఇది స్పష్టం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో కూడా తమ కులాన్ని చేర్చడం లేదని నాయక్ పోడ్ వర్గీయులు వాపోతున్నారని ఆమె పేర్కొన్నారు. నాయక్ పోడ్ వర్గీయులను కొందరు గొండు అని, మరికొందరు కోయ నాయక్ పోడ్ అని తప్పుగా నమోదు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఏ జాతి వారికైనా తమ అస్తిత్వం, గౌరవం ఉంటాయని, ఈ విషయంలో వారిని మనుషులుగా గుర్తించరా? అంటూ ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
    1
    తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితిలో నాయక్ పోడ్ జాతి ఉందని, వారిపై సమాజం చూపిస్తున్న చిన్నచూపును ఇది స్పష్టం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో కూడా తమ కులాన్ని చేర్చడం లేదని నాయక్ పోడ్ వర్గీయులు వాపోతున్నారని ఆమె పేర్కొన్నారు.

నాయక్ పోడ్ వర్గీయులను కొందరు గొండు అని, మరికొందరు కోయ నాయక్ పోడ్ అని తప్పుగా నమోదు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఏ జాతి వారికైనా తమ అస్తిత్వం, గౌరవం ఉంటాయని, ఈ విషయంలో వారిని మనుషులుగా గుర్తించరా? అంటూ ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    10 hrs ago
  • బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలసిన శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం నిజ జేష్ఠ మాసం ద్వాదశి శనివారం, కృతిక నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకుని శని గ్రహదోష నివారణ కోసం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ అభిషేకాలు అత్యంత భక్తిభావంతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ, ఈ మాసంలో స్వామివారిని కొలిస్తే భక్తులకు అత్యంత సంతృప్తితో పాటు విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జన్మ రీత్యా, గోచార రీత్యా ఉన్న శనిగ్రహ దోషాల నివారణకు శక్తిమేరకు స్వామివారిని పూజించాలని ఆయన కోరారు. ఇదే సమయంలో, గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం కలిగిన పరమశివునికి భక్తులు రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించగా, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ మహత్తర కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి.సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
    1
    బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలసిన శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం నిజ జేష్ఠ మాసం ద్వాదశి శనివారం, కృతిక నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకుని శని గ్రహదోష నివారణ కోసం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ అభిషేకాలు అత్యంత భక్తిభావంతో జరిగాయి.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ, ఈ మాసంలో స్వామివారిని కొలిస్తే భక్తులకు అత్యంత సంతృప్తితో పాటు విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జన్మ రీత్యా, గోచార రీత్యా ఉన్న శనిగ్రహ దోషాల నివారణకు శక్తిమేరకు స్వామివారిని పూజించాలని ఆయన కోరారు. ఇదే సమయంలో, గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం కలిగిన పరమశివునికి భక్తులు రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించగా, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనలు చేశారు.

పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ మహత్తర కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి.సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    3 hrs ago
  • నంద్యాల కోర్టులో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. గౌరవ నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్‌లో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదులు కక్షిదారులను సాధ్యమైనంత వరకు రాజీ మార్గంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ అదాలత్‌లో దాదాపు 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు పరిష్కారమయ్యాయని, అత్యధికంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల మేర సెటిల్‌మెంట్ జరిగిందని వివరించారు. కోర్టు స్థాయిలో మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులతో పాటు సివిల్ కేసులు, బ్యాంకు మేటర్స్, ఇతర లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వ్యవహారాలపై న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహకారంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేసినట్లు స్పష్టం చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చేకూరిన ఆర్థిక సహాయం ఎంతో అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
    2
    నంద్యాల కోర్టులో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. గౌరవ నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్‌లో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదులు కక్షిదారులను సాధ్యమైనంత వరకు రాజీ మార్గంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ అదాలత్‌లో దాదాపు 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు పరిష్కారమయ్యాయని, అత్యధికంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల మేర సెటిల్‌మెంట్ జరిగిందని వివరించారు. కోర్టు స్థాయిలో మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులతో పాటు సివిల్ కేసులు, బ్యాంకు మేటర్స్, ఇతర లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు.

ఇన్సూరెన్స్ కంపెనీల వ్యవహారాలపై న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహకారంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేసినట్లు స్పష్టం చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చేకూరిన ఆర్థిక సహాయం ఎంతో అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    39 min ago
  • నంద్యాల కోర్టులో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుండి రూ. 3 కోట్ల 50 లక్షల ఆర్థిక సహాయం లభించింది. ఈ సందర్భంగా గౌరవ నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడుపై అభినందనల వర్షం కురుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. న్యాయవాదులు ఎన్నడూ లేని విధంగా కక్షిదారులు రాజీ పడేలా విశేష కృషి చేశారని కొనియాడారు. మోటర్ వెహికల్స్ యాక్సిడెంట్ కేసులు, జిల్లా కోర్టు స్థాయి సివిల్ కేసులు, బ్యాంకు వ్యవహారాలు, లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో పాటు కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహాయంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. బాధితుల పక్షాన నిలబడి అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడికి అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
    3
    నంద్యాల కోర్టులో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుండి రూ. 3 కోట్ల 50 లక్షల ఆర్థిక సహాయం లభించింది. ఈ సందర్భంగా గౌరవ నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడుపై అభినందనల వర్షం కురుస్తోంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. న్యాయవాదులు ఎన్నడూ లేని విధంగా కక్షిదారులు రాజీ పడేలా విశేష కృషి చేశారని కొనియాడారు. మోటర్ వెహికల్స్ యాక్సిడెంట్ కేసులు, జిల్లా కోర్టు స్థాయి సివిల్ కేసులు, బ్యాంకు వ్యవహారాలు, లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో పాటు కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహాయంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. బాధితుల పక్షాన నిలబడి అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడికి అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    54 min ago
  • రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని ఏఆర్‌కే బంకెట్ సమీపంలో పూర్తిగా ఎండిపోయిన ఒక చెట్టు అత్యంత ప్రమాదకరంగా నిలిచింది. ఈ రహదారి గుండా నిత్యం భారీగా రాకపోకలు సాగుతుండటంతో, బలమైన గాలులు వీచే సమయంలో ఈ చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు, బాటసారులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా ఆ ఎండిన చెట్టును తొలగించాలని స్థానికులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని ఏఆర్‌కే బంకెట్ సమీపంలో పూర్తిగా ఎండిపోయిన ఒక చెట్టు అత్యంత ప్రమాదకరంగా నిలిచింది. ఈ రహదారి గుండా నిత్యం భారీగా రాకపోకలు సాగుతుండటంతో, బలమైన గాలులు వీచే సమయంలో ఈ చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు, బాటసారులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా ఆ ఎండిన చెట్టును తొలగించాలని స్థానికులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_S M S R R
    S M S R R
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జల సంరక్షణే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి వర్షపు చుక్కను భూగర్భంలోకి పంపడం ద్వారా నీటి నిల్వలను పెంచాలని నిర్ణయించారు. నీటి సంరక్షణే అభివృద్ధికి పునాది అని స్పష్టం చేస్తూ, నదుల అనుసంధానంపై కూడా కీలక సందేశాన్ని అందించారు.
    1
    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జల సంరక్షణే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి వర్షపు చుక్కను భూగర్భంలోకి పంపడం ద్వారా నీటి నిల్వలను పెంచాలని నిర్ణయించారు. నీటి సంరక్షణే అభివృద్ధికి పునాది అని స్పష్టం చేస్తూ, నదుల అనుసంధానంపై కూడా కీలక సందేశాన్ని అందించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.