logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లా రామంచ లో కన్నుల పండువలా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం...భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువలా నిర్వహించారు. ప్రతియేటా వైశాఖ మాస వసంత ఋతువు శుక్ల పక్ష పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించి ఆలయ సన్నిధిలో ముత్యాల పందిరిలో స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసిల్దార్ మహేష్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించి అన్నదానం చేశారు. మహిళా భక్తులు స్వామివారికి ఓడి బియ్యం పోశారు. కళ్యాణోత్సవంలో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, ధర్మకర్తలు ఆంజనేయులు, సతీష్, సంపత్ పాల్గొన్నారు.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

కరీంనగర్ జిల్లా రామంచ లో కన్నుల పండువలా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం...భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువలా నిర్వహించారు. ప్రతియేటా వైశాఖ మాస వసంత ఋతువు శుక్ల పక్ష పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించి ఆలయ సన్నిధిలో ముత్యాల పందిరిలో స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసిల్దార్ మహేష్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించి అన్నదానం చేశారు. మహిళా భక్తులు స్వామివారికి ఓడి బియ్యం పోశారు. కళ్యాణోత్సవంలో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, ధర్మకర్తలు ఆంజనేయులు, సతీష్, సంపత్ పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షల కనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలతో 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాల్లో 29 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన మూడు అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన, అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు.
    1
    ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య  అతిథిగా హాజరైన మంత్రి, ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షల కనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలతో 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాల్లో 29 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన మూడు అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన, అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య  చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ* కార్మికుల శ్రమతోనే దేశం, రాష్ట్రం, నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. శానిటేషన్ కార్మికుల నగరాన్ని శుభ్రం చేస్తుండటంతోనే మనం ఆరోగ్యంగా ఉంటున్నామని వివరించారు. వారి భద్రత, బీమా, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వేతన సవరణ చేపట్టి జీతాలు పెంచుతామని పేర్కొన్నారు. *డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ* కార్మికుల సంక్షేమానికి కలిసికట్టుగా కృషి చేద్దామని పేర్కొన్నారు. అంతకుముందు *రాష్ట్ర కార్మిక శాఖ రూపొందించిన బ్రోచర్ ఆవిష్కరించారు
    1
    మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ* కార్మికుల శ్రమతోనే దేశం, రాష్ట్రం, నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. శానిటేషన్ కార్మికుల నగరాన్ని శుభ్రం చేస్తుండటంతోనే మనం ఆరోగ్యంగా ఉంటున్నామని వివరించారు. వారి భద్రత, బీమా, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వేతన సవరణ చేపట్టి జీతాలు పెంచుతామని పేర్కొన్నారు.
*డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ* కార్మికుల సంక్షేమానికి కలిసికట్టుగా కృషి చేద్దామని పేర్కొన్నారు.
అంతకుముందు *రాష్ట్ర కార్మిక శాఖ రూపొందించిన బ్రోచర్  ఆవిష్కరించారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • గన్నేరువరం: మండలంలోని సుప్రసిద్ధ శ్రీ స్వయంభు మనసా దేవి ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు శుక్రవారం వేడుకల్లో భాగంగా అన్నపూర్ణాదేవి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, శ్రీ చక్రానికి ఒక లక్ష ఎనిమిది వేల నాణములతో అభిషేకం నిర్వహించారు. 108 కళాశాలతో మానసా దేవి అమ్మవారికి అభిషేకం చేశారు. చండీ హోమం, కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం వైశాఖ పౌర్ణమి కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి వారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం: మండలంలోని సుప్రసిద్ధ శ్రీ స్వయంభు మనసా దేవి ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు శుక్రవారం వేడుకల్లో భాగంగా అన్నపూర్ణాదేవి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, శ్రీ చక్రానికి ఒక లక్ష ఎనిమిది వేల నాణములతో అభిషేకం నిర్వహించారు. 108 కళాశాలతో మానసా దేవి అమ్మవారికి అభిషేకం చేశారు. చండీ హోమం, కుంకుమార్చనలు  నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం వైశాఖ పౌర్ణమి కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి వారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • తొర్రూరు: మండల కేంద్రం సమీపంలో ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్ మరియు ప్రయాణికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బస్సులో టికెట్ లేని ప్రయాణికుడిని సాకుగా చూపి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సదరు అధికారి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్, ప్రయాణికులతో కలిసి అధికారిని నడిరోడ్డుపై నిలదీసి చెప్పుతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
