logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొత్తూరు మండల నూతన సీఐగా నాగార్జున రెడ్డి బాధ్యతల స్వీకరణ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా నాగార్జున రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులతో సమన్వయం కలిగి సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

3 hrs ago
user_S M S R R
S M S R R
Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
3 hrs ago
d13af6f1-03dd-4480-9a49-0be9dd048202

కొత్తూరు మండల నూతన సీఐగా నాగార్జున రెడ్డి బాధ్యతల స్వీకరణ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా నాగార్జున రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులతో సమన్వయం కలిగి సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడు ఏకగ్రీవంగా బాహోజు పాండరి ఎన్నిక గజ్వేల్ మేడ్చల్, కుత్బుల్లాపూర్. ప్రజా తెలంగాణ న్యూస్/ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ ఎస్ ఎస్ ) అనుబంధంగా నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు–2026లో బాహోజు పాండరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కుత్బుల్లాపూర్ మండలంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి బాహోజు పాండరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎన్నికల అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకుడు వింజమూరి రాఘవాచారి, ఎన్నికల అధికారి చేపూరి వెంకటస్వామి సమక్షంలో నూతన అధ్యక్షుడికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాహోజు పాండరి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్వర్ణకారుల సంక్షేమం, సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంఘ పెద్దలు, నాయకులు, సభ్యులు బాహోజు పాండరిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా స్వర్ణకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘంతెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ యస్ యస్ ) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
    4
    మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడు
ఏకగ్రీవంగా బాహోజు పాండరి ఎన్నిక

గజ్వేల్ మేడ్చల్, కుత్బుల్లాపూర్. ప్రజా తెలంగాణ న్యూస్/
తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ ఎస్ ఎస్ ) అనుబంధంగా నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు–2026లో బాహోజు పాండరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కుత్బుల్లాపూర్ మండలంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి బాహోజు పాండరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎన్నికల అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకుడు వింజమూరి రాఘవాచారి, ఎన్నికల అధికారి చేపూరి వెంకటస్వామి సమక్షంలో నూతన అధ్యక్షుడికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాహోజు పాండరి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్వర్ణకారుల సంక్షేమం, సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంఘ పెద్దలు, నాయకులు, సభ్యులు బాహోజు పాండరిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా స్వర్ణకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘంతెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ యస్ యస్ ) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు: కవిత బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేసారు.
    1
    బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు: కవిత
బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేసారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    3 hrs ago
  • ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్
    1
    ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్
ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి
కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం 
ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు 
- పవన్ కళ్యాణ్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    10 hrs ago
  • అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
    3
    అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు.
ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.
    1
    రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 
హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు  హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    3
    ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి.
ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది.
ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు.
వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    user_CHERUKU RAMESH
    CHERUKU RAMESH
    Chiropractor మేడిపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ నాయకులు ఈ నెల 6 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. "సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ" పోస్టర్ ను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవిష్కరణ చేశారు.
    1
    సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ నాయకులు
ఈ నెల 6 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. "సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ" పోస్టర్ ను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవిష్కరణ చేశారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    7 hrs ago
  • విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన.. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన.. హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    4
    విద్యార్థులను ఉద్దేశించి 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన..
విద్యార్థులను ఉద్దేశించి 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన..
హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. 
విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.