*సఫాయి కార్మికుల సేవలు వెలకట్టలేనివి: కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మున్సిపల్ కార్మికులకు టవల్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ* కరీంనగర్ 42వ డివిజన్ భగత్ నగర్ లో సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్, జెడ్ పీ కోటర్స్ లో యోగా ట్రైనర్ మర్రి రాజేందర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు వేసవికాలం దృష్టిలో పెట్టుకొని టవల్స్ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ,సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ బాధ్యులు వి.మోహన్ రెడ్డి,కేశవ రెడ్డి ,అంజన్న, సత్తన్న ,లింగన్న గారు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.. * ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు: "మన ఊరు సుందరంగా ఉండాలన్నా, పరిశుభ్రంగా ఉండాలన్నా దానికి కారణం మన మున్సిపల్ కార్మికులే. వారు ఒక రెండు మూడు రోజులు పని చేయకపోయినా మనం ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం గతంలో చూసాము కూడా. కానీ వారు ఎప్పుడూ అలా జరగాలని కోరుకోరు. వారికి ఎన్ని బాధలున్నా ఉదయం 4 గంటలకే ఇంటి నుండి బయలుదేరి 5 గంటలకు అటెండెన్స్ ఇచ్చి, చీకటిలోనే అనేక ప్రమాదాలకు ఎదుర్కొని పనులు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు కావొచ్చు, వీధి కుక్కలు కావొచ్చు.. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తట్టుకొని మనకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు మన మున్సిపల్ కార్మికులు. మన ఇంట్లో ఒక రోజు చెత్త తీయకపోయినా వచ్చే వాసనను మనం భరించలేము. అటువంటిది వారు సమాజంలోని చెత్తనంతా తొలగిస్తూ, అనారోగ్య పాలవుతూ కూడా మనకు సేవ చేస్తున్నారు. వారికి ఎంత చేసినా తక్కువే అని మేము భావిస్తున్నాము. అందుకే గతంలో మా పాలకవర్గం ఉన్న సమయంలో, మనుషులు డ్రైనేజీలలోకి దిగకూడదనే ఉద్దేశంతో అధునాతన మెషినరీని (Suction and Jetting Machines) తీసుకువచ్చాము. దీనివల్ల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చి 'సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్'లో 4 కోట్ల రూపాయల నగదు బహుమతిని గెలుచుకోవడం జరిగింది. భారతదేశంలో కరీంనగర్ కు రెండో స్థానం దక్కింది. మున్సిపల్ కార్మికుల కష్టానికి ప్రస్తుతం ఇస్తున్న 16 వేల రూపాయల వేతనం చాలా తక్కువ. దానిని కనీసం 25 వేల రూపాయలకు పెంచాలని నిన్న మే డే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. చుట్టుపక్కల ఏదైనా పంది లేదా కుక్క చనిపోతే వచ్చే వాసనకే మనం కార్పొరేటర్లకు ఎన్నో సార్లు ఫోన్ చేస్తాము. అటువంటి దుర్వాసనను భరిస్తూ గంటల తరబడి పనిచేసి మనకు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇస్తున్న సఫాయి కార్మికులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." "సఫాయి కార్మికుల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఎంతో ఎండలో కూడా మీరు చేస్తున్న పనిని గుర్తించి, మంచి నీళ్ల సీసా, టవల్ అందించేందుకు ముందుకు వచ్చిన రాజేందర్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సఫాయి కార్మికులందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా, కార్మికుల ఆరోగ్య బీమా గురించి కూడా నగరపాలక సంస్థ ఆలోచిస్తోంది. గతంలో 60 ఏళ్లు దాటితే మానవత్వం లేకుండా కార్మికులను తొలగించే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ నిబంధన మార్చి, అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది ఎదురైనా వారి కుటుంబ సభ్యులకు ఆ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ, తగినంత జీతాలు లేవని మాకు తెలుసు. కార్మికుల జీతాలు పెంచేందుకు మా పాలక వర్గం ఖచ్చితంగా కృషి చేస్తుంది. నగరం శుభ్రంగా ఉండటానికి మీరు చేస్తున్న కృషికి నగర ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.

- శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం పోలీసు అధికారులు ముమ్మరంగా నాఖాబందీ మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు మరియు సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనిఖీల్లో వెల్లడైన వివరాలు: ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల కింద నమోదైన కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి: సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు: 82 నంబర్ ప్లేట్ లేని వాహనాలు: 21 డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం): 35 మైనర్ డ్రైవింగ్ (వయస్సు నిండని వారు వాహనం నడపడం): 02 ఈ-పెట్టీ (e-Petty) కేసులు: 139 ముఖ్య గమనిక: ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (RC), ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్(34) ప్రమాదవశాత్తు ఎల్ఎండి లోని బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మిత్రుడితో కలిసి డ్యామ్ వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు బావిలో జారిపోవడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పొరండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ కు భార్య సబిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులతోపాటు పలువురు అధికారులు పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.1
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెలుకల కొండల రెడ్డి, చెలుకల ప్రతాప్ రెడ్డి, చెలుకల కేశవరెడ్డి రైతులకు చెందిన పంట కాలిపోవడంతో సుమారు ₹10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. కాలిపోయిన పొలాలను పరిశీలించి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నష్టపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన రైతు సంక్షేమ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన పంటకు ఎకరానికి కనీసం ₹25 వేల చొప్పున నష్టపరిహారం వెంటనే అందించాలని, అదనంగా విద్యుత్ శాఖ ద్వారా కూడా పరిహారం కల్పించాలని కోరారు. అలాగే ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.3
- డ్రగ్స్ మహమ్మరిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రతి విద్యార్థి,యువత యాంటీ డ్రగ్ సోల్జర్ మారాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2k రన్. ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు,యువత, విద్యార్థులు,పోలీస్ అధికారులు,సిబ్బంది. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన 2K రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యత గలవారిగా వ్యవహరించి,డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు.విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు.కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ర్యాలీ కి వచ్చిన విద్యార్థులతో,క్రీడాకారులతో ప్రతిజ్ఞ. "నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను."ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు శ్రీకాంత్, డిసిపిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు,యువత, ప్రజలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.3
- జగిత్యాల : 👉🏾 3 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయనున్న 796 మంది విద్యార్థులు 👉🏾 SKNR డిగ్రీ కళాశాలలో ఒకటి, JNTU ఇంజనీరింగ్ కాలేజీలో 2 పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా మే మూడవ తేదీన National Testing Agency ద్వారా నిర్వహించబడుతున్న నీట్- 2026 ప్రవేశ పరీక్ష కోసం జగిత్యాలజిల్లాలోఅన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి శనివారం సాయంత్రం 5-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ప్రాధాన్యత గల ఈ పరీక్ష జగిత్యాల జిల్లాలోని మూడు కేంద్రాలలో ఒకటి SKNR Government Arts and Science కాలేజీలో 360 మంది విద్యార్ధులు, మరో రెండు కేంద్రాలు నాచుపల్లి కొండగట్టులోని JNTU ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయని వాటిలో ఒక కేంద్రంలో 240 మంది విద్యార్ధులు, మరొక కేంద్రంలో 196 మంది విద్యార్ధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తం 796 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. దివ్యాంగులైన అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వబడుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వబడదు. 👉🏾 విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కేవలం క్రింది వస్తువులను మాత్రమే తీసుకురావాలి: 👉🏾 అడ్మిట్ కార్డ్ / హాల్ టికెట్ 👉🏾 ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడి / పాన్ కార్డ్ మొదలైనవి) 👉🏾సాధారణ (పారదర్శక) వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించబడుతుంది 👉🏾రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలి 👉🏾అడ్మిట్ కార్డ్ లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరించబడుతుంది. విద్యార్థులు రాయడానికి అవసరమైన పెన్నును పరీక్షా కేంద్రంలోనే NTA అధికారులే అందజేస్తారు. ఆ పెన్నుతోనే పరీక్ష రాయాలి. విద్యార్ధులు క్రింది పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకురావడం నిషేధించబడింది: 👉🏾ఏ విధమైన స్టేషనరీ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, మైక్రోఫోన్లు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాలెట్లు, గాగుల్స్, హ్యాండ్ బ్యాగులు, బెల్లట్లు, క్యాప్లు, గడియారాలు (వాచ్లు), బ్రేస్లెట్లు, కెమెరాలు, ఆభరణాలు, మాల్ట్రాక్టీస్కు సంబంధించిన ఏ వస్తువులు, ఆహార పదార్థాలు, లోహ పదార్థాలు తదితరాలు అనుమతించబడవు. