Shuru
Apke Nagar Ki App…
🟥 బచ్చన్నపేటలో విషాదం: బావిలో మునిగిన యువకుడు గల్లంతు 🟥 జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందంతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటల పాటు శ్రమించినప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.
Mediya wgl medical wgl
🟥 బచ్చన్నపేటలో విషాదం: బావిలో మునిగిన యువకుడు గల్లంతు 🟥 జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందంతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటల పాటు శ్రమించినప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.
More news from తెలంగాణ and nearby areas
- గురజాల సొసైటీ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. రైతులు పండించిన మక్కలకు సరైన ధర లభించడం లేదని, కొనుగోలు కేంద్రం లేక మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కేంద్రం ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రాకపోకలు అంతరాయం కలగగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1
- హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డుప్రమాదంతో మృతి చెందిన ఆరుగురికి అశృనయనాల మద్య సిరిసిల్ల అంత్యక్రియలు నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉనైన సిరిసిల్ల సర్దార్ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో బొల్లి శివకుమార్ (37) ఆయన భార్య బొల్లి లాస్య (30), వారి కూతురు రిషిక (8) శివకుమార్ బావ కోడం శ్రీనివాస్ (40), శ్రీనివాస్ ఇద్దరు కొడుకులు కోడం మాధవ్ (11), కృష్ణచంద్ర (7) మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించగా ఆసుపత్రి వద్దనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తీవ్ర గాయాల పాలైన కూతురు శ్వేత (35)ను హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లకు సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతదేహాలను సిరిసిల్లకు తరలించి కన్నీటి వీడ్కోలు మద్య అంత్యక్రియలు నిర్వహించారు. బొల్లి రాజు కొడుకు కోడలు అల్లుడు మనువలు, మనుమరాలు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.2
- స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్య అంశాలు: కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.1
- జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ ఎం లు, వివిధ విభాగాల హెచ్ఓడి , డీఎం లు.. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం.. మంత్రి పొన్నం ప్రభాకర్ RTC అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణీకులకు సంధించి సానుకూలంగా ఉండాలి ప్రతి డివిజన్ స్థాయి అధికారులను కోరుతున్న సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో సానుకూల దృక్పధంతో పనులు చేయించాలి ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీ గా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలి.. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.. మే 17 లోపల మీ మీ డిపోలో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి.. టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలి 2023 డిసెంబర్ 9 నుండి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చాం ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలి టిక్కెట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోండి, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదు.. సoస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయం.. ప్రతి రెండవ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి..డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలి ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలు ,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు మెయింటేన్ చేయాలి.. ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాక పోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం.. సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి.. మంత్రి నుండి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉందో చూడండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలలాలను సమస్యను పరిష్కరించండి ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దాం..2
- డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2k రన్. ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు,యువత, విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన 2K రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యత గలవారిగా వ్యవహరించి,డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు.కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో,క్రీడాకారులతో ప్రతిజ్ఞ. "నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు,యువత, ప్రజలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.3
- చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నిల్లికట్టు సత్యం మాట్లాడుతూ.. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ల్యాబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- హన్మకొండ జిల్లా వేలేరు మండలం చింతల తండాలో గడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. గడ్డి కట్టలు అనుకోకుండా విద్యుత్ తీగలను తాకడంతో ట్రాక్టర్ డబ్బా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రైతు మలోతు జైపాల్‌కు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ట్రాక్టర్ పూర్తిగా కాలిపోవడంతో జీవనాధారమైన వాహనం కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.1
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం సిరిసిల్లలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన 2K రన్ ను ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. 2కే రన్ లో విద్యార్థులు, క్రీడాకారులు పోలీసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించి, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు. కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.3
- కరీంనగర్ 42వ డివిజన్ భగత్ నగర్ లో సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్, జెడ్ పీ కోటర్స్ లో యోగా ట్రైనర్ మర్రి రాజేందర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు వేసవికాలం దృష్టిలో పెట్టుకొని టవల్స్ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ,సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ బాధ్యులు వి.మోహన్ రెడ్డి,కేశవ రెడ్డి ,అంజన్న, సత్తన్న ,లింగన్న గారు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.. * ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు: "మన ఊరు సుందరంగా ఉండాలన్నా, పరిశుభ్రంగా ఉండాలన్నా దానికి కారణం మన మున్సిపల్ కార్మికులే. వారు ఒక రెండు మూడు రోజులు పని చేయకపోయినా మనం ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం గతంలో చూసాము కూడా. కానీ వారు ఎప్పుడూ అలా జరగాలని కోరుకోరు. వారికి ఎన్ని బాధలున్నా ఉదయం 4 గంటలకే ఇంటి నుండి బయలుదేరి 5 గంటలకు అటెండెన్స్ ఇచ్చి, చీకటిలోనే అనేక ప్రమాదాలకు ఎదుర్కొని పనులు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు కావొచ్చు, వీధి కుక్కలు కావొచ్చు.. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తట్టుకొని మనకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు మన మున్సిపల్ కార్మికులు. మన ఇంట్లో ఒక రోజు చెత్త తీయకపోయినా వచ్చే వాసనను మనం భరించలేము. అటువంటిది వారు సమాజంలోని చెత్తనంతా తొలగిస్తూ, అనారోగ్య పాలవుతూ కూడా మనకు సేవ చేస్తున్నారు. వారికి ఎంత చేసినా తక్కువే అని మేము భావిస్తున్నాము. అందుకే గతంలో మా పాలకవర్గం ఉన్న సమయంలో, మనుషులు డ్రైనేజీలలోకి దిగకూడదనే ఉద్దేశంతో అధునాతన మెషినరీని (Suction and Jetting Machines) తీసుకువచ్చాము. దీనివల్ల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చి 'సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్'లో 4 కోట్ల రూపాయల నగదు బహుమతిని గెలుచుకోవడం జరిగింది. భారతదేశంలో కరీంనగర్ కు రెండో స్థానం దక్కింది. మున్సిపల్ కార్మికుల కష్టానికి ప్రస్తుతం ఇస్తున్న 16 వేల రూపాయల వేతనం చాలా తక్కువ. దానిని కనీసం 25 వేల రూపాయలకు పెంచాలని నిన్న మే డే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. చుట్టుపక్కల ఏదైనా పంది లేదా కుక్క చనిపోతే వచ్చే వాసనకే మనం కార్పొరేటర్లకు ఎన్నో సార్లు ఫోన్ చేస్తాము. అటువంటి దుర్వాసనను భరిస్తూ గంటల తరబడి పనిచేసి మనకు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇస్తున్న సఫాయి కార్మికులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." "సఫాయి కార్మికుల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఎంతో ఎండలో కూడా మీరు చేస్తున్న పనిని గుర్తించి, మంచి నీళ్ల సీసా, టవల్ అందించేందుకు ముందుకు వచ్చిన రాజేందర్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సఫాయి కార్మికులందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా, కార్మికుల ఆరోగ్య బీమా గురించి కూడా నగరపాలక సంస్థ ఆలోచిస్తోంది. గతంలో 60 ఏళ్లు దాటితే మానవత్వం లేకుండా కార్మికులను తొలగించే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ నిబంధన మార్చి, అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది ఎదురైనా వారి కుటుంబ సభ్యులకు ఆ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ, తగినంత జీతాలు లేవని మాకు తెలుసు. కార్మికుల జీతాలు పెంచేందుకు మా పాలక వర్గం ఖచ్చితంగా కృషి చేస్తుంది. నగరం శుభ్రంగా ఉండటానికి మీరు చేస్తున్న కృషికి నగర ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.1