Shuru
Apke Nagar Ki App…
ములుగులో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం:రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు నూతన కలెక్టరేట్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మహోన్నత ఘట్టమని, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి తదితర సంక్షేమ పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు.
Karunya
ములుగులో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం:రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు నూతన కలెక్టరేట్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మహోన్నత ఘట్టమని, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి తదితర సంక్షేమ పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క ములుగు జిల్లా, సెప్టెంబర్ 17 : ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కాలేదు. నిరంకుశ పాలనతోపాటు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడారు. ఎన్నో త్యాగాల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైంది. నాటి పోరాట యోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి నిజమైన నివాళి అని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ములుగు అభివృద్ధి: మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్ ములుగు జిల్లాలో మొదటి విడతలో 5,201 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, 4,979 మార్కింగ్ పూర్తి, 1,850 నిర్మాణాలు పూర్తి. రెండో విడతలో మరో 2 వేలు మంజూరు మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 2 కోట్ల 33 లక్షల 89 వేల 601 మంది మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత ప్రయాణం - రూ.172 కోట్ల 6 లక్షలు ఆదా ఘట్టమ్మ వద్ద పైలాన్ ప్రాజెక్ట్ ములుగు అభివృద్ధిలో కలికితురాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ, ఆర్డిఓ, డిఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.2
- ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు' పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని ఘట్టమ్మ సమీపంలో గల కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ స్వాగతం పలికారు. మంత్రి సీతక్క ముందుగా మహనీయులకు పూలమాలలు వేసి తెలంగాణ గీతం ఆలాపన అనంతరం పోలీసు గౌరవనీయులు స్వీకరించారు.జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతక్క ప్రసంగం అనంతరం 265 స్వయం సహాయక సంఘాలకు 22 కోట్ల 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. *ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...* తెలుగు ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము నూతన ములుగు జిల్లా కార్యాలయంలో ఘనంగా, సగర్వంగా మన జాతీయ జెండాను ఎగరవేసుకున్నామని,నిజాం పాలనలో విడిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఆనాడు మన ప్రథమ ప్రధాని నెహ్రూ గారి ఆదేశాల అనుసారం, ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి హోంశాఖ మంత్రిగా ఆనాడు తెలంగాణ భారతదేశంలో భాగమైందని,విముక్తి కోసం, విమోచనం కోసం, విలీనం కోసం అనేక పోరాటాలు, 'భూమి, భుక్తి, విముక్తి' అని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో పెద్ద ఎత్తున జరిగాయని, ఆ పోరాటంలో వేలాది మంది బిడ్డలు కులమత రహితంగా తమ ప్రాంత విముక్తి కోసం, విలీనం కోసం, విమోచనం కోసం పోరాటం చేసి, ఈ పీడన అంతం కావాలి, మనం కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని ఆరోజు పెద్ద ఎత్తున పోరాటం జరిగిందని,ఆ పోరాటాన్ని చూసినటువంటి ఆనాటి ప్రధాని నెహ్రూ గారు భారతదేశంలో తెలంగాణను విలీనం చేసి, నేటికి 78 సంవత్సరాలు పూర్తయి, 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రాంతం సాధించడం జరిగిందని,ఆ తర్వాత ఆంధ్ర-తెలంగాణ ఉద్యమాలు, వాటి పోరాటాల ఫలితంగా మళ్లీ సోనియమ్మ నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో తెలంగాణకు సంపూర్ణమైన ప్రాంతీయ సమస్యలను కూడా తొలగించి, ప్రత్యేక రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మంత్రి సీతక్క అన్నారు.1
- వచ్చే సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తాయి: తుమ్మల నాగేశ్వరరావు ములుగు జిల్లాలోని ఇంచెర్ల, భూపాలపల్లి జిల్లాలోని చైన్పాక ప్రాంతాల్లో ఆయిల్ పామ్ మిల్లుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నాటికి మిల్లులు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.1
- హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security1
- fabo laundry and dry cleaning pickup and delivery fre wash&steam iron per 120 kg wash&fold 100 s team iron 100 shirt 👔 100 rs T. shart👕100 rs paint👖100 rs saree 200 rs lahanga 350 rs jacket 200 rs kurta 100 rs suaes 450 rs blanket (single )350 (double )450 rs bleizer.. 300₹ sairwani. 300₹4
- గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* *కురవి:* గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో *మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో* భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి సత్యవతి రాథోడ్ గారు పాలాభిషేకం నిర్వహించారు* అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...* *“గిరిజనుల ఆరాధ్య దైవం మాజీ సీఎం కేసీఆర్ గారు* గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది *విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు* గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ గారి పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. *కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి *దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది* కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు1
- NSUI ఆధ్వర్యంలో ఖనిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖని రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఆనాడు సామాన్య ప్రజలు ప్రజా చైతన్యంతో సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా పోరాటానికి మద్దతుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిర్వహించిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గం సుగమం కావడం చారిత్రక పరిణామమని అన్నారు. ఈ ప్రజా పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన పరిణామమని మెంటం ఉదయ్ రాజ్ పేర్కొన్నారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దు: మెంటం ఉదయ్ రాజ్ తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను కొందరు బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెంటం ఉదయ్ రాజ్ విమర్శించారు. సెప్టెంబర్ 17నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో నిర్వహించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని,దేశ స్వాతంత్ర సమయంలోనే హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్వామి రామానంద తీర్థ గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన ప్రముఖ పోరాట యోధులని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో బీజేపీకి చెందిన నాయకుల పాత్రను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల చరిత్రను మతపరమైన, రాజకీయ విభజనలకు ఉపయోగించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, NSUI నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- fabo dry cleaning rising sun school kotha wada warangal 1.dry cleaning 2 wash&steam iron for kg(120)only 3.wash&flod 4. 1ps shirt 👕 100/- 5. 1ps pant 👖 100/- 6.only iran 30/- callme : 8523042635 haryana maa adrass rising sun high school offizet1