    1
    తొర్రూరు: మండల కేంద్రం సమీపంలో ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్ మరియు ప్రయాణికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బస్సులో టికెట్ లేని ప్రయాణికుడిని సాకుగా చూపి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సదరు అధికారి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన కండక్టర్, ప్రయాణికులతో కలిసి అధికారిని నడిరోడ్డుపై నిలదీసి చెప్పుతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    4 hrs ago
  • RAJASHEKAR
    5
    RAJASHEKAR
    user_ENNAM RAJASHEKAR
    ENNAM RAJASHEKAR
    Farmer రామడుగు, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
    2
    ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    14 hrs ago
  • పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నదిని సందర్శించిన మంత్రి, నదిలో స్వచ్ఛమైన నీరు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి, భవన నిర్మాణంలో కొన్ని మార్పులు సూచించారు. ప్రతి గది స్పష్టంగా కనిపించేలా ఉండాలని, సమృద్ధిగా గాలి, వెలుతురు వచ్చే విధంగా నిర్మాణం చేయాలని తెలిపారు. విద్యుత్ వినియోగం సమర్థవంతంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి గదికి కిటికీలు ఉండాలని సూచించారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఎంఆర్వో, ఆర్డీవో, సమగ్ర మండల కార్యాలయ సముదాయాలను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలోని పాత భవనాన్ని ఐటి శాఖకు కేటాయించి పునరుద్ధరణ చేపట్టాలని మంత్రి సూచించారు. మంథనిలోని అయ్యగారి చెరువును సందర్శించిన మంత్రి, బండ్ సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రహదారి క్లియర్ చేసే చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. అలాగే టాస్క్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి, కొన్ని చిన్న మార్పులు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీవో సురేష్, ఎమ్మార్వో ఆరిఫ్ ఉద్దీన్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్, అధికారులు, మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి,తదితరులు మంత్రితో పాటు పాల్గొన్నారు.
    4
    పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథనిలో మంత్రి  శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నదిని సందర్శించిన మంత్రి, నదిలో స్వచ్ఛమైన నీరు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి, భవన నిర్మాణంలో కొన్ని మార్పులు సూచించారు. ప్రతి గది స్పష్టంగా కనిపించేలా ఉండాలని, సమృద్ధిగా గాలి, వెలుతురు వచ్చే విధంగా నిర్మాణం చేయాలని తెలిపారు. విద్యుత్ వినియోగం సమర్థవంతంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి గదికి కిటికీలు ఉండాలని సూచించారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఎంఆర్వో, ఆర్డీవో, సమగ్ర మండల కార్యాలయ సముదాయాలను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఎంపీడీవో కార్యాలయంలోని పాత భవనాన్ని ఐటి శాఖకు కేటాయించి పునరుద్ధరణ చేపట్టాలని మంత్రి సూచించారు. మంథనిలోని అయ్యగారి చెరువును సందర్శించిన మంత్రి, బండ్ సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రహదారి క్లియర్ చేసే చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు.
అలాగే టాస్క్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి, కొన్ని చిన్న మార్పులు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో ఆర్డీవో సురేష్, ఎమ్మార్వో ఆరిఫ్ ఉద్దీన్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్, అధికారులు, మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి,తదితరులు మంత్రితో పాటు పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపనలో సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బైండ్ల పంబాల కళాకారులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. జమదగ్ని మహర్షితో ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.
    1
    హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపనలో సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బైండ్ల పంబాల కళాకారులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. జమదగ్ని మహర్షితో ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్, సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
    3
    ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల  డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల  డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్,  సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.