వంట గ్యాస్ ధరలు పెంచటం దుర్మార్గం + మోడీ పాలనలో గ్యాస్, పెట్రోలియం ద్వారా అక్రమంగా లక్షల కోట్లు వసూళ్ళు + రూ.500లకే వంట గ్యాస్.. రూ.70లకు పెట్రోలు, రూ.60లకు డీజిల్ ఇవ్వాలి + లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.. + నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న అక్రమ యుద్ధాన్ని బలపరిచిన భారత ప్రధాని నరేంద్ర మోడీ వంట గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పెరిగిన వంట గ్యాస్ ధరల వల్ల సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతారన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్ నుంచి మార్కెట్ కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు గ్యాస్ బండలను మోస్తూ.. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం ముందర పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో మహిళలంటే అత్యంత గౌరవం అని గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోడీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గ్యాస్ ధరలు పెంచడం అన్యాయమన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా లక్షల కోట్లు అక్రమంగా వసూలు చేశారని విమర్శించారు. మోడీ ఒక చంబల్ లోయ బందిపోటు అని ధ్వజమెత్తారు. మోడీ పాలనలో ముడి బ్యారల్ ధర తగ్గినప్పుడు వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించిన దాఖలాలు నామ మాత్రమేనన్నారు. 2014లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వంట గ్యాస్్ప రూ.20 పెంచినందుకు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సిలిండర్ నెత్తిన పెట్టుకొని దేశమంతా గందరగోళం సృష్టించాలని, అయితే 2014 చివర్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా వంట గ్యాస్ను రూ.1150 పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణ, గోదావరి బేసిన్లో ఉన్న సహజ వాయువును రిలయన్స్ వారు ప్రతి సంవత్సరం రూ.3 లక్షల కోట్లు ఆదాయాన్ని కొల్లగొట్టుకుపోతున్నారని ఆరోపించారు. కానీ దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 8 శాతం పన్ను వేసే అధికారం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, దీంతో ఈ సహజ వాయువు ద్వారా మన రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 24 వేల కోట్లు ఆదాయం రాబడి వస్తుందని చెప్పారు. కానీ మోడీ ఆ మొత్తాన్ని రిలయన్స్, అంబానీలకు కట్టపెడుతున్నారని విమర్శించారు. మన సహజ వాయువులో మన వాటా మనకు వస్తే మన రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరెంటు, రూ.100లకే వంట గ్యాస్ ఇవ్వచ్చన్నారు. సామాన్య మధ్య తరగతి మహిళలను దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్ను రూ.500, ఒక లీటర్ పెట్రోల్ రూ.70లకు, డీజిల్ రూ. 60లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళల నడ్డి విరిచిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అనేకసార్లు వంట గ్యాస్ ధరలు పెంచారని ధ్వజమెత్తారు. సీపీఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ఇవ్వడమే భారతదేశంలోని మహిళలకు ఇచ్చిన గౌరవం అని ఎద్దేవా చేశారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా బీజేపీ పని తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో వంట గ్యాన్పై రూ.60, వాణిజ్య గ్యాన్పై రూ.115లు పెంచడం దుర్మార్గమని అన్నారు. దీనిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందని, పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఏటీసీ రాష్ట్ర నాయకులు జాన్సన్ బాబు, సీపీఐ నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, మంగ శ్రీనివాసరావు, చల్లా మరియదాసు, ధూపాటి వెంకటరత్నం, పరిమళ బన్నీ, నగర సమితి సభ్యులు ఓలేటి సుశీల, జగన్నాథం, అకిటి రామచంద్రుడు, తిరుమల, కోటేశ్వరరావు, ఏఐకేఎస్ నాయకులు కొల్లి రంగారెడ్డి, విటల్రెడ్డి, మహేష్, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.
