Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం బస్వాపూర్ శివారులో చిరుత పులి సంచారం స్థానికులలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. శుక్రవారం రాత్రి చిరుత ఓ గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను ఎత్తుకెళ్లిందని కాపరులు భయంతో వణికిపోతున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్వాపూర్‌లోని సంఘటన స్థలంలో చిరుత పాదముద్రల కొలతలను సేకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులు ప్రజలను, ముఖ్యంగా కాపరులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Dantulwar Sopan D
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం బస్వాపూర్ శివారులో చిరుత పులి సంచారం స్థానికులలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. శుక్రవారం రాత్రి చిరుత ఓ గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను ఎత్తుకెళ్లిందని కాపరులు భయంతో వణికిపోతున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్వాపూర్‌లోని సంఘటన స్థలంలో చిరుత పాదముద్రల కొలతలను సేకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులు ప్రజలను, ముఖ్యంగా కాపరులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం బస్వాపూర్ శివారులో చిరుత పులి సంచారం స్థానికులలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. శుక్రవారం రాత్రి చిరుత ఓ గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను ఎత్తుకెళ్లిందని కాపరులు భయంతో వణికిపోతున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్వాపూర్‌లోని సంఘటన స్థలంలో చిరుత పాదముద్రల కొలతలను సేకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులు ప్రజలను, ముఖ్యంగా కాపరులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.1
- కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలం షేట్లూర్ గ్రామం సమీపంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో వర్షం కురుస్తుండటంతో రైతులు ఆనందంతో నాట్లు వేయడం, బేడ పనులు ప్రారంభించారు. గత చాలా రోజులుగా ఎలాంటి పని లేకుండా ఇబ్బందులు పడిన రైతులు, స్త్రీలు సైతం ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి వర్షానికి ఎంతో సంతోషంగా పొలంలో పనులకు వెళ్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు ఇప్పటికీ వర్షం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రైతులు పొలంలో పనులు ప్రారంభించి ఆనందంగా గడుపుతున్నారు.1
- బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బెల్లాల్‌కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో నిండిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు శనివారం వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. రహదారిపై ఏర్పడిన గుంతల్లో వరి నాట్లు వేసి, పాటలు పాడుతూ నాయకులు, కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్, వార్డు కౌన్సిలర్ కొల్లిపాక రేణుక బాలరాజు మాట్లాడుతూ, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ రహదారి మరమ్మతులకు గతంలో నిధులు మంజూరైనప్పటికీ, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదని వారు ఆరోపించారు. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు, ముఖ్యంగా విద్యార్థులు నిత్యం ప్రమాదాల ముప్పును ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. నిల్వ నీటి వల్ల దోమలు, క్రిమికీటకాలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, సమీపంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి కూడా ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బోధన్ మున్సిపల్ పరిధిలోని 38 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో హన్మండ్లు చారి, పవన్ కుమార్, గుంత గంగాధర్, వినోద్, అరవింద్, వేణు, గౌతమ్ గౌడ్, దుర్గాప్రసాద్, ఫణి వంటి పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ జూన్ 28న పోలియో చుక్కలు వేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం జిల్లావ్యాప్తంగా 1,007 బూత్‌లు ఏర్పాటు చేసినట్లు, అవసరమైన సిబ్బందితో పాటు పోలియో డోసులు సైతం సిద్ధం చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ వెల్లడించారు. పోలియో రహిత సమాజమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.1
- నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అధికారులు, వరుస కథనాలకు స్పందిస్తూ, బాసర అమ్మవారి ఉపాలయమైన మహాకాళి అమ్మవారి ఆలయంలో మంగళవారం జరిగిన చోరీ ఘటనతో అప్రమత్తమయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో, మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న ఐదుగురు హోంగార్డులను తొలగించారు. ఆలయ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హోంగార్డులను తొలగించి, బాసర యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ బాసర వీడీసీ కమిటీ సభ్యులు కార్యనిర్వహణాధికారి (ఈవో) అంజనీ దేవికి వినతి పత్రం సమర్పించారు. దీంతో బాసర అమ్మవారి ఆలయంలో భద్రతను పెంపొందించారు. ఇందులో భాగంగా, ఆలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్‌ను పునర్నిర్మించి, సీసీ కెమెరాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఇదే విషయంపై, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి ఆలయాన్ని సందర్శించి, చోరీ ఘటన వివరాలను ఈవో అంజనీ దేవిని అడిగి తెలుసుకున్నారు. దొంగలను వెంటనే పట్టుకోవాలని చారి అధికారులను ఆదేశించారు.3
- కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని ఇటుక బట్టీ వద్ద ఉన్న పిల్లలకు తక్షణమే ఆధార్ కార్డులు చేయించి, సమీపంలోని ఉప్పల్వాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని విద్యార్థి సంఘం నాయకులు జీవీఎం విట్టల్, అర్బాస్ ఖాన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇటుక బట్టీ వద్ద సరైన సదుపాయాలు లేక పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో బెంచీలు, తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు, పిల్లలకు పుస్తకాలు, యూనిఫాంలు కూడా అందలేదని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఇటుక బట్టీ యజమాని గోవిందయ్యపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు స్పందించి పిల్లలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.1
- మెదక్ జిల్లాలో జూలై 1వ తేదీ నుంచి ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను తప్పనిసరిగా నాలుగు రకాలుగా వేరు చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. వేరు చేయని చెత్తను స్వీకరించకుండా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘన వ్యర్థాల నిర్వహణ (Solid Waste Management-2026) అమలుపై జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలో, పొడి చెత్తను నీలం డబ్బాలో, సానిటరీ చెత్తను ఎరుపు డబ్బాలో, హానికరమైన చెత్తను నలుపు డబ్బాలో వేరు చేసి అందించాలని సూచించారు. అలాగే, హోటళ్లు, హాస్టళ్లు, పరిశ్రమలు, రెస్టారెంట్లు, ధాబాలు, ఆసుపత్రులు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తమ వ్యర్థాలను సొంతంగా నిర్వహించుకోవాలని, ఈ విషయంపై వారికి ముందస్తుగా అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నాలుగు రకాల చెత్త కోసం ప్రత్యేక డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్-2026 నియమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నాగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, ఎంపీడీవోలు, ఏపీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- ఇందల్వాయి మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో దేగాం నరసయ్య (కే6 న్యూస్) అధ్యక్షుడిగా, కుప్పిరియాల శ్రీధర్ (ఆంధ్రజ్యోతి) ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నరసయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, వారికి ఇంటి స్థలాలు మరియు హెల్త్ కార్డులు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.1