logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదికలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు కేటాయించాలి: ఎమ్మెస్ ఎఫ్ -లోక్ సభ సీట్లలో మాదిగలకు ఒక్క స్థానం ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలోనైన ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఒకటి కచ్చితంగా మాదిగలకు కేటాయించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము శేఖర్ మాదిగ, మరియు జాతీయ కార్యదర్శి డాక్టర్ పల్లెర్ల సుధాకర్ మాదిగ మాట్లాడుతూ.. ఈ ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింగ్వి మరియు సురేష్ కుమార్ రెడ్డిల పదవి కాలం ముగియడంతో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీలు ఏర్పడుతున్నాయని వాటి భర్తీకి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల అయిందని ఈనెల 16న ఆ రెండిటికీ ఎన్నిక జరగనుందని అందులో ఒకటి తెలంగాణలో అత్యధిక జన సంఖ్య గల మాదిగలకు కచ్చితంగా కేటాయించాలని అన్నారు. తెలంగాణలో మూడు లోక్ సభ స్థానాలు ఎస్సీ రిజర్వుడు ఉంటే అందులో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఈ రాజ్యసభ స్థానాలలోనైనా ఒకటికి మాదిగలకు కేటాయించి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల మాదిగలను మోసం చేసిన పార్టీలకు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాలలో మాట్లాడుతూ మాదిగ జాతి నా ఎదుగుదలకు ఎంతో సహకరించారని వారి పట్ల నేను చిత్తశుద్ధితో ఉంటానని ప్రగల్బాలు పలుకుతూ లోక్ సభ స్థానాలలో మాత్రం ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతికి కేటాయించకుండా పార్లమెంటులో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి లోక్ సభలో ముగ్గురు తన రెడ్డి కులస్తులు ఉన్నా కూడా ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో ఒకటి రెడ్డిలకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడని ఆ స్వార్థపర ఆలోచన మానుకొని తను అన్యాయం చేసిన మాదిగ జాతికి రాజ్యసభలో సీటు కేటాయించి తన తప్పును సరిదిద్దుకోవాలని హితబు పలికారు. మునుపెన్నడు మాదిగ జాతికి పార్లమెంటులో అవకాశం లేని సందర్భం లేదని గత ప్రభుత్వాల హయాంలో ప్రతి సందర్భంలో పార్లమెంటులో మాదిగ ప్రాతినిధ్యం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి హయాంలోనే మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. కనీసం ఈ రాజ్యసభలోనైనా సీటు ఇవ్వకుంటే రేపు ఏ మొహం పెట్టుకొని మాదిగల వద్దకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వస్తుందో చూస్తామని మాదిగల ఆవేదనకు, ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో 40 సీట్లకు పైగా ఉన్న శాసనమండలిలో కూడా లేదని మాదిగలకు ఒక్క సీటు కూడా లేదని ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేస్తే అందులో ఒకటి కూడా మాదిగలకు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఈ రాజ్యసభ సీట్లలో ఒకటి కేటాయించి నమో మాదిగలకు చేసిన మోహన్ సార్ తిప్పుకోవాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో MSF జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ, రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివకుమార్ మాదిగ, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఈదుల రాజీవ్ ప్రదీప్ మాదిగ, ఓయూ నాయకులు అందుగుల హరిప్రసాద్ మాదిగ, కనికపూడి మహేంద్ర మాదిగ, సగ్గుర్తి పుల్లయ్య మాదిగ, గాదేపక సాయి చరణ్ మాదిగ, ఎలకొండ శ్రీనాథ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

23 hrs ago
user_Sagaboina Paparao
Sagaboina Paparao
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•

More news from తెలంగాణ and nearby areas
  • మేడ్చల్ జిల్లా జీడిమెట్ల గాజులరామారం పరిధిలోని రామన్ చెరువులో పడి ఆత్మహత్యకు యత్నించిన 62 ఏళ్ల వృద్ధురాలు యాదమ్మను HYDRAA 49 టీమ్ సిబ్బంది సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఎస్‌ఓ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి చెరువులోకి దిగి యాదమ్మను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ రక్షణ చర్యల్లో మేనేజర్ అశోక్, సిబ్బంది సంతోష్, శ్రీనయ్య, వంశీ కీలక పాత్ర పోషించారు. ప్రమాదకర పరిస్థితుల్లో సైతం చాకచక్యంగా వ్యవహరించిన హైడ్రా సిబ్బందిని స్థానికులు అభినందించారు.
