logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలకు చెందిన గోగు కార్తీక ప్రతిష్టాత్మక బాసర త్రిబుల్ ఐటీకి ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే కష్టపడి ఈ సీటును సాధించడం పాఠశాలకు, యావత్ మండలానికి గర్వకారణమని ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి ప్రశంసించారు. ఆయన గోగు కార్తీకను అభినందించారు. ఈ ఏడాది ఆదర్శ పాఠశాల నుండి మొత్తం ఏడుగురు విద్యార్థులు త్రిబుల్ ఐటీలో ప్రవేశాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ వెల్లడించారు. త్రిబుల్ ఐటీలో సత్తా చాటిన విద్యార్థిని కార్తీకను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు.

11 hrs ago
user_RC REDDY
RC REDDY
Nizamabad Rural, Telangana•
11 hrs ago

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలకు చెందిన గోగు కార్తీక ప్రతిష్టాత్మక బాసర త్రిబుల్ ఐటీకి ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే కష్టపడి ఈ సీటును సాధించడం పాఠశాలకు, యావత్ మండలానికి గర్వకారణమని ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి ప్రశంసించారు. ఆయన గోగు కార్తీకను అభినందించారు. ఈ ఏడాది ఆదర్శ పాఠశాల నుండి మొత్తం ఏడుగురు విద్యార్థులు త్రిబుల్ ఐటీలో ప్రవేశాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ వెల్లడించారు. త్రిబుల్ ఐటీలో సత్తా చాటిన విద్యార్థిని కార్తీకను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. 'నేనుసైతం' కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది ఉన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. 'నేనుసైతం' కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది ఉన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • శనివారం నాడు గంబీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ సందర్భంగా, ఎస్పీ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు మరియు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు వృద్ధాశ్రమ సభ్యులు ఉన్నారు. ఈ సందర్శనలో భాగంగా, ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలబడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని మహేష్ బి.గితే స్పష్టం చేశారు, మానవతా సేవలో పోలీసు శాఖ యొక్క నిబద్ధతను తెలియజేశారు.
    4
    శనివారం నాడు గంబీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ సందర్భంగా, ఎస్పీ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు మరియు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు వృద్ధాశ్రమ సభ్యులు ఉన్నారు.

ఈ సందర్శనలో భాగంగా, ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలబడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని మహేష్ బి.గితే స్పష్టం చేశారు, మానవతా సేవలో పోలీసు శాఖ యొక్క నిబద్ధతను తెలియజేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్లు సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5)తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, ఉత్కం విజయ్ వాటిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి నిధులను పంచుకున్నారు. అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. అతను దాన్ని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపారు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. అంతేకాకుండా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు. ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు తేలింది. నిందితులు ఉత్కం విజయ్ (A1), కమ్మరి రాజశేఖర్ (A2), చెపూరి మధుకర్ (A4), వాసాల గణేష్ (A5), గాజుల నవీన్‌లను ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹46,21,358 మొత్తాన్ని ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్లు సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5)తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, ఉత్కం విజయ్ వాటిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి నిధులను పంచుకున్నారు.

అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. అతను దాన్ని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపారు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. అంతేకాకుండా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు.

ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు తేలింది. నిందితులు ఉత్కం విజయ్ (A1), కమ్మరి రాజశేఖర్ (A2), చెపూరి మధుకర్ (A4), వాసాల గణేష్ (A5), గాజుల నవీన్‌లను ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹46,21,358 మొత్తాన్ని ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • జన్నారం మండలంలోని తపాలాపూర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పరిస్థితిని పట్టించుకోకపోవడంతో స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తామే స్వచ్ఛందంగా రంగంలోకి దిగి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం ద్వారా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు, ప్రయాణం నరకప్రాయంగా మారి నడుములు విరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే గర్భిణులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, "గుంతల రోడ్డుపై ప్రయాణించడం వల్ల గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఆటోలు ఎక్కి దిగే లోపే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది" అని తమ ఆవేదనను తెలియజేశారు. రోడ్డు పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా మారుతుండటంతో పాటు, గుంతల వల్ల ఆటోలు పాడవుతుండటంతో ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారుల కోసం ఎదురుచూడడం వ్యర్థమని భావించిన డ్రైవర్లు, తమ సొంత డబ్బులతో ట్రాక్టర్ల ద్వారా 'మొరం' తెప్పించి, రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పెద్ద పెద్ద గుంతలను స్వయంగా పూడ్చి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. అయితే, మొరంతో గుంతలు పూడ్చడం కేవలం తాత్కాలికమేనని, వర్షం పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, కేవలం తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టకుండా, తపాలాపూర్ రోడ్డుకు శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
    1
    జన్నారం మండలంలోని తపాలాపూర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పరిస్థితిని పట్టించుకోకపోవడంతో స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తామే స్వచ్ఛందంగా రంగంలోకి దిగి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం ద్వారా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.

ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు, ప్రయాణం నరకప్రాయంగా మారి నడుములు విరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే గర్భిణులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, "గుంతల రోడ్డుపై ప్రయాణించడం వల్ల గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఆటోలు ఎక్కి దిగే లోపే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది" అని తమ ఆవేదనను తెలియజేశారు. రోడ్డు పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా మారుతుండటంతో పాటు, గుంతల వల్ల ఆటోలు పాడవుతుండటంతో ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

అధికారుల కోసం ఎదురుచూడడం వ్యర్థమని భావించిన డ్రైవర్లు, తమ సొంత డబ్బులతో ట్రాక్టర్ల ద్వారా 'మొరం' తెప్పించి, రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పెద్ద పెద్ద గుంతలను స్వయంగా పూడ్చి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. అయితే, మొరంతో గుంతలు పూడ్చడం కేవలం తాత్కాలికమేనని, వర్షం పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, కేవలం తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టకుండా, తపాలాపూర్ రోడ్డుకు శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామం వద్ద శనివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి ఈ ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
    1
    కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామం వద్ద శనివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి ఈ ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • కామారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ మహాసభలకు ప్రతినిధులు మహబూబ్నగర్‌కు బయలుదేరారు. జిల్లా అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక వాహనాల్లో వారు తరలివెళ్లారు. ఈ మహాసభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మణిక్ సర్కార్ హాజరవుతున్నట్లు వెంకట్ తెలిపారు. తరలివెళ్లిన వారిలో సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, నాయకులు భాస్కర్, సిద్ధిరాములు తదితరులు ఉన్నారు. కామారెడ్డి మండలం నుండి కూడా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఈ మహాసభలకు తరలివెళ్లారు.
    1
    కామారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ మహాసభలకు ప్రతినిధులు మహబూబ్నగర్‌కు బయలుదేరారు. జిల్లా అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక వాహనాల్లో వారు తరలివెళ్లారు.

ఈ మహాసభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మణిక్ సర్కార్ హాజరవుతున్నట్లు వెంకట్ తెలిపారు. తరలివెళ్లిన వారిలో సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, నాయకులు భాస్కర్, సిద్ధిరాములు తదితరులు ఉన్నారు. కామారెడ్డి మండలం నుండి కూడా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఈ మహాసభలకు తరలివెళ్లారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ షీట్‌లను సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ మేరకు ఆయన పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మోసం మూడు ప్రధాన పద్ధతులలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపరెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్, అతని సహచరుడు వేములవాడ రూరల్, అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్‌తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లుగా నకిలీ ట్రక్ షీట్లను తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి రెండు లారీలకు నకిలీ ట్రక్ షీట్లు జారీ చేయగా, వాటిని ఉత్కం విజయ్ సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అనంతరం, నిందితులు నిధులను పంచుకున్నారు. అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్, బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్‌తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ షీట్ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. దీనిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత, రాజశేఖర్ ఆమోదం తెలపగా విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. ఇంకా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపరెల్ పార్క్ గోదాముకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్‌కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి, వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు. ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ దర్యాప్తు చేపట్టగా, సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు ఉత్కం విజయ్, కమ్మరి రాజశేఖర్, చెపూరి మధుకర్, వాసాల గణేష్, గాజుల నవీన్, గడ్డం స్వామిలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, ₹46,21,358 మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ షీట్‌లను సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ మేరకు ఆయన పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ మోసం మూడు ప్రధాన పద్ధతులలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపరెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్, అతని సహచరుడు వేములవాడ రూరల్, అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్‌తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లుగా నకిలీ ట్రక్ షీట్లను తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి రెండు లారీలకు నకిలీ ట్రక్ షీట్లు జారీ చేయగా, వాటిని ఉత్కం విజయ్ సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అనంతరం, నిందితులు నిధులను పంచుకున్నారు. అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్, బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్‌తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ షీట్ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. దీనిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత, రాజశేఖర్ ఆమోదం తెలపగా విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు.

ఇంకా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపరెల్ పార్క్ గోదాముకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్‌కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి, వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు.

ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ దర్యాప్తు చేపట్టగా, సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు ఉత్కం విజయ్, కమ్మరి రాజశేఖర్, చెపూరి మధుకర్, వాసాల గణేష్, గాజుల నవీన్, గడ్డం స్వామిలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, ₹46,21,358 మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • నిర్మల్ జిల్లాలోని కల్లూరు ఖండం ఉపమండల కేంద్రానికి చెందిన విద్యార్థి సంఘం నేత, బీడీఎస్ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చక్కటి ఆనంద్ కుమార్ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి కేజీబీవీ హాస్టల్‌కు వెళ్లగా, హాస్టల్ సిబ్బంది ఆయనను అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలంటే హాస్టల్‌లో అనుమతిస్తేనే సాధ్యమవుతుందని ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. హాస్టల్‌లోకి అనుమతించకపోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
    1
    నిర్మల్ జిల్లాలోని కల్లూరు ఖండం ఉపమండల కేంద్రానికి చెందిన విద్యార్థి సంఘం నేత, బీడీఎస్ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చక్కటి ఆనంద్ కుమార్ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి కేజీబీవీ హాస్టల్‌కు వెళ్లగా, హాస్టల్ సిబ్బంది ఆయనను అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలంటే హాస్టల్‌లో అనుమతిస్తేనే సాధ్యమవుతుందని ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు.

హాస్టల్‌లోకి అనుమతించకపోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
    user_చక్కటి ఆనంద్ కుమార్
    చక్కటి ఆనంద్ కుమార్
    భైంసా, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.