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా నీట్ కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రవాణా, ఆరోగ్య, త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖకు కూడా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఫోటో స్టూడియోలు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. నీట్–2026 పరీక్షను పగడ్బందీగా నిర్వహిస్తూ ఎలాంటి తప్పిదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందని కె. బ్రహ్మానంద రెడ్డి తన ప్రకటనలో వివరించారు.1
- *మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు వావిలాల నవీన్ అకాల మృతి పట్ల ఏఐటియుసి నివాళి************ *నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి నవీన్ భార్య కృష్ణవేణికి ఎద విధిగా కొనసాగించాలి****** *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు డిమాండ్*** జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వావిలాల నవీన్ మృతికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా ఇచ్చే మట్టి ఖర్చులు తో పాటు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు గత సంవత్సరంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కృష్ణవేణి కొనసాగుతున్నదని గత తొమ్మిది నెల క్రితం డెలివరీ అయినందున ఆరోగ్యం బాగాలేక పనిచేయలేక బదిలీ మనిషిని పెట్టడం జరిగిందన్నారు ఆసీ పరిపాలిని ఆమెకు యధావిధిగా కొనసాగించాలని కోరారు ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి చనిపోవడంతో మృతి చెందిన వావిలాల నవీన్ కు ప్రమాద బీమా ఆర్థిక సాయం ప్రభుత్వపరంగా వెంటనే అందించి ఆదుకోవాలని కోరారు కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడం పట్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు డ్యూటీకి వచ్చి హాజరి వెయ్యమని అడిగితే వెళ్ళగొట్టడం సరికాదని పరిస్థితుల్లో కార్మికుడు మనోవేదనకు గురి అవుతాడని ఆవేదన వ్యక్తం చేశారు పనిలేని స్థితిలో అయోమయంలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుందన్నారు దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులే వహించాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు గంగారాం రాజం రమేష్ రవి నవీన్ తదితరులు పాల్గొని నవీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు1
- జనగామ జిల్లా కేంద్రంలోని బచ్చన్నపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందంతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. మూడు గంటల పాటు శ్రమించినప్పటికీ మృతదేహం ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.1
- జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ ఎం లు, వివిధ విభాగాల హెచ్ఓడి , డీఎం లు.. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం.. మంత్రి పొన్నం ప్రభాకర్ RTC అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణీకులకు సంధించి సానుకూలంగా ఉండాలి ప్రతి డివిజన్ స్థాయి అధికారులను కోరుతున్న సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో సానుకూల దృక్పధంతో పనులు చేయించాలి ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీ గా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలి.. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.. మే 17 లోపల మీ మీ డిపోలో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి.. టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలి 2023 డిసెంబర్ 9 నుండి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చాం ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలి టిక్కెట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోండి, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదు.. సoస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయం.. ప్రతి రెండవ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి..డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలి ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలు ,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు మెయింటేన్ చేయాలి.. ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాక పోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం.. సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి.. మంత్రి నుండి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉందో చూడండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలలాలను సమస్యను పరిష్కరించండి ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దాం..2