    1
    మేడ్చల్ జిల్లా జీడిమెట్ల గాజులరామారం పరిధిలోని రామన్ చెరువులో పడి ఆత్మహత్యకు యత్నించిన 62 ఏళ్ల వృద్ధురాలు యాదమ్మను HYDRAA 49 టీమ్ సిబ్బంది సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఎస్‌ఓ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి చెరువులోకి దిగి యాదమ్మను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ రక్షణ చర్యల్లో మేనేజర్ అశోక్, సిబ్బంది సంతోష్, శ్రీనయ్య, వంశీ కీలక పాత్ర పోషించారు. ప్రమాదకర పరిస్థితుల్లో సైతం చాకచక్యంగా వ్యవహరించిన హైడ్రా సిబ్బందిని స్థానికులు అభినందించారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    34 min ago
  • కీసర, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని రాంపల్లి దాయరలో వెలసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో మంగళవారం గిరి ప్రదక్షిణ, పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున జరిగే ఈ కార్యక్రమం హోలీ పర్వదినం, లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేషంగా జరిగింది.ఉదయం ఐదు గంటలకు వేదోత్తములు ఆదిత్య శర్మ, శ్రీనివాస్ శర్మల మార్గదర్శకత్వంలో స్వామి వారి విశేష పూజలు నిర్వహించి అనంతరం పల్లకి సేవతో గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు భజనలు, భక్తి గీతాలతో గోవింద నామస్మరణ చేస్తూ వెంకులోనిగుట్ట గిరులను మార్మోగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శ్రీ సాయి ధామం దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రామానంద ప్రభూజీ స్వామి పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేష లక్ష్మీ పూజను ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి గవ్వలతో అభిషేకం చేసి, అనంతరం స్వామీజీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా భక్తులకు లక్ష్మీ గవ్వలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో లక్ష్మీ గవ్వలు ఉండడం అష్టైశ్వర్య సిద్ధికి కారణమని వేద పండితులు తెలిపారు.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిర్వాహకులను ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో కెఎల్‌ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, మన్నె ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు, అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ట్రస్టు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    3
    కీసర, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని రాంపల్లి దాయరలో వెలసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో మంగళవారం గిరి ప్రదక్షిణ, పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున జరిగే ఈ కార్యక్రమం హోలీ పర్వదినం, లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేషంగా జరిగింది.ఉదయం ఐదు గంటలకు వేదోత్తములు ఆదిత్య శర్మ, శ్రీనివాస్ శర్మల మార్గదర్శకత్వంలో స్వామి వారి విశేష పూజలు నిర్వహించి అనంతరం పల్లకి సేవతో గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు భజనలు, భక్తి గీతాలతో గోవింద నామస్మరణ చేస్తూ వెంకులోనిగుట్ట గిరులను మార్మోగించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శ్రీ సాయి ధామం దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రామానంద ప్రభూజీ స్వామి పాల్గొన్నారు.
గిరి ప్రదక్షిణ అనంతరం లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేష లక్ష్మీ పూజను ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి గవ్వలతో అభిషేకం చేసి, అనంతరం స్వామీజీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా భక్తులకు లక్ష్మీ గవ్వలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో లక్ష్మీ గవ్వలు ఉండడం అష్టైశ్వర్య సిద్ధికి కారణమని వేద పండితులు తెలిపారు.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిర్వాహకులను ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో కెఎల్‌ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, మన్నె ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు, అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ట్రస్టు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    46 min ago
  • हैदराबाद में ममता नामक महिला ने अपने 2-महीने के बच्चे की हत्या कर दी है. पुलिस के अनुसार, सुबह बच्चे का पिता घर लौटा तो उसने देखा कि ममता बच्चे को जलते चूल्हे में जला रही थी. बच्चे के मुंह में कपड़ा और आंखों पर पट्टी थी. रिपोर्ट्स के मुताबिक बच्चे के लगातार रोने से परेशान होकर उसने यह कदम उठाया.
    1
    हैदराबाद में ममता नामक महिला ने अपने 2-महीने के बच्चे की हत्या कर दी है. पुलिस के अनुसार, सुबह बच्चे का पिता घर लौटा तो उसने देखा कि ममता बच्चे को जलते चूल्हे में जला रही थी. बच्चे के मुंह में कपड़ा और आंखों पर पट्टी थी. रिपोर्ट्स के मुताबिक बच्चे के लगातार रोने से परेशान होकर उसने यह कदम उठाया.
    user_Gulam gaus
    Gulam gaus
    Golconda, Bhopal•
    7 hrs ago
  • గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.
    4
    గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు.
ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • BLR చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన హరీష్ రావు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన బండారి లక్ష్మారెడ్డి
    1
    BLR చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన హరీష్ రావు
ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన బండారి లక్ష్మారెడ్డి
    user_B Narsimhulu
    B Narsimhulu
    Financial Analyst గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని శంభులోంగేశ్వర కాలనీ లో రేపు హోళీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి కామ దహనానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చురుకుగా పాల్గొన్నారు. కనుమరుగైపోతున్న సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరూ అందించాలని వారు తెలిపారు
    3
    సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని శంభులోంగేశ్వర కాలనీ లో రేపు హోళీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి కామ దహనానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చురుకుగా పాల్గొన్నారు. కనుమరుగైపోతున్న సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరూ అందించాలని వారు తెలిపారు
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Public Health Department రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి: సంగారెడ్డి సైన్స్ కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్య శాఖ అధికారులు
    1
    విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి: సంగారెడ్డి సైన్స్ కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్య శాఖ అధికారులు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగ సంబరాలలో వేలాదిమంది విద్యార్థులతోని దద్దరిల్లిన ఓయూ. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని డిజె సౌండ్ ల నడుమ నృత్యం చేస్తూ ఓయూ ప్రాంగణమంతా కలర్లతో నిండిపోయింది.
    1
    అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగ సంబరాలలో వేలాదిమంది విద్యార్థులతోని దద్దరిల్లిన ఓయూ. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని డిజె సౌండ్ ల నడుమ నృత్యం చేస్తూ ఓయూ ప్రాంగణమంతా కలర్లతో నిండిపోయింది.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    41 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.