రంగరెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గ్రామం నాదర్జల్ శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నూతన భవనం నిర్మాణనికి రూ,, 10,000/- లు ఆర్దికసహాయం. రంగరెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గ్రామం నాదర్జల్ శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నూతన భవనం నిర్మాణనికి రూ,, 10,000/- లు ఆర్దికసహాయం. మాతృదేవోభవ అనాధ ఆశ్రమవాసులకు మానసిక వికలాంగులకు ఆశ్రమ నిర్మాణానికై మరియు గోమాతల సంరక్షణకై గోశాల నిర్మాణానికి స్వంత స్థలం కోసం భూదానయజ్ఞం శాశ్వత సొంత స్థలం,భవన నిర్మాణనికి శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా రూ,, 10,000/- లు ఆర్దికసహాయం అందించి తమ సేవాతత్పరతను చాటారు. మీరు,మీ కుటుంబసభ్యులు నిత్యం సుఖసంతోషాలతో ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. చేయి చేయి కలుపండి - మాతృదేవోభవ ఆశ్రమానికి స్వంత స్థలం కోసం తోడ్పాటునందివ్వండి🙏🙏🙏 Google Pay, Phonepe: 9347513830, 7997919365
రంగరెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గ్రామం నాదర్జల్ శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నూతన భవనం నిర్మాణనికి రూ,, 10,000/- లు ఆర్దికసహాయం. రంగరెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గ్రామం నాదర్జల్ శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నూతన భవనం నిర్మాణనికి రూ,, 10,000/- లు ఆర్దికసహాయం. మాతృదేవోభవ అనాధ ఆశ్రమవాసులకు మానసిక వికలాంగులకు ఆశ్రమ నిర్మాణానికై మరియు గోమాతల సంరక్షణకై గోశాల నిర్మాణానికి స్వంత స్థలం కోసం భూదానయజ్ఞం శాశ్వత సొంత స్థలం,భవన నిర్మాణనికి శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా రూ,, 10,000/- లు ఆర్దికసహాయం అందించి తమ సేవాతత్పరతను చాటారు. మీరు,మీ కుటుంబసభ్యులు నిత్యం సుఖసంతోషాలతో ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. చేయి చేయి కలుపండి - మాతృదేవోభవ ఆశ్రమానికి స్వంత స్థలం కోసం తోడ్పాటునందివ్వండి🙏🙏🙏 Google Pay, Phonepe: 9347513830, 7997919365
- హుస్నాబాద్ మండలం పందిళ్ల వంతెన సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుంచి శ్రీరాములపల్లి గ్రామానికి వస్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారులో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న నలుగురిలో భార్య దివ్య తేజ (32), కుమారుడు నిహాన్ రెడ్డి (11) తీవ్రంగా గాయపడగా, భర్త గంగం శ్రీధర్ రెడ్డి (40), కూతురు శ్రీనిక (6) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.1
- కొదురుపాక రౌండప్ బోర్డు, మరియు బస్సు షెల్టర్, వెంకట్రావు పళ్లి, బస్ షెల్టర్ నిర్మాణం,మోక్షం ఎప్పుడు. సిపిఎం పార్టీ డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక మరియు వెంకట్రావుపల్లి స్టేజీల వద్ద బస్సు సెంటర్లు నిర్మాణం చేయకపోవడం వల్ల అలాగే రౌండప్ బోర్డు సుందరీకరణ పనులకు నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల మరి ఇక్కడున్న మహిళలు బస్సు సెంటర్ లేక , టాయిలెట్, లేక,అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కూర్చోవడానికి వసతులు లేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్న కూడా ఈ ప్రాంతం పాలకులు దృష్టి పెట్టకపోవడం అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అభివృద్ధి విషయంలో దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న కూడా ఇప్పటివరకు కూడా మహిళలకు కనీస సౌకర్యాలు లేకపోవడం మరియు ఒకసారి ఎమ్మెల్యేమేడిపల్లి సత్యం, ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన బస్సు షెల్టర్లు అలాగే టాయిలెట్లు, మరియు రౌండ్ బోర్డ్ సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా మహిళల పక్షాన మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పత్రిక ముఖంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేనిపక్షంలో పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి రహదారి నిరసన చేపడుతామని మండల సిపిఎం పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతుంది.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాయత్రీనగర్ లో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసి జ్యోతి నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమై రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని జిల్లా పార్టీ నేతలకు సూచించారు. 3వ సారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్న మోదీకి ఘనస్వాగతం పలికాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త స్వచ్ఛందంగా తరలిరావాలని కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో జన సమీకరణ చేద్దామన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, కోమాల ఆంజనేయులు, గుగ్గిళ్ల రమేశ్, నల్లాల ఒదేలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.3
- శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం పోలీసు అధికారులు ముమ్మరంగా నాఖాబందీ మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు మరియు సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనిఖీల్లో వెల్లడైన వివరాలు: ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల కింద నమోదైన కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి: సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు: 82 నంబర్ ప్లేట్ లేని వాహనాలు: 21 డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం): 35 మైనర్ డ్రైవింగ్ (వయస్సు నిండని వారు వాహనం నడపడం): 02 ఈ-పెట్టీ (e-Petty) కేసులు: 139 ముఖ్య గమనిక: ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (RC), ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.1
- జగిత్యాల : 👉🏾 3 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయనున్న 796 మంది విద్యార్థులు 👉🏾 SKNR డిగ్రీ కళాశాలలో ఒకటి, JNTU ఇంజనీరింగ్ కాలేజీలో 2 పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా మే మూడవ తేదీన National Testing Agency ద్వారా నిర్వహించబడుతున్న నీట్- 2026 ప్రవేశ పరీక్ష కోసం జగిత్యాలజిల్లాలోఅన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి శనివారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ప్రాధాన్యత గల ఈ పరీక్ష జగిత్యాల జిల్లాలోని మూడు కేంద్రాలలో ఒకటి SKNR Government Arts and Science కాలేజీలో 360 మంది విద్యార్ధులు, మరో రెండు కేంద్రాలు నాచుపల్లి కొండగట్టులోని JNTU ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయని వాటిలో ఒక కేంద్రంలో 240 మంది విద్యార్ధులు, మరొక కేంద్రంలో 196 మంది విద్యార్ధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తం 796 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. దివ్యాంగులైన అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వబడుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వబడదు. 👉🏾 విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కేవలం క్రింది వస్తువులను మాత్రమే తీసుకురావాలి: 👉🏾 అడ్మిట్ కార్డ్ / హాల్ టికెట్ 👉🏾 ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడి / పాన్ కార్డ్ మొదలైనవి) 👉🏾సాధారణ (పారదర్శక) వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించబడుతుంది 👉🏾రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలి 👉🏾అడ్మిట్ కార్డ్ లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరించబడుతుంది. విద్యార్థులు రాయడానికి అవసరమైన పెన్నును పరీక్షా కేంద్రంలోనే NTA అధికారులే అందజేస్తారు. ఆ పెన్నుతోనే పరీక్ష రాయాలి. విద్యార్ధులు క్రింది పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకురావడం నిషేధించబడింది: 👉🏾ఏ విధమైన స్టేషనరీ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, మైక్రోఫోన్లు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్లు, గాగుల్స్, హ్యాండ్ బ్యాగులు, బెల్లట్లు, క్యాప్లు, గడియారాలు (వాచ్లు), బ్రేస్లెట్లు, కెమెరాలు, ఆభరణాలు, మాల్ట్రాక్టీస్కు సంబంధించిన ఏ వస్తువులు, ఆహార పదార్థాలు, లోహ పదార్థాలు తదితరాలు అనుమతించబడవు. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా నీట్ కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రవాణా, ఆరోగ్య, త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖకు కూడా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఫోటో స్టూడియోలు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. నీట్–2026 పరీక్షను పగడ్బందీగా నిర్వహిస్తూ ఎలాంటి తప్పిదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందని కె. బ్రహ్మానంద రెడ్డి తన ప్రకటనలో వివరించారు.1
- కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ ఇంద్రాచౌక్ వద్ద దాదాపు రాత్రి రెండు గంటల సమయంలో అగ్నిప్రమాదం పలు షాపులు దగ్ధమైనట్టు సమాచారం ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం వల్ల ప్రాణమాష్టం జరగలేదు అగ్ని ప్రమాదానికి కారణాలు తెల్వాల్సి ఉంది1
- గజ్వేల్ మండలంలోని అక్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శాసనసభ పక్ష ఉపనేత, మాజీ మంత్రి T. Harish Rao మరియు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ Vanteru Pratap Reddy సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ గులాబీ కండువాలు వేసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన వారిలో బుడుగు ఎల్లం (సింగర్), మాదరబోయిన శేఖర్, మంద రవి, బత్తిని భాను, గుండబోయిన రాజు, దామరకుంట మహేందర్, రాహుల్, విజయ్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ Yadav Reddy, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మరియు మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు గోలి మమత సంతోష్, అత్తిలి, శ్రీనివాస్, మన్నే రూపా వెంకటేష్, కనక సేన, కప్ప పోచయ్య, మాజీ కౌన్సిలర్లు గుంటుకు రాజు, మరికంటి కనకయ్య, అక్కారం మాజీ సర్పంచ్ బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.4
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు ₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.3