గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఆర్ అండ్ ఆర్ వర్తింప చేయాలి లేదంటే నిరోసితుల ఐక్యం చేసి పోరాడుతాం, ఐద్వా మండల కార్యదర్శి సోడి.రమ పోలవరం నిర్వాసితులను అన్యాయం చేయటం ఇప్పటికైనా ఆపాలని కటాఫ్ తేదీ తో సంబంధం లేకుండా గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి నిర్వాసితుడికి ఆర్ అండ్ ఆర్ వర్తింపజేసి పురావాసం కల్పించాలని ఐద్వా (అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం) విఆర్ పురం మండల కార్యదర్శి సోడి రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం అధ్యక్షురాలు కారం లక్ష్మి అధ్యక్షతన జరిగిన మహిళా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిర్వాసితులను పూర్తిగా అన్యాయం చేసే విధంగా ప్రభుత్వ కటాఫ్ తేదీలు ఉన్నాయని, నష్టపరిహారం ఇచ్చి పునరావాసం కల్పించి గ్రామాలు ఎప్పటికీ ఖాళీ చేస్తారో తెలియదు కానీ,హడావిడిగా కట్ ఆఫ్ తేదీలు ప్రకటించి సర్వేలు జరిపి అక్కడక్కడ కొంతమందికి ఆర్ అండర్ ప్యాకేజీ ఇవ్వడం అనేది సరైనది కాదని అన్నారు.ఒకే మండలంలో ఒకచోట కట్ ఆఫ్ తేదీ ప్రకటించి 10 సంవత్సరాలు అవుతుందని, మరోచోట నాలుగు సంవత్సరాలు అవుతున్నదని కానీ ఇప్పటికీ ఆయా గ్రామాల్లో పూర్తిస్థాయిలో నష్టపరిహారం భూమికి భూమి ఇచ్చిన దాఖలాలు లేవని పునరావాసం కల్పించిన పరిస్థితి లేదని తెలిపారు.ఇప్పటికే ఆయా గ్రామాల్లో వివాహాలు చేసుకుని పిల్లలతో కూడిన 18 సంవత్సరాలు నిండిన కుటుంబాలు అనేకం ఉన్నాయని వారందరికీ గ్రామాలు కాలేజేసేనాటికి ఆర్ అండ్ ఆర్ వర్తింపజేసి పునరావాసం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. లేదంటే వేలాది కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కి వెళ్తాయని రోడ్డున పడటం తప్ప ఆ కుటుంబాలకు మరో దారి లేదని ఆమె ఆవేదన చెందారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు త్యాగం చేసిన త్యాగదనులను రోడ్డున పడేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా గ్రామాలు ఖాళీ చేసేనాటికి ఒక కటాఫ్ తేదీ ప్రకటించి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరికీ ఆర్ అండ్ ఆర్ వర్తింపజేసి పునరావాసం కల్పించాలని ఆలోచన చేయకపోతే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో నిర్వాసితులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా సంఘం నాయకులు సున్నం పార్వతి పులి భద్రమ్మ చిక్కాల వీరమ్మ తోడం భూబమ్మ,మడకం దారమ్మ,రమాదేవి భద్రమ్మ రాధ, గొర్రె రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

- భద్రాచలానికి మూడో వంతెన పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వే లైన్‌కు కృతజ్ఞతగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కలను సాకారం చేసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి 173.61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌ను మంజూరు చేయడాన్ని* స్వాగతిస్తూ భద్రాచలంలో బీజేపీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.* ముఖ్య అతిథిగా పాల్గొన్న *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి* మాట్లాడుతూ.. భద్రాచలం ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రైల్వే కనెక్టివిటీ కోసం గతంలో *పాండురంగాపురం–సారపాక వరకు సుమారు 8 కి.మీ. రైల్వే లైన్‌ను* కోరుకున్నామని, అయితే మోదీ ప్రభుత్వం *పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా మల్కాన్‌గిరి వరకు 2864 కోట్లతో 2031లోగా పూర్తి చేసేలా 173.61 కి.మీ. రైల్వే లైన్‌ను మంజూరు చేయడం* గొప్ప విషయమన్నారు. ఈ ప్రాజెక్టులో *భద్రాచలం వద్ద గోదావరిపై మూడో రైల్వే వంతెన నిర్మాణం* జరగడం ద్వారా భద్రాచలం నేరుగా రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుందని తెలిపారు. ఇది *దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం* ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచడంతో పాటు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల *విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అభివృద్ధికి* ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి *భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే శాఖకు భూమిని అప్పగించాలని* బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో *బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కందుల రాంకిషోర్, పసుమర్తి సతీష్, అట్లూరి రఘురామ్, ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల శ్రీనివాస్, కండ్రపు త్రినాథ్ రెడ్డి, నూప రమేష్, రామెళ్ళ రాజశేఖర్, పెద్ది జగపతి బాబు, నిడదవోలు నాగబాబు, తాటిపాముల ఐలయ్య, ముత్యాల చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ములిశెట్టి నిఖిల్, షేర్ శ్రీను, జీవా, మాలోత్ సాయి, కారం చిన్నయ్య, కోర్స గంగరాజు, సోలం చంటిబాబు* తదితరులు పాల్గొన్నారు.1
- భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్‌నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్‌కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు1
- సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు1
- ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని ఇంజనీర్స్ డే. వేడుకలలో జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.1
- ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ *మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ** మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు. మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్‌ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. 1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.1
- ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్‌లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.1
- హైదరాబాద్‌లో దారునా హత్యా సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గోదావ *లైవ్ మర్డర్ వీడియో..!* హైదరాబాద్‌లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి హత్యతో నగరంలో భయాందోళనలు ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య నాగోల్ బండ్లగూడలో పాత కక్షల నేపథ్యంలోనే మహమ్మద్ నహీమ్‌ను దారుణంగా హత్య చేసిన మహేష్ హైదరాబాద్ - నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న మహమ్మద్ నహీమ్ సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షన ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు1