logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమానికి శ్రీకారం 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమానికి శ్రీకారం గోరంట్లలో నయా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు.. ఓం శాంతి భవన్ నిర్వాహకులు ఉమాదేవి, బలరాం గుప్తా వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఓం శాంతి భవన్ నిర్వాహకులు ఉమాదేవి, బలరాం గుప్తా పిలుపునిచ్చారు. గోరంట్ల పట్టణంలోని వాసవి మహల్‌లో ఆదివారం నయా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.గోరంట్లలోని ఓం శాంతి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఉమాదేవి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నయా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా గోరంట్లలో ఈ కార్యక్రమాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వ్యసనాల నిర్మూలన, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం చేపడుతున్న ఈ మహా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.గోరంట్ల పట్టణంలో నిర్వహించే కార్యక్రమం ఈ మహా ఉద్యమానికి నాంది పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో శిల్పా సిస్టర్, బలరాం గుప్తా, శ్రీనివాసులు, చలపతి, శివప్ప తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Mallikarjun
Mallikarjun
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
3b4af033-8d13-43bc-b087-58c803127978

10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమానికి శ్రీకారం 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమానికి శ్రీకారం గోరంట్లలో నయా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు.. ఓం శాంతి భవన్ నిర్వాహకులు ఉమాదేవి, బలరాం గుప్తా వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఓం శాంతి భవన్ నిర్వాహకులు ఉమాదేవి, బలరాం గుప్తా పిలుపునిచ్చారు. గోరంట్ల పట్టణంలోని వాసవి మహల్‌లో ఆదివారం నయా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.గోరంట్లలోని ఓం శాంతి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఉమాదేవి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న

