logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

NGKL: పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి - జిల్లా కన్వీనర్ మదన్ మోహన్ నాగర్ కర్నూల్ జిల్లాలో ఈనెల 13న నిర్వహించనున్న పాలిసెట్-2026 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పాలిసెట్ కన్వీనర్ మదన్ మోహన్ తెలిపారు. సోమవారం నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అబ్సర్వర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొత్తం 2,911 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పాలిటెక్నిక్ కోర్సులపై విద్యార్థుల్లో ఆదరణ పెరిగిందని పేర్కొన్నారు.విద్యార్థుల సౌకర్యార్థం జిల్లాలో మొత్తం 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో 8 కేంద్రాలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయగా, బిజినపల్లి మండలం పాలెంలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలను జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా సులభంగా గుర్తించి చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తాగునీటి వసతి, వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు హాల్ టికెట్, హెచ్‌బీ పెన్సిల్, ఎరేజర్ తప్పనిసరిగా తీసుకురావాలని, పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అబ్సర్వర్‌లు పాల్గొన్నారు.

1 hr ago
user_MALLIKARJUN T
MALLIKARJUN T
Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
1 hr ago
3fe389aa-0ba0-44ce-a8a6-82791d68597f

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్‌ను చూడవచ్చు.
    1
    తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్‌ను చూడవచ్చు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    10 hrs ago
  • వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం: సీఎం రేవంత్ రెడ్డి రాబోయే అకాడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోరుడును రద్దుచేసి పాఠశాల విద్యలో కలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో తెలిపారు.
    1
    వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం: సీఎం రేవంత్ రెడ్డి
రాబోయే అకాడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోరుడును రద్దుచేసి పాఠశాల విద్యలో కలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో తెలిపారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    45 min ago
  • ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : వికారాబాద్ ఆర్డిఓ వాసు చంద్ర. వికారాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని వికారాబాద్ ఆర్టీవో వాసు చంద్ర ఒక ప్రకటనలో సోమవారం కోరారు. గతంలో ప్రజావాణి కేవలం కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే నిర్వహించే వారిని కానీ ఇకనుండి ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు మరింత చేరువగా వస్తుందని ఇక నుండి ప్రజావాణి కార్యక్రమం డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వికారాబాద్ కార్యాలయం తో పాటుగా తాండూర్ వికారాబాద్ ఆర్డీవో ఆఫీస్ లో పరిధిలో కూడా నిర్వహించినట్లు తెలిపారు.
    1
    ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : వికారాబాద్ ఆర్డిఓ వాసు చంద్ర.
వికారాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని వికారాబాద్ ఆర్టీవో వాసు చంద్ర ఒక ప్రకటనలో సోమవారం కోరారు. గతంలో ప్రజావాణి కేవలం కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే నిర్వహించే వారిని కానీ ఇకనుండి ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు మరింత చేరువగా వస్తుందని ఇక నుండి ప్రజావాణి కార్యక్రమం డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వికారాబాద్ కార్యాలయం తో పాటుగా తాండూర్ వికారాబాద్ ఆర్డీవో ఆఫీస్ లో పరిధిలో కూడా నిర్వహించినట్లు తెలిపారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    2 hrs ago
  • కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
    1
    కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • నల్గొండ: కొత్తపల్లిలో ప్రమాదకరంగా బోరు నీటి పైప్ లైన్ గుంత నల్గొండ: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 4వ వార్డులో బోరు నీటి పైప్ లైన్ మరమ్మత్తుల కోసం ప్రధాన రహదారి పక్కన తీసిన గుంత ప్రమాదకరంగా మారింది. వారం రోజుల క్రితం తీసిన ఈ గుంతను మరమ్మత్తులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో చిన్నారులు అందులో పడే ప్రమాదం ఉంది. స్థానికులు వాహనదారులు, పాదచారులు, రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పైప్ లైన్ కు మరమ్మత్తులు పూర్తిచేసి, గుంతను పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: కొత్తపల్లిలో ప్రమాదకరంగా బోరు నీటి పైప్ లైన్ గుంత
నల్గొండ: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 4వ వార్డులో బోరు నీటి పైప్ లైన్ మరమ్మత్తుల కోసం ప్రధాన రహదారి పక్కన తీసిన గుంత ప్రమాదకరంగా మారింది. వారం రోజుల క్రితం తీసిన ఈ గుంతను మరమ్మత్తులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో చిన్నారులు అందులో పడే ప్రమాదం ఉంది. స్థానికులు వాహనదారులు, పాదచారులు, రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పైప్ లైన్ కు మరమ్మత్తులు పూర్తిచేసి, గుంతను పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    26 min ago
  • రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం
    1
    రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం 

రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    59 min ago
  • రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.
    1
    రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.