logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కల్లేపల్లి లో పద్మకి ఆహుతి అయిన మొక్కజొన్న బాధిత రైతులను ఆదుకోవాలి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు ₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

11 hrs ago
user_ప్రభాకర్
ప్రభాకర్
Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
11 hrs ago
2ca33a59-53e4-4f6f-9197-e57e3512677e

కల్లేపల్లి లో పద్మకి ఆహుతి అయిన మొక్కజొన్న బాధిత రైతులను ఆదుకోవాలి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు

553b1538-0bda-4702-9012-1efddf2b93ce

₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా

ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు ₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    3
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు ₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్(34) ప్రమాదవశాత్తు ఎల్ఎండి లోని బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మిత్రుడితో కలిసి డ్యామ్ వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు బావిలో జారిపోవడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పొరండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ కు భార్య సబిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులతోపాటు పలువురు అధికారులు పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.
    1
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్(34) ప్రమాదవశాత్తు ఎల్ఎండి లోని బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మిత్రుడితో కలిసి డ్యామ్ వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు బావిలో జారిపోవడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శవాన్ని  వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పొరండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ కు భార్య సబిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులతోపాటు పలువురు అధికారులు పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం పోలీసు అధికారులు ముమ్మరంగా నాఖాబందీ మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు మరియు సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ​తనిఖీల్లో వెల్లడైన వివరాలు: ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల కింద నమోదైన కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి: ​సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు: 82 ​నంబర్ ప్లేట్ లేని వాహనాలు: 21 ​డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం): 35 ​మైనర్ డ్రైవింగ్ (వయస్సు నిండని వారు వాహనం నడపడం): 02 ​ఈ-పెట్టీ (e-Petty) కేసులు: 139 ​ముఖ్య గమనిక: ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (RC), ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ​శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
    1
    శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం పోలీసు అధికారులు ముమ్మరంగా నాఖాబందీ మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు మరియు సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
​తనిఖీల్లో వెల్లడైన వివరాలు:
ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల కింద నమోదైన కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
​సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు: 82
​నంబర్ ప్లేట్ లేని వాహనాలు: 21
​డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం): 35
​మైనర్ డ్రైవింగ్ (వయస్సు నిండని వారు వాహనం నడపడం): 02
​ఈ-పెట్టీ (e-Petty) కేసులు: 139
​ముఖ్య గమనిక:
ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (RC), ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
​శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2k రన్. ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు,యువత, విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన 2K రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యత గలవారిగా వ్యవహరించి,డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు.కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో,క్రీడాకారులతో ప్రతిజ్ఞ. "నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు,యువత, ప్రజలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    3
    డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి.
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2k రన్.
ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు,యువత, విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది.
డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన 2K రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ
డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యత గలవారిగా వ్యవహరించి,డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా  అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు.
ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై  విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు.కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో,క్రీడాకారులతో ప్రతిజ్ఞ.
"నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు,యువత, ప్రజలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
  • జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందంతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటల పాటు శ్రమించినప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందంతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటల పాటు శ్రమించినప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల : 👉🏾 3 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయనున్న 796 మంది విద్యార్థులు  👉🏾 SKNR డిగ్రీ కళాశాలలో ఒకటి, JNTU ఇంజనీరింగ్ కాలేజీలో 2 పరీక్ష కేంద్రాలు  దేశవ్యాప్తంగా మే మూడవ తేదీన National Testing Agency ద్వారా నిర్వహించబడుతున్న నీట్- 2026 ప్రవేశ పరీక్ష కోసం జగిత్యాలజిల్లాలోఅన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి శనివారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.  జాతీయ ప్రాధాన్యత గల ఈ పరీక్ష జగిత్యాల జిల్లాలోని  మూడు కేంద్రాలలో ఒకటి SKNR Government Arts and Science కాలేజీలో 360 మంది విద్యార్ధులు, మరో రెండు కేంద్రాలు నాచుపల్లి కొండగట్టులోని JNTU ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయని వాటిలో ఒక కేంద్రంలో 240 మంది విద్యార్ధులు, మరొక కేంద్రంలో 196 మంది విద్యార్ధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తం 796 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. దివ్యాంగులైన అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వబడుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.  మధ్యాహ్నం 1:30 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వబడదు.  