తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కు కేంద్ర ప్రభుత్వం మైనింగ్ లీజ్ మంజూరు చేయడం పట్ల సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో భాగంగా, ఇల్లందు ఏరియాలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కోయగూడెం ఓసీపీ, జేకే–5 ఓసీపీ, ఏరియా వర్క్‌షాప్, ఏరియా హాస్పిటల్, సెక్యూరిటీ విభాగం తదితర శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వి. కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) శ్రీ కె. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కల ప్రత్యేక కృషి ఫలితంగానే తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజ్ మంజూరైందని ఆయన స్పష్టం చేశారు. ఈ మైనింగ్ లీజ్ ద్వారా సుమారు 300 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయవచ్చని, సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు. దాదాపు 45 సంవత్సరాల గని జీవితం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధికి, తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కీలక మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పరస్పరం మిఠాయిలు తినిపించుకొని హర్షం వ్యక్తం చేశారు.
తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కు కేంద్ర ప్రభుత్వం మైనింగ్ లీజ్ మంజూరు చేయడం పట్ల సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో భాగంగా, ఇల్లందు ఏరియాలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కోయగూడెం ఓసీపీ, జేకే–5 ఓసీపీ, ఏరియా వర్క్‌షాప్, ఏరియా హాస్పిటల్, సెక్యూరిటీ విభాగం తదితర శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వి. కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) శ్రీ కె. వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్
రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కల ప్రత్యేక కృషి ఫలితంగానే తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజ్ మంజూరైందని ఆయన స్పష్టం చేశారు. ఈ మైనింగ్ లీజ్ ద్వారా సుమారు 300 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయవచ్చని, సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు. దాదాపు 45 సంవత్సరాల గని జీవితం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధికి, తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కీలక మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పరస్పరం మిఠాయిలు తినిపించుకొని హర్షం వ్యక్తం చేశారు.
- ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ)లో భూ పునఃసర్వే పనుల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, సర్వే అధికారులతో కలిసి సరిహద్దులు నిర్ధారించిన గ్రామాల పునఃసర్వే పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ పునఃసర్వే పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.1
- చిలుకూరు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలను నిర్వహించాలని ఆయన కోరారు. ఈ హామీల సాధన కోసం చేపట్టనున్న గాంధీభవన్ ముట్టడి కార్యక్రమానికి అందరూ భారీగా తరలిరావాలని గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు.1
- బీసీ అంటే ప్రపంచాన్ని నడిపించే వారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల ఆత్మగౌరవ నినాదమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.1
- సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు సంబంధించిన 28 మంది ఇన్‌స్ట్రక్టర్లకు, 28 మంది ఆయాలకు జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఈ పాఠశాలల నియామక పత్రాలను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి గారికి, మంత్రివర్యులు శ్రీ తుమ్మల గారికి, శ్రీ పొంగులేటి గారికి అందరి తరపున ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఉద్యోగాలు సాధించిన టీచర్లు, ఆయాలకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు పలు కీలక సూచనలు చేశారు. పాఠశాలల్లోని చిన్నారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆటలు, పాటలు ఆడిస్తూ వారికి చదువు చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు పాఠాలు నేర్పాలని, వారి ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఆహార విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సత్తుపల్లి నియోజకవర్గ గౌరవాన్ని కాపాడాలని దిశానిర్దేశం చేశారు.1
- అపర భగీరథుడు, రైతు బిడ్డ మరియు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అయిన తుమ్మల గారి సారథ్యంలో, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టారాగమై దయానంద్ గారి ఆశయాల సాధనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు పాత కారాయిగూడెంకు చేరాయి. గోదావరి అమ్మ పరవళ్లు తొక్కుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తుండటంతో కారాయిగూడెం రైతులు తుమ్మల గారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. తుమ్మల గారి కృషితో పాత కారాయిగూడెం గ్రామానికి చేరిన గోదావరి జలాలకు పెద్దలు వంకాయలపాటి తదితరులు హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.3
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన్ రావు (గాంధి) వైఎస్సార్సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జగన్ మోహన్ రెడ్డి కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఒక మంచి ఆలోచనతో దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఆ అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని రామ మోహన్ రావు పేర్కొన్నారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలను ప్రేరేపించి, గ్రామ స్థాయి వరకు అల్లర్లు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని, హద్దులు దాటి పరుష పదజాలంతో ఎదుటి వ్యక్తులను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ప్రతిపక్షాలు చేస్తున్న కుల, మత రాజకీయాలను ఎండగట్టాలని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.1
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు 28 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 28 మంది ఆయాలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియమితులైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, చిన్నారుల పట్ల ప్రేమ, ఓర్పుతో వ్యవహరించాలని, ఆటలు, పాటల ద్వారా బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, పిల్లల ఆరోగ్యం, భద్రత, పోషకాహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, సత్తుపల్లి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.2
- ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్న నేపథ్యంలో, రైతులు వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగానే పంటలను సాగు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ మండల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే అన్నదాతలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.1