ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఉపాధి హామీ చిత్ర విచిత్రాలు ఎన్నో.. మరెన్నో..? *ఉపాధి హామీలో కొండను తవ్వి ఎలుకను పట్టారా..? *గ్రీన్ బెల్టుల ఎగవేత వ్యవహారంలో నాడు వివాదాస్పదంగా వ్యవహరించిన మండల పంచాయతీ అధికారి..? *విలేకరులపై కక్ష ఏంటి.. చట్టబద్ధంగా ప్రశ్నిస్తే..? వీరంగం వేస్తారా..? *ప్రభుత్వ సేవకులా..? ప్రైవేటు వ్యక్తులా.. నిండు సభలో దౌర్జన్యమేంది అధ్యక్షా..? *ఆ మండలంలో విలేకరులకు జాబు కార్డులు లేవా.? వా రాలకు వారాలు పనిచేసిన మాట వాస్తవం కాదా...? ఓపెన్ పోరంలో కూడా వింత పోకడలు తగునా..? *ఆ మండల స్థాయి అధికారులపై కొనసాగనున్న ఫిర్యాదుల పరంపర ఆధారాల సేకరణతో పలు సంస్థలకు ఫిర్యాదుకు రంగం సిద్ధం..? *మండల ఓపెన్ ఫోరం ద్వారా ఏ సంకేతాలు ఇచ్చారో..? మండిపడుతున్న ప్రజా సంఘాలు జర్నలిస్టులు..? *ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రశ్నిస్తూ వార్తా కథనాలు రాయడమే పాపమా.. లేక నేరమా..? *అంతా సక్రమం అయితే..? చిట్ట చివరిగా 86 వేల రికవరీకి ఆదేశాలు ఎందుకో..? కొమ్ము కాస్తున్న ఎల్లో గాళ్లు..? అక్రమాలు ప్రశ్నించే.. సాహసం లేకనా... గుట్టలుగా అక్రమాలు బయటికి వస్తాయని.. బెంబేలెత్తుతున్న మరి కొందరు..?
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఉపాధి హామీ చిత్ర విచిత్రాలు ఎన్నో.. మరెన్నో..? *ఉపాధి హామీలో కొండను తవ్వి ఎలుకను పట్టారా..? *గ్రీన్ బెల్టుల ఎగవేత వ్యవహారంలో నాడు వివాదాస్పదంగా వ్యవహరించిన మండల పంచాయతీ అధికారి..? *విలేకరులపై కక్ష ఏంటి.. చట్టబద్ధంగా ప్రశ్నిస్తే..? వీరంగం వేస్తారా..? *ప్రభుత్వ సేవకులా..? ప్రైవేటు వ్యక్తులా.. నిండు సభలో దౌర్జన్యమేంది అధ్యక్షా..? *ఆ మండలంలో విలేకరులకు జాబు కార్డులు లేవా.? వా రాలకు వారాలు పనిచేసిన మాట వాస్తవం కాదా...? ఓపెన్ పోరంలో కూడా వింత పోకడలు తగునా..? *ఆ మండల
స్థాయి అధికారులపై కొనసాగనున్న ఫిర్యాదుల పరంపర ఆధారాల సేకరణతో పలు సంస్థలకు ఫిర్యాదుకు రంగం సిద్ధం..? *మండల ఓపెన్ ఫోరం ద్వారా ఏ సంకేతాలు ఇచ్చారో..? మండిపడుతున్న ప్రజా సంఘాలు జర్నలిస్టులు..? *ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రశ్నిస్తూ వార్తా కథనాలు రాయడమే పాపమా.. లేక నేరమా..? *అంతా సక్రమం అయితే..? చిట్ట చివరిగా 86 వేల రికవరీకి ఆదేశాలు ఎందుకో..? కొమ్ము కాస్తున్న ఎల్లో గాళ్లు..? అక్రమాలు ప్రశ్నించే.. సాహసం లేకనా... గుట్టలుగా అక్రమాలు బయటికి వస్తాయని.. బెంబేలెత్తుతున్న మరి కొందరు..?
- ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* *ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* *ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* *ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*1
- కొత్తపల్లిలో డ్రైనేజీలో నీటి లీకేజ్ నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ ఈసం ముత్తిలింగం నూతన గృహ నిర్మాణం పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజీతో నీరు డ్రైనేజీలోకి పారుతోంది. తాగునీరు డ్రైనేజీలో పారుతుండడంతో నీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి కృష్ణా జలాల వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.1
- *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....1
- అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మజ్జివలస పరిసర ప్రాంతాల్లో హైడ్రోపోవర్ ప్రాజెక్టు నిర్మాణంపై వ్యతిరేకిస్తున్న గిరిజన గ్రామాలు ఈ కార్యక్రమంలో సిపిఐ జెడ్పిటిసి గారు దిసారి గంగరాజు అలాగే ప్రజా సంఘాలు మద్దతు పలుకుతూ వెంటనే ప్రాజెక్ట్ ఆపేయాలని లేనిపక్షంగా తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం ప్రజా సంఘ ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు1
- సమాజ సేవలో తమ వంతుగా సేవలందించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి సేవా సమితి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. 10 సంవత్సరాలలో అంచలంచెలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా సమయంలో పేద ప్రజలకు ఆహార ధాన్యాలు అందించామన్నారు. నాచారం వాసవి సేవాసమితి 10 వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పదిమందితో మొదలైన నేడు వంద మంది చేరుకోవడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా ప్రతి అమావాస్యకు వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. త్వరలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా వాసవి సేవా సమితి నిర్వాహకుడు శ్రీరామ్ సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 బి ఆర్ ఎస్ వారికి అధికారం పోయిన తర్వాత తెలిసిందా గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పనులకు కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ పంపిస్తుంది అని1
- గోవిందా హరి గోవిందా..! పాలకొల్లులో.. వేకువ ఉదయాన... గోవింద స్వాముల ప్రయాణం #palakollu #tirumala #Tirupati #bhakti #devotional @highlight1
- యాంకర్ : చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని... వారికి తన నుండి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.1