logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బొబ్బిలి ఎస్టీ బాలికల, వసతి గృహం, లో దోమ తెరలు పంపిణీ...! బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న 4 ఎస్టీ సంక్షేమ వసతి గృహాలకు మరియు 8 గిరిజన గ్రామాలకు "మలేరియా వ్యాధి నివారణ"లో భాగంగా NVBDCP (National Vector Borne Disease Control Program) వారు "దోమతెరలను"ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం బొబ్బిలి పట్టణంలో ఉన్న ఎస్టీ బాలికల సంక్షేమ వసతి గృహంలో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) చేతుల మీదుగా దోమ తెరలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం, ఈ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులు (మోసూరు రాధిక, కొండతామర కృష్ణవేణి, తడంగి కుమారి ) గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం అమరావతిలో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని అథ్లెటిక్స్ విభాగంలో పతకాలు సాధించారు. ఆ విద్యార్థినులను మరియు వారి ఉపాధ్యాయులను ఎమ్మెల్యే బేబీనాయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాంబర్కి శరత్, సబ్-యూనిట్ అధికారి బి.బలరాం నాయుడు, హెచ్,ఎం శ్రీమతి బి.జ్యోతి, డాక్టర్ సాయి కుమార్, వసతి గృహం సిబ్బంది పాల్గొన్నారు.

15 hrs ago
user_బొబ్బిలి గణేష్
బొబ్బిలి గణేష్
Local News Reporter బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago
a420a968-b964-4211-a96f-9d90d1593a26

బొబ్బిలి ఎస్టీ బాలికల, వసతి గృహం, లో దోమ తెరలు పంపిణీ...! బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న 4 ఎస్టీ సంక్షేమ వసతి గృహాలకు మరియు 8 గిరిజన గ్రామాలకు "మలేరియా వ్యాధి నివారణ"లో భాగంగా NVBDCP (National Vector

89246e8f-3373-42ce-8b78-84e2adea8eea

Borne Disease Control Program) వారు "దోమతెరలను"ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం బొబ్బిలి పట్టణంలో ఉన్న ఎస్టీ బాలికల సంక్షేమ వసతి గృహంలో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) చేతుల మీదుగా దోమ తెరలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం,

245b5d9c-bd4f-4626-b149-01a400d949df

ఈ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులు (మోసూరు రాధిక, కొండతామర కృష్ణవేణి, తడంగి కుమారి ) గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం అమరావతిలో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని అథ్లెటిక్స్ విభాగంలో పతకాలు సాధించారు. ఆ విద్యార్థినులను మరియు వారి ఉపాధ్యాయులను

d43b4efa-f40f-47e8-b446-4e65c610c560

ఎమ్మెల్యే బేబీనాయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాంబర్కి శరత్, సబ్-యూనిట్ అధికారి బి.బలరాం నాయుడు, హెచ్,ఎం శ్రీమతి బి.జ్యోతి, డాక్టర్ సాయి కుమార్, వసతి గృహం సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అన్నదానం మహాదానం అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు
    1
    అన్నదానం మహాదానం
అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు 
వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు
    user_అభిమాని ఫౌండేషన్
    అభిమాని ఫౌండేషన్
    బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
    2
    రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం
సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Bevara Nagarjuna
    Bevara Nagarjuna
    సాలూరు, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • విజయవాడ గురించి వర్ణిస్తున్న అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం
    1
    విజయవాడ గురించి వర్ణిస్తున్న  అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    35 min ago
  • పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్‌క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రక్తదానం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్‌క్రాస్ సూపర్‌వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్‌క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    1
    పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు..
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్‌క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు.
ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
రక్తదానం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్‌క్రాస్ సూపర్‌వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్‌క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్ రాజాం /సంతకవిటి, షురూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
    1
    సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్
సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్  మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్
రాజాం /సంతకవిటి, షురూ
సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు  నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి  సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్  దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
    user_Eesarla Ramakrushna
    Eesarla Ramakrushna
    సంతకవిటి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం
పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో  సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
    1
    నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ
నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని  సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • శ్రీకాకుళం చిన్మయ్ మిషన్ స్వామి పరాత్మనంద్ సరస్వతీ వారిచే బాల విహార్, ఉచితంగా భగవద్గీత, రామాయణం నేర్పిస్తున్న దృశ్యాలు
    2
    శ్రీకాకుళం చిన్మయ్ మిషన్ స్వామి పరాత్మనంద్ సరస్వతీ వారిచే బాల విహార్, ఉచితంగా భగవద్గీత, రామాయణం నేర్పిస్తున్న దృశ్యాలు
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.