ప్రతి పౌరుడు ఒకే ఓటు కలిగి ఉండాలి-చిగుమామిడి తహశిల్దార్ కనకయ్య దేశంలో ప్రతీ పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలని, రెండు ఓట్లు కలిగి ఉండడం నేరమని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశిల్దార్ కనకయ్య అన్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహశిల్దార్ కనకయ్య హాజరై ఓటర్ల జాబితా వివరాలు వెల్లడించి, ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామంలో డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించామని గ్రామంలో 204 మందికి నాన్ మ్యాపింగ్ ఓట్లు ఉన్నాయని వాటికి సంబంధించి గ్రామంలో నోటీసులు అందించి సంబంధిత ఓటర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. నోటీసులు అందిన వారు 142 మంది ఆధారాలతో సహా తహశిల్దార్ ముందు హాజరై సరైన వివరాలు అందించాలని కోరారు. అందుబాటులో లేని వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. నేటి నుండి అక్టోబర్ 17 వరకు గ్రామాలలో రోజుకో గ్రామంలో హియరింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
ప్రతి పౌరుడు ఒకే ఓటు కలిగి ఉండాలి-చిగుమామిడి తహశిల్దార్ కనకయ్య దేశంలో ప్రతీ పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలని, రెండు ఓట్లు కలిగి ఉండడం నేరమని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశిల్దార్ కనకయ్య అన్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహశిల్దార్ కనకయ్య హాజరై ఓటర్ల జాబితా వివరాలు వెల్లడించి, ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామంలో డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించామని గ్రామంలో 204 మందికి నాన్ మ్యాపింగ్ ఓట్లు ఉన్నాయని వాటికి సంబంధించి గ్రామంలో నోటీసులు అందించి సంబంధిత ఓటర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. నోటీసులు అందిన వారు 142 మంది ఆధారాలతో సహా తహశిల్దార్ ముందు హాజరై సరైన వివరాలు అందించాలని కోరారు. అందుబాటులో లేని వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. నేటి నుండి అక్టోబర్ 17 వరకు గ్రామాలలో రోజుకో గ్రామంలో హియరింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
- రామంచ ప్రైమరీ స్కూల్ లో రాఖీ పర్వదిన వేడుకలు....రాఖీలు కట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న విద్యార్థులు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్ల సమక్షంలో విద్యార్థులు సోదరీ సోదర భావంతో రాఖీలు కట్టుకొని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటు రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ టీచర్ చీల పద్మా తోపాటు పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.1
- హలో విద్యార్థి చలో హైదరాబాద్ అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది.. సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది.. అధ్యక్షులుగా గుడిసె సందీప్ అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..1
- గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.1
- మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సీపీ గౌష్ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.1
- వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్, పలువరు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక. కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.బిజెపి నాయకులపై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుంటే బిజెపి నాయకులు ఉనికి కోసం ఆరోపణలు చేస్తున్నారు.స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో బీజేపీ రాజకీయ విమర్శలు చేయడం కంటే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను గుర్తించాలి.గత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు.గత 10 సంవత్సరాల లో రేషన్ కార్డ్ ఇవ్వకుండా బిజెపి ఎందుకు ప్రశ్నించలేదు.బీజేపీ బిఆర్ఎస్ రెండూ ఒకే కొవకు చెందిన పార్టీలు.తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం.బిజెపి పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదు.స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తే బిజెపి వారు కోడి గుడ్డు మీద పీకినట్లు రాజకీయం చేస్తున్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుండి వెళ్తున్న నిధులకు అనుగుణంగా బీజేపీ వారు నిధులు ఇస్తున్నారా.దేశంలో అన్ని రాష్ట్రాల నుండి పన్నుల రూపంలో నిధులు వెళుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రి ఫోటోలు పెడుతున్నారా. మొట్ట మొదటగా బిజెపి పాలిత రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేయాలి.దేశంలో నిత్యవసరాలు ధరలు పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది.చెక్కర ధర పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం కారణాం కాదా.యూరియా యాప్ బుకింగ్ ను నిన్నటి నుండి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనిపై బీజేపీ వాళ్లు సమాధానం చెప్పాలి.బిజెపి వాళ్లు ప్రతి దాన్ని రాజకీయం చేయడం మానుకోవాలి.కాంగ్రెస్ పార్టీ వారు బిజెపి బిఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలును తిప్పి కొట్టాలి..4
- సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.2
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభస...కాంగ్రెస్ బిజేపి కార్యకర్తలు మద్య తోపులాట ఉద్రిక్తత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బిజెపి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీశారు. దీంతో బిజెపి పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బిజేపి నాయకుల్ని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకుల తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.4