f8b52032-6fbc-4c64-868c-cde4193edfa8

నయా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా గోరంట్లలో ఈ కార్యక్రమాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వ్యసనాల నిర్మూలన, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం చేపడుతున్న ఈ మహా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.గోరంట్ల పట్టణంలో నిర్వహించే కార్యక్రమం ఈ మహా ఉద్యమానికి నాంది పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో శిల్పా సిస్టర్, బలరాం గుప్తా, శ్రీనివాసులు, చలపతి, శివప్ప తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారాల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని తీర్మానం. -లెన్స్‌కార్ట్ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పట్టణంలో లెన్స్‌కార్ట్ షోరూమ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక చిన్న వ్యాపారుల భవిష్యత్, ఉద్యోగుల ఉపాధి, కార్పొరేట్ సంస్థల ప్రభావం, ప్రభుత్వ శాఖల స్పందన, చట్టబద్ధ అనుమతుల అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ధర్మవరంలో దశాబ్దాలుగా స్థానిక ఆప్టికల్ వ్యాపారాలపై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కుటుంబాలు గత తొమ్మిది నెలలుగా తమ ఉపాధి, భవిష్యత్తు మరియు చిన్న వ్యాపారాల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి తమ సమస్యలను వివరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం పట్ల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. స్థానిక వ్యాపారులు మాత్రమే కాకుండా పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు కూడా ఈ సమస్యకు మద్దతుగా నిలిచి తమ అభిప్రాయాలను తెలియజేసినప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో నిరాశ, ఆందోళన వ్యక్తమవుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాల్లో మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, సంబంధిత భవనం మరియు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ వినియోగ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ అనుమతులు మరియు ఇతర చట్టబద్ధ అనుమతులపై సంబంధిత శాఖలు పూర్తి పారదర్శకతతో విచారణ నిర్వహించి ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే స్థానిక వ్యాపారులు మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, టౌన్ ప్లానింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో పలు సందేహాలకు తావిస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల సమస్యల విషయంలో అధికారులు ఆలస్యం చేయకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే, ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ప్రజలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగుల జీవనోపాధిని కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోని పక్షంలో, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్), సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌బీ, ఎంఆర్పీఎస్తో పాటు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్థానిక వ్యాపార సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, స్థానిక చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మరియు స్థానిక వ్యాపారులు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలను చేపడతామని సమావేశంలో వెల్లడించారు. స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారుల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకులు తుంపర్తి పరమేష్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి యర్రంశెట్టి రమణ, సీపీఐ(ఎంఎల్) నాయకులు పోలా లక్ష్మీనారాయణ, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, బీఎస్పీ నాయకులు వినయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వెంకటేష్తో పాటు స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులు మరియు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. "స్థానిక ఉపాధి – స్థానిక హక్కు", "చట్టం ముందు అందరూ సమానమే", "చిన్న వ్యాపారాల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది" అనే నినాదాలతో సమావేశం ముగిసింది.
    2
    స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారాల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని తీర్మానం.
-లెన్స్‌కార్ట్ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం.
శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పట్టణంలో లెన్స్‌కార్ట్ షోరూమ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక చిన్న వ్యాపారుల భవిష్యత్, ఉద్యోగుల ఉపాధి, కార్పొరేట్ సంస్థల ప్రభావం, ప్రభుత్వ శాఖల స్పందన, చట్టబద్ధ అనుమతుల అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ధర్మవరంలో దశాబ్దాలుగా స్థానిక ఆప్టికల్ వ్యాపారాలపై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కుటుంబాలు గత తొమ్మిది నెలలుగా తమ ఉపాధి, భవిష్యత్తు మరియు చిన్న వ్యాపారాల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి తమ సమస్యలను వివరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం పట్ల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది.
స్థానిక వ్యాపారులు మాత్రమే కాకుండా పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు కూడా ఈ సమస్యకు మద్దతుగా నిలిచి తమ అభిప్రాయాలను తెలియజేసినప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో నిరాశ, ఆందోళన వ్యక్తమవుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాల్లో మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా, సంబంధిత భవనం మరియు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ వినియోగ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ అనుమతులు మరియు ఇతర చట్టబద్ధ అనుమతులపై సంబంధిత శాఖలు పూర్తి పారదర్శకతతో విచారణ నిర్వహించి ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ అంశంపై ఇప్పటికే స్థానిక వ్యాపారులు మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, టౌన్ ప్లానింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో పలు సందేహాలకు తావిస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల సమస్యల విషయంలో అధికారులు ఆలస్యం చేయకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు.
అలాగే, ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ప్రజలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగుల జీవనోపాధిని కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోని పక్షంలో, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్), సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌బీ, ఎంఆర్పీఎస్తో పాటు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్థానిక వ్యాపార సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, స్థానిక చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మరియు స్థానిక వ్యాపారులు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలను చేపడతామని సమావేశంలో వెల్లడించారు. స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారుల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని నాయకులు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకులు తుంపర్తి పరమేష్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి యర్రంశెట్టి రమణ, సీపీఐ(ఎంఎల్) నాయకులు పోలా లక్ష్మీనారాయణ, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, బీఎస్పీ నాయకులు వినయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వెంకటేష్తో పాటు స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులు మరియు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
"స్థానిక ఉపాధి – స్థానిక హక్కు", "చట్టం ముందు అందరూ సమానమే", "చిన్న వ్యాపారాల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది" అనే నినాదాలతో సమావేశం ముగిసింది.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ప్రొద్దుటూరు పట్టణంలోని పప్పుల బట్టి వీధిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
    1
    ప్రొద్దుటూరు పట్టణంలోని పప్పుల బట్టి వీధిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ
ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గత వైకాపాలనలో ప్రతిపక్ష నేతగా అడ్డుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే కాలువ ఇప్పుడు సమర్పించడం ఏంటి రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం రైతులతో భూసేకరణ చేపట్టేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రైతుల భూములకు రక్షణ ఏది అంటూ అడ్డుకోవడం జరిగిందని బిఎస్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిందనూరు నాగరాజు పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే నే నేడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటూ అదే ప్రాజెక్టును సమర్తించడంఏంటంటూ ప్రశ్నించారు. రైతుల భూములకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు హామీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున బిఎస్పి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
    1
    గత వైకాపాలనలో ప్రతిపక్ష నేతగా అడ్డుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే కాలువ ఇప్పుడు సమర్పించడం ఏంటి
రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం రైతులతో భూసేకరణ చేపట్టేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రైతుల భూములకు రక్షణ ఏది అంటూ అడ్డుకోవడం జరిగిందని బిఎస్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిందనూరు నాగరాజు పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే నే నేడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటూ అదే ప్రాజెక్టును సమర్తించడంఏంటంటూ ప్రశ్నించారు. రైతుల భూములకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు హామీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున బిఎస్పి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు. అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.
    1
    అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ

AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.
అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ
AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • బద్వేలు, ఆగస్టు 01: స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు. బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు. ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు, ఆగస్టు 01:
స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు.  బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు.  స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు.  ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వర్షాభావంతో రైతు కన్నీరు: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర అయితే ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరికి చేసేదేమీ లేక ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చిందని రైతు వాపోయాడు. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయానని రైతు విలపించాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ (యం ఎల్) నేత వెంకటేశ్వర్లు కోరారు
    1
    వర్షాభావంతో రైతు కన్నీరు: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు
జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర అయితే ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరికి చేసేదేమీ లేక ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చిందని రైతు వాపోయాడు. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయానని రైతు విలపించాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ (యం ఎల్) నేత వెంకటేశ్వర్లు కోరారు
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.
    1
    జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి  కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు

కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు  రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో  ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి  వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు.
తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం  పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.
    1
    కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి 
సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై
ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.