logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా :ధర్మపురి: ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.

5 hrs ago
user_Sk chaitanya
Sk chaitanya
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
5 hrs ago

ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా :ధర్మపురి: ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రైతు ప్రజా సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేస్తాం: బిజెపి నాయకులు రైతులు, ప్రజా సమస్యలపై బిజెపి నిరంతరాయ ఉద్యమాలు చేస్తుందని బిజెపి లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని స్థానిక ఐబీలో మీడియా సమావేశం నిర్వహించారు. కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడితే ఆయనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.
    1
    రైతు ప్రజా సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేస్తాం: బిజెపి నాయకులు
రైతులు, ప్రజా సమస్యలపై బిజెపి నిరంతరాయ ఉద్యమాలు చేస్తుందని బిజెపి లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని స్థానిక ఐబీలో మీడియా సమావేశం నిర్వహించారు. కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడితే ఆయనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.
    1
    ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ 
వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 hrs ago
  • *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ* భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    1
    *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ*
భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. 
పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.
బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    1
    జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్
ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.
​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • గుండ్లపల్లి స్టేజ్ నుండి ఘనంగా తిరంగా ర్యాలీ......... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు "వందే మాతరం.. భారత్ మాతా కీ జై" అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    గుండ్లపల్లి స్టేజ్  నుండి  ఘనంగా తిరంగా ర్యాలీ.........
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు "వందే మాతరం.. భారత్ మాతా కీ జై" అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    Tour operator గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ, ALIMCO ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల నిర్ధారణ శిబిరము జగిత్యాల జిల్లా మహిళ, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు ALIMCO సంస్థ ద్వారా ఉచిత బ్యాటరీ ట్రై సైకిల్స్, ఇతర పరికరాల కొరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల ఎంపిక మరియు కృత్రిమ అవయవాల నిర్ధారణ శిబిరము నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ శిభిరంలో నియోజకవర్గంలోని మండలాలకు చెందిన దివ్యంగులు పాల్గొని కృత్రిమ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ మాట్లాడుతూ,  కేంద్ర ప్రభుత్వం మరియు అలిమ్ కో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కొలతల శిబిరము నిర్వహించడం జరిగిందన్నారు. దివ్యంగుల వైకల్యాన్ని డాక్టర్లు నిర్దారణ చేసిన తరువాత సర్టిఫికెట్ ఇస్తారని దానికి అనుగుణంగా పరికరాలను మరో రోజు పంపిణీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అలిమ్ కో సంస్థ ద్వారా దివ్యంగులకు ఉచితంగా కృత్రిమ కాలు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, చంక కర్రలు, బ్యాటరీ ట్రై సైకిళ్ళు, వీల్ ఛైర్స్ లాంటి పరికరాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే, జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం పరిధిలో గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యంగుల కోసం ఏర్పాటు చేసిన ఈ శిభిరంలో అర్హతగలవారు తమ పేరు నమోదుచేసుకుని ఉపయోగపడే పరికరాలు పొందాలని డా భాస్కర్ కోరారు.
    1
    జగిత్యాల జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ, ALIMCO ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల నిర్ధారణ శిబిరము
జగిత్యాల జిల్లా మహిళ, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు ALIMCO సంస్థ ద్వారా ఉచిత బ్యాటరీ ట్రై సైకిల్స్, ఇతర పరికరాల కొరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల ఎంపిక మరియు కృత్రిమ అవయవాల నిర్ధారణ శిబిరము నిర్వహించారు.
జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ శిభిరంలో నియోజకవర్గంలోని మండలాలకు చెందిన దివ్యంగులు పాల్గొని కృత్రిమ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ మాట్లాడుతూ,  కేంద్ర ప్రభుత్వం మరియు అలిమ్ కో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కొలతల శిబిరము నిర్వహించడం జరిగిందన్నారు.