👉🏾 విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కేవలం క్రింది వస్తువులను మాత్రమే తీసుకురావాలి: 👉🏾 అడ్మిట్ కార్డ్ / హాల్ టికెట్ 👉🏾 ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడి / పాన్ కార్డ్ మొదలైనవి) 👉🏾సాధారణ (పారదర్శక) వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించబడుతుంది 👉🏾రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలి 👉🏾అడ్మిట్ కార్డ్ లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరించబడుతుంది. విద్యార్థులు రాయడానికి అవసరమైన పెన్నును పరీక్షా కేంద్రంలోనే NTA అధికారులే అందజేస్తారు. ఆ పెన్నుతోనే పరీక్ష రాయాలి. విద్యార్ధులు క్రింది పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకురావడం నిషేధించబడింది: 👉🏾ఏ విధమైన స్టేషనరీ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, మైక్రోఫోన్లు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్లు, గాగుల్స్, హ్యాండ్ బ్యాగులు, బెల్లట్లు, క్యాప్లు, గడియారాలు (వాచ్లు), బ్రేస్లెట్లు, కెమెరాలు, ఆభరణాలు, మాల్ట్రాక్టీస్కు సంబంధించిన ఏ వస్తువులు, ఆహార పదార్థాలు, లోహ పదార్థాలు తదితరాలు అనుమతించబడవు. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా నీట్ కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.  పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రవాణా, ఆరోగ్య, త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  పోలీస్ శాఖకు కూడా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఫోటో స్టూడియోలు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. నీట్–2026 పరీక్షను పగడ్బందీగా నిర్వహిస్తూ ఎలాంటి తప్పిదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందని కె. బ్రహ్మానంద రెడ్డి తన ప్రకటనలో వివరించారు.
    1
    జగిత్యాల :
👉🏾 3 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయనున్న 796 మంది విద్యార్థులు 
👉🏾 SKNR డిగ్రీ కళాశాలలో ఒకటి, JNTU ఇంజనీరింగ్ కాలేజీలో 2 పరీక్ష కేంద్రాలు 
దేశవ్యాప్తంగా మే మూడవ తేదీన National Testing Agency ద్వారా నిర్వహించబడుతున్న నీట్- 2026 ప్రవేశ పరీక్ష కోసం జగిత్యాలజిల్లాలోఅన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి శనివారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. 
జాతీయ ప్రాధాన్యత గల ఈ పరీక్ష జగిత్యాల జిల్లాలోని  మూడు కేంద్రాలలో ఒకటి SKNR Government Arts and Science కాలేజీలో 360 మంది విద్యార్ధులు, మరో రెండు కేంద్రాలు నాచుపల్లి కొండగట్టులోని JNTU ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయని వాటిలో ఒక కేంద్రంలో 240 మంది విద్యార్ధులు, మరొక కేంద్రంలో 196 మంది విద్యార్ధులు హాజరవుతారని పేర్కొన్నారు.
ఈ పరీక్షకు మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తం 796 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు.
ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. దివ్యాంగులైన అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వబడుతుంది.
ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 
మధ్యాహ్నం 1:30 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వబడదు. 
👉🏾 విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కేవలం క్రింది వస్తువులను మాత్రమే తీసుకురావాలి:
👉🏾 అడ్మిట్ కార్డ్ / హాల్ టికెట్
👉🏾 ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడి / పాన్ కార్డ్ మొదలైనవి)
👉🏾సాధారణ (పారదర్శక) వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించబడుతుంది
👉🏾రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలి
👉🏾అడ్మిట్ కార్డ్ లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరించబడుతుంది. విద్యార్థులు రాయడానికి అవసరమైన పెన్నును పరీక్షా కేంద్రంలోనే NTA అధికారులే అందజేస్తారు. 
ఆ పెన్నుతోనే పరీక్ష రాయాలి. విద్యార్ధులు క్రింది పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకురావడం నిషేధించబడింది:
👉🏾ఏ విధమైన స్టేషనరీ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, మైక్రోఫోన్లు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్లు, గాగుల్స్, హ్యాండ్ బ్యాగులు, బెల్లట్లు, క్యాప్లు, గడియారాలు (వాచ్లు), బ్రేస్లెట్లు, కెమెరాలు, ఆభరణాలు, మాల్ట్రాక్టీస్కు సంబంధించిన ఏ వస్తువులు, ఆహార పదార్థాలు, లోహ పదార్థాలు తదితరాలు అనుమతించబడవు.
ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా నీట్ కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. 
పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రవాణా, ఆరోగ్య, త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 
పోలీస్ శాఖకు కూడా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఫోటో స్టూడియోలు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.
నీట్–2026 పరీక్షను పగడ్బందీగా నిర్వహిస్తూ ఎలాంటి తప్పిదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందని కె. బ్రహ్మానంద రెడ్డి తన ప్రకటనలో వివరించారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ​ముఖ్య అంశాలు: ​కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ​తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. ​వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు. ​అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
    1
    స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ):
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
​ముఖ్య అంశాలు:
​కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
​తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు.
​వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు.
​అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
  • హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డుప్రమాదంతో మృతి చెందిన ఆరుగురికి అశృనయనాల మద్య సిరిసిల్ల అంత్యక్రియలు నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉనైన సిరిసిల్ల సర్దార్ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో బొల్లి శివకుమార్ (37) ఆయన భార్య బొల్లి లాస్య (30), వారి కూతురు రిషిక (8) శివకుమార్ బావ కోడం శ్రీనివాస్ (40), శ్రీనివాస్ ఇద్దరు కొడుకులు కోడం మాధవ్ (11), కృష్ణచంద్ర (7) మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించగా ఆసుపత్రి వద్దనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తీవ్ర గాయాల పాలైన కూతురు శ్వేత (35)ను హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లకు సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతదేహాలను సిరిసిల్లకు తరలించి కన్నీటి వీడ్కోలు మద్య అంత్యక్రియలు నిర్వహించారు. బొల్లి రాజు కొడుకు కోడలు అల్లుడు మనువలు, మనుమరాలు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
    2
    హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డుప్రమాదంతో మృతి చెందిన ఆరుగురికి అశృనయనాల మద్య సిరిసిల్ల అంత్యక్రియలు నిర్వహించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉనైన సిరిసిల్ల సర్దార్ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో బొల్లి శివకుమార్ (37) ఆయన భార్య బొల్లి లాస్య (30), వారి కూతురు రిషిక (8) శివకుమార్ బావ కోడం శ్రీనివాస్ (40), శ్రీనివాస్ ఇద్దరు కొడుకులు కోడం మాధవ్ (11), కృష్ణచంద్ర (7) మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించగా ఆసుపత్రి వద్దనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తీవ్ర గాయాల పాలైన  కూతురు శ్వేత (35)ను హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లకు సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతదేహాలను సిరిసిల్లకు తరలించి కన్నీటి వీడ్కోలు మద్య అంత్యక్రియలు నిర్వహించారు. బొల్లి రాజు కొడుకు కోడలు అల్లుడు మనువలు, మనుమరాలు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు  కోల్పోవడంతో కుటుంబసభ్యులు బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.