వంట గ్యాస్ ధరలు పెంచటం దుర్మార్గం + మోడీ పాలనలో గ్యాస్, పెట్రోలియం ద్వారా అక్రమంగా లక్షల కోట్లు వసూళ్ళు + రూ.500లకే వంట గ్యాస్.. రూ.70లకు పెట్రోలు, రూ.60లకు డీజిల్ ఇవ్వాలి + లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.. + నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న అక్రమ యుద్ధాన్ని బలపరిచిన భారత ప్రధాని నరేంద్ర మోడీ వంట గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పెరిగిన వంట గ్యాస్ ధరల వల్ల సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతారన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్ నుంచి మార్కెట్ కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు గ్యాస్ బండలను మోస్తూ.. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం ముందర పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో మహిళలంటే అత్యంత గౌరవం అని గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోడీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గ్యాస్ ధరలు పెంచడం అన్యాయమన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు గ్యాస్,
పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా లక్షల కోట్లు అక్రమంగా వసూలు చేశారని విమర్శించారు. మోడీ ఒక చంబల్ లోయ బందిపోటు అని ధ్వజమెత్తారు. మోడీ పాలనలో ముడి బ్యారల్ ధర తగ్గినప్పుడు వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించిన దాఖలాలు నామ మాత్రమేనన్నారు. 2014లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వంట గ్యాస్్ప రూ.20 పెంచినందుకు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సిలిండర్ నెత్తిన పెట్టుకొని దేశమంతా గందరగోళం సృష్టించాలని, అయితే 2014 చివర్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా వంట గ్యాస్ను రూ.1150 పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణ, గోదావరి బేసిన్లో ఉన్న సహజ వాయువును రిలయన్స్ వారు ప్రతి సంవత్సరం రూ.3 లక్షల కోట్లు ఆదాయాన్ని కొల్లగొట్టుకుపోతున్నారని ఆరోపించారు. కానీ దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 8 శాతం పన్ను వేసే అధికారం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, దీంతో ఈ సహజ వాయువు ద్వారా మన రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 24 వేల కోట్లు ఆదాయం రాబడి వస్తుందని చెప్పారు. కానీ మోడీ ఆ మొత్తాన్ని రిలయన్స్, అంబానీలకు కట్టపెడుతున్నారని విమర్శించారు. మన సహజ వాయువులో మన వాటా మనకు వస్తే మన రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరెంటు, రూ.100లకే వంట గ్యాస్ ఇవ్వచ్చన్నారు. సామాన్య మధ్య తరగతి మహిళలను దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్ను రూ.500, ఒక లీటర్ పెట్రోల్ రూ.70లకు,
డీజిల్ రూ. 60లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళల నడ్డి విరిచిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అనేకసార్లు వంట గ్యాస్ ధరలు పెంచారని ధ్వజమెత్తారు. సీపీఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ఇవ్వడమే భారతదేశంలోని మహిళలకు ఇచ్చిన గౌరవం అని ఎద్దేవా చేశారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా బీజేపీ పని తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో వంట గ్యాన్పై రూ.60, వాణిజ్య గ్యాన్పై రూ.115లు పెంచడం దుర్మార్గమని అన్నారు. దీనిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందని, పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఏటీసీ రాష్ట్ర నాయకులు జాన్సన్ బాబు, సీపీఐ నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, మంగ శ్రీనివాసరావు, చల్లా మరియదాసు, ధూపాటి వెంకటరత్నం, పరిమళ బన్నీ, నగర సమితి సభ్యులు ఓలేటి సుశీల, జగన్నాథం, అకిటి రామచంద్రుడు, తిరుమల, కోటేశ్వరరావు, ఏఐకేఎస్ నాయకులు కొల్లి రంగారెడ్డి, విటల్రెడ్డి, మహేష్, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.