దివ్యంగుల వైకల్యాన్ని డాక్టర్లు నిర్దారణ చేసిన తరువాత సర్టిఫికెట్ ఇస్తారని దానికి అనుగుణంగా పరికరాలను మరో రోజు పంపిణీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అలిమ్ కో సంస్థ ద్వారా దివ్యంగులకు ఉచితంగా కృత్రిమ కాలు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, చంక కర్రలు, బ్యాటరీ ట్రై సైకిళ్ళు, వీల్ ఛైర్స్ లాంటి పరికరాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే, జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం పరిధిలో గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యంగుల కోసం ఏర్పాటు చేసిన ఈ శిభిరంలో అర్హతగలవారు తమ పేరు నమోదుచేసుకుని ఉపయోగపడే పరికరాలు పొందాలని డా భాస్కర్ కోరారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాత్య రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ అన్నారు. “రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి రాజకీయాలు దిగజారడం అత్యంత బాధాకరం. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని” కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటేశం కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన కేటీఆర్ ఆయన చిన్నారి కుమార్తె తన తండ్రి కోసం ఎదురు చూస్తూ, మూడు రోజులుగా తినలేదని చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. “ఆ పాప తన నాన్న రాలేదని బాధపడుతూ మూడు రోజులుగా తినలేదని చెబుతుంటే మనసున్న ఏ మనిషికైనా కళ్లల్లో నీళ్లు తిరగక మానవు. గుండె ద్రవించక మానదు” అని కేటీఆర్ అన్నారు.వెంకటేశం మృతి ఘటనలో కొంత మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, వారు కేవలం పాత్రధారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు ఎవరన్నది దర్యాప్తులో తేల్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా, వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నప్పటికీ, వారిలో ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు పంపించి, మిగతా ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, తదుపరి చర్యలు పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులపై ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి మూలాలను కూడా వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు.వెంకటేశం కుటుంబం నివసిస్తున్న ఇల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని కేటీఆర్ తెలిపారు. కొత్త ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినప్పటికీ, నెలల తరబడి తిప్పించుకున్నారని కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు కేటీఆర్ వెల్లడించారు. “కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించి ఇస్తాం. మీరు మా ప్రయత్నానికి అడ్డుగా ఉండొద్దని కలెక్టర్‌కు చెప్పాను” అని కేటీఆర్ తెలిపారు.తాను కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి వెంటే ఉంటామని స్పష్టం చేశారు.వెంకటేశం కుమార్తె ప్రస్తుతం 11 ఏళ్ల వయసులో, ఐదో తరగతి చదువుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆ బాలిక పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె మేజర్ అయిన తర్వాత ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.అంతే కాకుండా, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న పాఠశాల కరస్పాండెంట్‌తో తాను స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. పదో తరగతి వరకు బాలిక చదువుకు సంబంధించిన ఫీజులు తదితర ఖర్చుల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“ఆమె పదో తరగతి తర్వాత ఏం చదువుకోవాలనుకున్నా, ఆమె చదువు కొనసాగించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆ తల్లికి ఈ విషయంలో మాట ఇచ్చాను” అని కేటీఆర్ తెలిపారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కూడా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అందించినట్లు చెప్పారు.ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడకుండా, ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని కేటీఆర్ పోలీసు అధికారులను కోరారు. “దయచేసి ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా వారిని బయటకు తీసుకురండి. బాధిత కుటుంబానికి న్యాయం చేయండి” అని ఆయన పోలీసులను కోరారు. వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఈ విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టం. ఆ పాప పెరిగి పెద్దయ్యే వరకు కూడా నేను స్వయంగా అండగా ఉంటాను. ఈ నేరం వెనుక ఎవరు ఉన్నారు? కుట్ర చేసింది ఎవరు? నేరానికి పాల్పడింది ఎవరు? అనే విషయాలను పూర్తిగా బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.“వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము కుటుంబం వెంటే ఉంటాం. ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టం. పోలీసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలి. ఈ ఘటన వెనుక అసలు నిజాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
    2
    సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు.
సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాత్య రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ అన్నారు. “రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి రాజకీయాలు దిగజారడం అత్యంత బాధాకరం. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని” కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటేశం కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన కేటీఆర్ ఆయన చిన్నారి కుమార్తె తన తండ్రి కోసం ఎదురు చూస్తూ, మూడు రోజులుగా తినలేదని చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. “ఆ పాప తన నాన్న రాలేదని బాధపడుతూ మూడు రోజులుగా తినలేదని చెబుతుంటే మనసున్న ఏ మనిషికైనా కళ్లల్లో నీళ్లు తిరగక మానవు. గుండె ద్రవించక మానదు” అని కేటీఆర్ అన్నారు.వెంకటేశం మృతి ఘటనలో కొంత మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, వారు కేవలం పాత్రధారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు ఎవరన్నది దర్యాప్తులో తేల్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా, వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నప్పటికీ, వారిలో ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు పంపించి, మిగతా ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, తదుపరి చర్యలు పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులపై ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి మూలాలను కూడా వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు.వెంకటేశం కుటుంబం నివసిస్తున్న ఇల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని కేటీఆర్ తెలిపారు. కొత్త ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినప్పటికీ, నెలల తరబడి తిప్పించుకున్నారని కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు కేటీఆర్ వెల్లడించారు. “కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించి ఇస్తాం. మీరు మా ప్రయత్నానికి అడ్డుగా ఉండొద్దని కలెక్టర్‌కు చెప్పాను” అని కేటీఆర్ తెలిపారు.తాను కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి వెంటే ఉంటామని స్పష్టం చేశారు.వెంకటేశం కుమార్తె ప్రస్తుతం 11 ఏళ్ల వయసులో, ఐదో తరగతి చదువుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆ బాలిక పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె మేజర్ అయిన తర్వాత ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.అంతే కాకుండా, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న పాఠశాల కరస్పాండెంట్‌తో తాను స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. పదో తరగతి వరకు బాలిక చదువుకు సంబంధించిన ఫీజులు తదితర ఖర్చుల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“ఆమె పదో తరగతి తర్వాత ఏం చదువుకోవాలనుకున్నా, ఆమె చదువు కొనసాగించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆ తల్లికి ఈ విషయంలో మాట ఇచ్చాను” అని కేటీఆర్ తెలిపారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కూడా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అందించినట్లు చెప్పారు.ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడకుండా, ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని కేటీఆర్ పోలీసు అధికారులను కోరారు. “దయచేసి ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా వారిని బయటకు తీసుకురండి. బాధిత కుటుంబానికి న్యాయం చేయండి” అని ఆయన పోలీసులను కోరారు.
వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఈ విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టం. ఆ పాప పెరిగి పెద్దయ్యే వరకు కూడా నేను స్వయంగా అండగా ఉంటాను. ఈ నేరం వెనుక ఎవరు ఉన్నారు? కుట్ర చేసింది ఎవరు? నేరానికి పాల్పడింది ఎవరు? అనే విషయాలను పూర్తిగా బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.“వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము కుటుంబం వెంటే ఉంటాం. ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టం. పోలీసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలి. ఈ ఘటన వెనుక అసలు నిజాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.తాడు సహాయంతో కాపాడిన గ్రామస్థులు రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.అధికారులు హెచ్చరిస్తున్న వినకుండా సాహసాలు చేస్తున్న యువకులు. బైక్ పై వాగు దాటుతుండగా ఘటన. వరద ఉదృతికి బైక్ తో పాటు కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు. తాడు సహాయంతో కాపాడిన గ్రామస్తులు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.తాడు సహాయంతో కాపాడిన గ్రామస్థులు
రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.అధికారులు హెచ్చరిస్తున్న వినకుండా సాహసాలు చేస్తున్న యువకులు.
బైక్ పై వాగు దాటుతుండగా ఘటన.
వరద ఉదృతికి బైక్ తో పాటు కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.
తాడు సహాయంతో కాపాడిన గ్రామస్తులు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.