యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ " నేచర్ సేవ్ సొసైటీ" ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలను నిర్వహించామని సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు లుకలాపు రంజిత్ కుమార్, కోరుకొండ శాంతారావు, ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ , హైదరాబాద్ శాఖ ప్రతినిధి లోకేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసన్నపేట జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి సోమవారం పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించామన్నారు. స్వామి వివేకానంద ఆశయ సాధనకు నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరారు. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు తంగి కృష్ణ,యెన్ని శ్రీధర్, ముద్దాడ మోహన్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

- ఈనెల 18న ఖమ్మం లో జరిగే సి.పి.ఐ శతవసంతాల ఉత్సావాన్ని జయప్రదం చేయండి. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు పాలకొండలోని పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో మన్మధ రావు మాట్లాడుతూ 1935 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని ఆనాటి నుండి నేటి వరకు కష్టజీవుల పక్షాన నిలబడి ప్రాణార్పణలు చేస్తూ నిర్బంధాలను ఎదుర్కొంటూ లక్షలాది ఎకరాలు భూ పంపిణీతో పాటు అనేక ఉద్యమాలు చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేయడం ఒక కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమైందని ఆయన తెలిపారు. పార్టీ పాలకొండ నియోజకవర్గం బాధ్యులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ అకుంఠ దీక్షతో సకల జనుల సమస్యలపై ముందుండి ఉద్యమము నడిపిన ఘనత ఒక్క సిపిఐ కి మాత్రమే దక్కుతుందని ఆనాటి త్యాగధనులు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీన ఖమ్మం పట్నంలో లక్షలాది మందితో జరగబోతున్న కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి పార్టీ సభ్యులు శ్రేయోభిలాషులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పాలకొండ పట్టణ లో ప్రముఖ న్యాయవాది పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే పౌర హక్కులకు భంగం కలుగు తుందని,ప్రభుత్వ రంగ సంస్థ లను,ఆస్తులను కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెడు తున్నారని యువతరానికి ఉపాధి లేక భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న 100 సంవత్సరాల వసంతోత్సవంలో ప్రజలు పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కూరంగి గోపినాయుడు,మండంగి సింగన్న, తోయిక పొత్తు తదితరులు పాల్గొన్నారు.1
- ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది' ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు:తహసీల్దార్1
- *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1