- గుంటూరు.. *కవరేజ్ కు వెళ్లిన మీడియా పై దాడి..* గుంటూరు లాలా పేట లో బంగారు షాపుల పై BIS అధికారులు తనిఖీలు. సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన BIS అధికారులు. తనిఖీలు నేపథ్యంలో కవరేజ్ కు వెళ్లిన మీడియా పై షాప్ నిర్వాహకులు దాడి. మా షాప్ లో ఎలా వస్తారంటూ పరుషపదజాలంతో దూసుకొచ్చిన షాప్ నిర్వాహకుడు. కవరేజ్ చేస్తే ఊరుకోనంటూ కెమెరాలను ధ్వసం చేయడానికి యత్నం. షాప్ నిర్వాహకుడు తీరు పై పోలీసులకు సమాచారం అందించిన అధికారులు.1
- Post by Arja Durga Prasad1
- రెండో డివిజన్ మాచవరం కనపర్తి వెంకటస్వామి వీధిలో కొండపైన ప్రాంతంలో ఉన్న మంచినీళ్లు వాటర్ ట్యాంక్ ను గత 50 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ఇదిలా ఉండగా గత 10-15 సంవత్సరాలుగా ట్యాంక్ శిధిలమైపోయింది అధికారులకు కంప్లైంట్ లు పెట్టగా అప్పుడు అప్పుడు వచ్చి రిపేర్లు చేసేవారు కానీ ఇప్పుడు వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలం అవడం వలన వాటర్ ట్యాంక్ లోను వాటర్ మొత్తం ఇళ్ళ మార్గంలో వెళ్ళటం వలన ఇళ్ల కింద ప్రవహించుటవలన ఇండ్ల క్రింది భాగము పూర్తిగా పాడైపోయి ఒక స్వర లాగా పడిపోయినది ఇదేలా ఉంటే రాబోవు రోజుల్లో వాటర్ ట్యాంక్ కింది భాగంలో ఉన్న ఇల్లు ఎప్పటికైన కూలిపోయే ప్రమాదము ఉన్నదని స్థానిక ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ లు పెట్టిన రెండు చేతులెత్తి మొక్కిన ఉపయోగం లేకుండా పోతుంది కావున మీడియా వారు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా ఈ యొక్క వాటర్ ట్యాంక్ కింద భాగంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూన్నారు అలాగే కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించుటకు పాత వాటర్ ట్యాంక్ ప్రక్కన ఎంతో కాళీ స్థలం ఉంది కావున ఆ యొక్క ఖాళీ స్థలంలో కొత్త వాటర్ ట్యాంక్ ని నిర్మించవలసినదిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు వాటర్ ట్యాంక్ చెత్తాచెదారాలతో నిండిపోయి ఉన్నది దాని మూలాన పాములు పురుగు పుట్ట బాగా ఎల్లలోకి వస్తున్నాయని కూడా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం వారానికి ఒకసారి అయినా వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల శుభ్రం చేయవలసినదిగా కోరుకుంటున్నారు పెద్ద పెద్ద పాములు మండ్రగబ్బలు తేళ్లు విష సర్పాలు ఎన్నో వస్తున్నాయని స్థానిక ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎంతో భయపడుతున్నారు అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా వాటర్ ట్యాంక్ పై ఆడుకుంటున్నారు ప్రమాదవశాత్తు అందిట్లో పడిన ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అలాగే వాటర్ ట్యాంక్ ని కూడా బ్లీచింగ్ తో వారానికి ఒకసారి అన్న అడగవలసిన కోరుచున్నాను10
- అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని పెదకోనేలా గ్రామంలో గిరిజన చిన్నారులు విద్యకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రామంలో పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రం ఉన్నప్పటికీ, చాలా మంది పిల్లలు వాటికి వెళ్లడం లేదు. తల్లిదండ్రుల్లో అవగాహన లోపం కారణంగా పిల్లలను బడికి పంపడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక గ్రామానికి సరైన రహదారి లేకపోవడం వల్ల అధికారులు కూడా తరచుగా పర్యవేక్షణ చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కారణంగా గిరిజన పిల్లలు చదువుతో పాటు అభివృద్ధికి కూడా దూరమవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి సౌకర్యం కల్పించి, పిల్లలను విద్యా మార్గంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.1
- నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.2
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ హైదరాబాద్ రోడ్డులోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం... అతివేగంతో దూసుకొచ్చిన కారు... ప్రమాదంలో ఓ మహిళా, ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో... ద్విచక్ర వాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిపై దూసుకెళ్లిన కారు... మున్సిపల్ మహిళా కార్మికురాలి రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం.. స్కూటీపై వెళ్తున్న యువకుడికి తలకు తీవ్ర గాయం.. యువకుడి పరిస్థితి ప్రాణాపాయంగా ఉన్నట్లు సమాచారం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. ద్విచక్ర వాహనదారుడికి సీరియస్ కావడంతో ఐకాన్ హాస్పిటల్‌కు తరలింపు.. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపణ.. కారు డ్రైవర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న టూ టౌన్ పోలీసులు... *ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.*3
- *_జయహో భారత్_* *_టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ పై భారత్ విజయం_* *_97 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం_*1