800 ఏండ్ల మట్టి కోట శివాలయం విధ్వంసం వెనుక ఎవరి హస్తం ఉంది... బడి పేరుతో గుడిని విధ్వంసం చేసింది అందులో ఉన్న గుప్త నిధుల కోసమేనా...? మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య.... నర్సంపేట డివిజన్, మే 10, నర్సంపేట నియోజకవర్గం లో పురాతన దేవాలయాలను కూడా గుర్తించలేని స్థానిక ఎమ్మెల్యే ఉండడం సభ్య సమాజానికి సిగ్గుచేటు అని ఖానాపురం మండల మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ... బడి పేరుతో స్థానిక ఎమ్మెల్యే బినామీ కాంట్రాక్టర్ల పేరుతో టెండర్లు వేసి గుడిని విధ్వంసం చేసింది గుప్త నిధుల కోసమేనా అనేది అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వం గుడులను, బడులను కోరుకుంటుందని కానీ స్థానిక ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతో పురాతన శివాలయాన్ని రాత్రికి రాత్రే కూలగొట్టింది గుప్త నిధుల కోసం అనేది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఇంత విధ్వంసం అధికారులకు కనుసన్న లోనే జరిగిందని దీనిపై చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ ప్రభుత్వ ఉన్నతాధికారులు అలసత్వం వహించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో కెసిఆర్ హయాంలో ప్రభుత్వం సైనిక్ స్కూల్ తీసుకవచ్చినప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారు గుర్తించిన మట్టికోట శివాలయం నేడు అధికారులకు కనిపించడం లేదా అని అన్నారు. గుడిని కాపాడుకుంటూ బడిని కట్టే ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ ఏ ఉద్దేశంతో శివాలయాన్ని విధ్వంసం చేశారు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ఆలస్యం కావడానికి ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డిఓ ప్రభుత్వ అధికారులే బాధ్యులు... స్కూల్ నిర్మాణం కోసం చారిత్రక ఆలయం ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కుట్ర 100% దాగివుంది అన్నారు. కాకతీయుల చారిత్రక శిల్పకళా సంపద కాకతీయుల ఆధ్యాత్మిక ఆలయాల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం పాలకులుగా మన బాధ్యత దాన్ని మరచి విధ్వంసం సృష్టించిన కాంట్రాక్టర్ను సహకరించిన ఎమ్మెల్యేను, అధికారులను వెంటనే అరెస్టు చేయాలి. అధికారుల మౌనం వెనుక విలువైన సంపద దోపిడీకి గురైనట్లు గుప్త నిధుల వేట జరిగినట్లు ప్రజలకు పూర్తి అనుమానాలు కలుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ ఆర్ డి ఓ ఉన్నత స్థాయి అధికారులు ఆ స్థలంలో చారిత్రిక నేపథ్యం ఉన్నదని తెలిసిన కూడా పాఠశాల నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చారిత్రాత్మకైనా శివాలయం విధ్వంసంపైన ఇంతవరకు ఎందుకు విచారణ జరగలేదని బాధ్యుల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్వయంగా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుపోకపోవడం వెనుక రాజకీయ నాయకుల ఒత్తిడి ఉన్నట్టు అర్థమవుతుందని అన్నారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిగాయని ఇందులో స్థానిక ఎమ్మెల్యే, విద్యా శాఖ మంత్రి, ముఖ్య మంత్రి వాటా ఎంతో కూడా చెప్పాలని దీనిపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణు కృష్ణ, ఉపసర్పంచ్ ఉప్పు రాజు, క్లస్టర్ బాధ్యులు మౌలానా, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్, యాకూబ్ పాషా, మాజీ ఉపసర్పంచ్ మేడిద కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.1
- రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.1
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీతక్క, అద్దంకి దయాకర్ వంటి ప్రజా నాయకులపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కవితకు కష్టపడి పైకి వచ్చిన వారి విలువ తెలియదని నాగమణి ఎద్దేవా చేశారు.1
- పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు వంశీ మృతదేహం ఎక్లాస్ పూర్ వద్ద లభ్యం...హత్య చేసి శవం దొరకకుండా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు ఆందోళన పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన యువకుడు జూల వంశీ మృతదేహం మంథని మండలం ఎక్లాస్ పూర్ శివారులోని గాడుల గండి వద్ద లభించింది. హత్యచేసి ఎక్లాస్ పూర్ గాడుదుల గండి గుట్ట వద్ద లోయలో మృతదేహాన్ని పడేశాని బందువులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో మృతుని కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని పదిరోజుల నుండి పోలీసులు మృతదేహాన్ని గుర్తించకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో పోలీసుల పురోగతి లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుండి వంశీ కనబడకుండా పోవడంతో మూడు రోజులు అనంతరం కుటుంబ సభ్యుల గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘటన స్థలానికి గోదావరిఖని ఏసిపి మడత రమేష్ చేరుకుని జూల వంశీ హత్య కేసులో ఓ మహిళతోపాటు ముగ్గురిని గుర్తించామని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శవాన్ని దొరకనీయకుండా దాచి పెట్టే ప్రయత్నం చేసిన కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.1
- NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- మే 25,26న హైదారాబాద్ లో జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు మే 25,26వ తేదీలలో రెండు రోజుల పాటు హైదారాబాద్ లో జరిగనున్నాయని ఆ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ కళాకారులకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. కళాకారులకు పల్లె నర్సింహ పాటలు పాడటం, డప్పు కొట్టడం శిక్షణ ఇచ్చారు.శిక్షణ ముగింపు సందర్భంగా పల్లె నర్సింహ మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది మేధావులు,రచయితలు,కవులు,కళాకారులు కలిసి ఇప్టా స్థాపించారని,కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ అనేక రచనలు చేస్తున్నారని,పాటలు వ్రాస్తున్నారన్నారు,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడుతుంటారని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి వారని,అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు వ్రాస్తూ,పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని నర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,జానపద,యక్షగాన,బుర్ర కథ,ఒగ్గు కథ, వీధి బాగోత కళారుల బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయని ప్రభుత్వం వారిని గుర్తించాలని,అన్ని రంగాల కళాకారులను గుర్తించినవారికి గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నర్సింహ కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని,గాయకుడు నాయకుడు అవుతాడు. కానీ నాయకుడు గాయకుడు కావడం చాలా కష్టమన్నారు. ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కళాకారులగా తయారయ్యే వారికి తోడ్పాటు అందించడం కోసం సిపిఐ జిల్లా సమితి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, మాజీ జడ్పీటీసీ అందె స్వామి,ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి దుడ్డేల సమ్మయ్య,,ఉమ్మడి జిల్లా కళాకారులు లెనిన్,వరకోలు సదానందం,కోమల, సరిత,రమ, ఏ.రాజయ్య,విజయ్, తిరుపతి,లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు2
- హనుమకొండలోని కేయూ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ లారీ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది, పోలీస్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.1